S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/31/2017 - 00:03

అమరావతి, అక్టోబర్ 30: కడప జిల్లాకు చెందిన టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

10/31/2017 - 00:02

విజయవాడ, అక్టోబర్ 30: తనకు కాంట్రాక్టులు ఉంటే తీసుకోవచ్చని ఇటీవల టిడిపిని వీడిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో తన చాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన విలేఖరులు వ్యాఖ్యలపై ప్రస్తావించగా యనమల పై విధంగా స్పందించారు. అంతేకాకుండా ఆ కాంట్రాక్టులపై వచ్చే కమీషన్ కూడా రేవంత్ తీసుకోవచ్చన్నారు.

10/30/2017 - 23:37

విజయవాడ, అక్టోబర్ 30: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ రంగంలోనూ అభివృద్ధి సాధ్యం కాదని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ‘బడి రుణం తీర్చుకుందాం’ పథకం కింద పూర్వ విద్యార్థులకు ఉత్తరాలు రాసే కార్యక్రమాన్ని ప్రాజెక్టు కార్యాలయంలో ఆయన సోమవారం ప్రారంభించారు. ప్రతి అధికారి ఒక పూర్వ విద్యార్థి చిరునామా తెలుసుకుని, ఉత్తరం రాసి స్ఫూర్తినివ్వాలని పిలుపునిచ్చారు.

10/30/2017 - 23:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: వైకాపా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై జరిగిన దాడి ఘటనపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు డిజిపి సాంబశివరావు వెల్లడించారు. పోలీసులకు ఎలాంటి భేదభావం ఉండదని, జక్కంపూడి రాజా ఘటనపై నిష్పాక్షిపాతంగా విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

10/30/2017 - 23:36

ఒంగోలు, అక్టోబర్ 30 : రాష్ట్రంలోని మంత్రుల అవినీతి , కుంభకోణాలపై న్యాయ విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మధు మాట్లాడుతూ మంత్రులు, వారి అనుచరుల అవినీతిపై స్వయంగా పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

10/30/2017 - 23:35

తిరుపతి, అక్టోబర్ 30 : రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తరచూ తలెత్తుతున్న నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే తాము విస్తృతంగా పర్యటిస్తున్నట్లు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బి రాజేంద్రనాథ్ తెలిపారు.

10/30/2017 - 23:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యను పరిష్కారించాలని కేంద్రాన్ని, భారత వైద్య విద్యా విధాన మండలిని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కామినేని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూధన్‌ను, భారత వైద్య విద్యా విధాన మండలి (ఎంసీఐ) సభ్యులను కలిశారు.

10/30/2017 - 04:30

విజయవాడ, అక్టోబర్ 29: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న ఏపిఎస్ ఆర్టీసీ తాజాగా విస్తృత ప్రచారంలోకి తీసుకొస్తున్న రాయితీలతో కూడిన ప్రయాణాలు ఓవైపు ప్రయాణికులకు వరంలా, మరోవైపు సంస్థ పాలిట కల్పతరువుగా మారుతున్నాయి. ప్రైవేట్ వాహనాల జోరుకు కళ్లెం పడుతుండటంతో ఆర్టీసీలో క్రమేణా ఆక్యుపెన్సీ రేషియో (వోఆర్) గణనీయంగా పెరుగుతుంటే అదే స్థాయిలో రాబడి కూడా మెరుగవుతోంది.

10/30/2017 - 04:28

విశాఖపట్నం, అక్టోబర్ 29: భారతదేశంలో పుట్టి, ఇక్కడే ఉంటూ జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను అవమానించే వారు దేశంలో ఉండేందుకు అనర్హులని బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని, అయితే, జాతీయ గీతం, జెండాలను గౌరవించడం భారత పౌరునిగా వాళ్ళ బాధ్యతని పేర్కొన్నారు.

10/30/2017 - 04:27

విజయవాడ (బెంజిసర్కిల్), అక్టోబర్ 29: ప్రజల కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పాదయాత్ర తలపెట్టారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టిజెఆర్ సుధాకర్‌బాబు అన్నారు. ప్రజాసంకల్ప యాత్రతో ప్రజల వద్దకు జగన్ వెళ్తుంటే మంత్రులు అవాకులు చవాకులు పేలుతున్నారని, వారి పదవుల గౌరవం కాపాడేలా వ్యవహరిస్తే మంచిదని సూచించారు.

Pages