S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/30/2017 - 03:51

ఖాజీపేట, అక్టోబర్ 29: కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని కొమ్మలూరు గ్రామం వద్ద ఆదివారం ముగ్గురు పశువుల కాపరులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. అయితే వారిలో ఒకరు మృతిచెందగా, మరొకరు సురక్షితంగా బయటపడగా ఇంకొకరి ఆచూకీ లభించలేదు. వివరాలు.. కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి విజయలక్ష్మి(40), సయ్యద్ కరీముల్లా, బీబీ పశువులు మేపేందుకు పెన్నానది అవతలి ఒడ్డుకు వెళ్లారు.

10/30/2017 - 03:14

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్న కంచ ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలని ఆర్య వైశ్య మహాసభ డిమాండ్ చేసింది. ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘కోమటోళ్లు- సామాజిక స్మగ్లర్లు’ పుస్తకంపై వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ పుస్తకాన్ని నిషేధించాలంటూ ఢిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్ వద్ద ఆర్య వైశ్య మహాసభ ఆదివారం ధర్నా నిర్వహించింది.

10/29/2017 - 04:44

విజయవాడ (క్రైం), అక్టోబర్ 28: ‘కోమటోళ్ళు స్మగ్లర్లు’ పుస్తక రచయిత కంచ ఐలయ్య ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పడింది. గత కొంతకాలంగా విజయవాడలో జరుగుతున్న వివాదానికి తెరపడింది. రెండు వర్గాలు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపాయి. ఐలయ్య అనుకూల వర్గం, వ్యతిరేక వర్గాలు తలపెట్టిన పోటాపోటీ సభలు శనివారం కార్యరూపం దాల్చలేదు.

10/29/2017 - 04:43

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 28: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులపై యుద్ధానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. నాడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేదరికం, దేశ శత్రువులపై యుద్ధం చేస్తే.. నేటి పాలకులు ప్రజలు వాడే కరెన్సీపై కూడా యుద్ధం చేస్తున్నారన్నారు.

10/29/2017 - 04:42

ఖమ్మం, అక్టోబర్ 28: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభంతో ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉండగా అనేక మంది నేతలు, పార్టీ కార్యకర్తలు జాతీయ ఉపాధ్యక్షుడు సండ్ర వెంకటవీరయ్య నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. పాత ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో గట్టి పట్టు కలిగిన నాయకునిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య.. రేవంత్‌రెడ్డితో పార్టీని వీడతారా.. లేదా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

10/29/2017 - 03:31

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 28: మలేషియా నుంచి విడిపోయిన తరువాత సింగపూర్‌లో జరిగిన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై అవగాహన కల్పించేందుకే అమరావతి రైతులను సింగపూర్‌కు తీసుకెళ్తున్నట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ చెప్పారు. శనివారం నగరంలోని సిఆర్‌డిఎ కార్యాలయంలో సింగపూర్ టూర్‌కు ఎంపికైన రైతుల్లో తొలి బృందం రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

10/29/2017 - 03:30

విజయవాడ, అక్టోబర్ 28: కాపు నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు.

10/29/2017 - 03:30

విజయవాడ, అక్టోబర్ 28: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి దానికి శ్రీకారం చుట్టింది, అసలు ఫిరాయింపులకు పితామహుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు.

10/29/2017 - 03:28

విజయవాడ, అక్టోబర్ 28: రాష్ట్రంలో చోటుచేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. విజయవాడలో బస్సు సృష్టించిన భీభత్సం, తూర్పు గోదావరి జిల్లా మోడేకుర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వరుస రోడ్డు ప్రమాదాలపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

10/29/2017 - 03:27

విజయవాడ, అక్టోబర్ 28: విమానంలోనే పడుకున్నా.. అక్కడే ముఖం కడుక్కుని.. స్నానం చేశా.. అంటూ తొమ్మిది రోజుల 3 ఖండాల పర్యటనలో తన అనుభవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. అమెరికా, యుఎఇ, బ్రిటన్ పర్యటన ముగించుకుని, రాష్ట్రానికి వచ్చిన సిఎం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కోసారి స్నానం చేయకుండానే సమావేశాలకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు.

Pages