S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/02/2017 - 00:46

హైదరాబాద్, నవంబర్ 1: ఇక మీదట రైతులుకు బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ నిబంధనలు విధించడం దారుణమని వైఎస్‌ఆర్‌సిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతాంగాన్ని బ్యాంకులకు దూరం చేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటమేనని ఆయన మండిపడ్డారు. సన్న, చిన్నకారు రైతాంగానికి పాన్‌కార్డు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.

11/02/2017 - 00:45

తిరుపతి, నవంబర్ 1: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల మధ్య శ్రీ ఉగ్రశ్రీనివాస మూర్తి ఉభయనాంచారులతో కలిసి మాడ వీధులలో ఊరేగించారు. ఆ తరువాత అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు.

11/01/2017 - 23:40

విజయవాడ, నవంబర్ 1: ‘నా పిల్లలైతే ఏవిధంగా న్యాయం చేస్తానో అలానే మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేలా చూస్తా’.. అంటూ ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి కళాశాల విద్యార్థులు వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిశారు.

11/01/2017 - 23:40

విజయవాడ, నవంబర్ 1: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపాదించింది. కచ్చితంగా ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

11/01/2017 - 23:39

విజయవాడ, నవంబర్ 1: రాష్ట్రంలో కోల్డ్‌చైన్, మీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. తిరుపతిలో సైన్స్ సిటీ, రాజధాని ప్రాంతంలో కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం 3838 ఎకరాల భూమి సిఆర్‌డిఏకు ఉచితంగా అప్పగించేందుకు నిర్ణయించింది.

11/01/2017 - 23:32

విజయవాడ, నవంబర్ 1: ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి కుదింపునకు సంబంధించి ఉత్తర్వుల ముసాయిదా లీక్ వ్యవహారంలో మరొకరిపై ప్రభుత్వం వేటు వేసింది. తాజాగా జలవనరుల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను 50 ఏళ్లకే పదవీ విరమణ చేయించేందుకు వీలుగా తయారుచేసిన ఉత్తర్వుల ముసాయిదా గతంలో లీకైన విషయం తెలిసిందే.

11/01/2017 - 03:46

విజయవాడ, అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంగళవారం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పాటించింది. ఉదయం తన నివాసం నుంచి సచివాలయానికి బయల్దేరే ముందు ముఖ్యమంత్రి అక్కడ అందుబాటులో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

11/01/2017 - 03:41

విజయవాడ, అక్టోబర్ 31: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో లక్ష్యాలను మించి 27.60 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం ఉదయం ప్లానింగ్ శాఖ అధికారులతో మొదటి, రెండవ త్రైమాసిక ఫలితాలను మంత్రి సమీక్షించారు.

11/01/2017 - 03:40

తుని, అక్టోబర్ 31: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో మహిళలపై దాడుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉండటం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మహిళా సాధికార సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

11/01/2017 - 03:38

విశాఖపట్నం, అక్టోబర్ 31: కబ్జాకోరులు, రౌడీలు, రేపిస్టులతో విశాఖకు అపఖ్యాతి వస్తోందని, ప్రశాంత నగరంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మహిళలపై దాడులకు నిరసనగా వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి నెలకొందన్నారు.

Pages