S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/16/2017 - 23:24

ఒంగోలు, సెప్టెంబర్ 16: వనం -మనం కార్యక్రమంలో ప్రతిఒక్కరు పాల్గొని పచ్చదనం పెంపుదలకు కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. శనివారం వనం -మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీని కలెక్టరేట్ ఎదుట మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వనం-మనం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు.

09/16/2017 - 23:23

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని వైస్‌చాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం ఏపి భవన్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఢిల్లీ చాప్టర్ ప్రారంభించారు.

09/16/2017 - 04:03

విజయవాడ, సెప్టెంబర్ 15: ‘అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతిని సమూలంగా నిర్మూలించాలనేది నా లక్ష్యం. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై వేగంగా, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 80 శాతం సంతృప్తి తీసుకురావాలంటే అవినీతి ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనని ఆయన శుక్రవారం సాయంత్రం శాఖాధిపతుల సమావేశంలో ఆదేశించారు.

09/16/2017 - 04:00

నిడదవోలు, సెప్టెంబర్ 15: స్టడీ అవర్స్‌లో తోటి విద్యార్థితో మాట్లాడుతున్నాడనే ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయుడు క్లిప్ ఉన్న ప్యాడ్ విసిరేయడంతో టెన్త్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాడ్‌కు ఉన్న లోహపు క్లిప్ బుగ్గలోకి దూసుకుపోవడంతో ఆరు నెలల పాటు ఆ విద్యార్థి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాల్సివుంది. నిడదవోలులో ఒక ప్రైవేటు పాఠశాలో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...

09/16/2017 - 02:12

తిరుపతి, సెప్టెంబర్ 15: ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచేందుకే గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తాను కాలికి శస్తచ్రికిత్స చేయించుకున్నానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చిన్నపిల్లలకు సూదిమందు వికటించిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి రుయా ను సందర్శించారు. అనంతరం తన మొక్కును తీర్చుకోవడంలో భాగం గా అలిపిరి కాలినడక దారి గుండా తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

09/16/2017 - 02:08

విశాఖపట్నం, సెప్టెంబర్ 15: ప్రజలకు మంచి పాలన అందించే బాధ్య త ప్రభుత్వాలపై ఉందని, మంచి పాలన సాధించేందుకు ప్రజలు సంఘటితంగా ఉద్యమించాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. ప్రజల కోసం, వారిని భాగస్వామ్యం చేస్తూ చేపట్టిన ‘సురాజ్య యాత్ర’ను విశాఖలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజల ఉజ్వల భవిష్యత్ కోసం జరుగుతున్న ఈ యాత్రలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు.

09/16/2017 - 02:08

తిరుపతి, సెప్టెంబర్ 15: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఈనెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారు విహరించనున్న అన్ని వాహనాలను సిద్ధం చేశామని తిరుపతి జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. భక్తులకు అవసరమైన అన్ని వసతులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు.

09/16/2017 - 02:07

గుంటూరు, సెప్టెంబర్ 15: టిడిపి నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక, మట్టి దోపిడీలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో 30 మంది టిడిపి ఎమ్మెల్యేల పాత్ర ఇందులో ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం నేతల దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందన్నారు.

09/16/2017 - 02:05

విజయవాడ, సెప్టెంబర్ 15: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ 2004లో జగన్ ఆస్తుల విలువ 9.18 లక్షలుండగా 2009లో 77.40 కోట్లకు (90 రెట్లు) చేరిందని, అవే ఆస్తులు 2011కల్లా 365 కోట్లకు (400 రెట్లు) ఎలా ఎగబాకిందని ప్రశ్నించారు.

09/16/2017 - 02:04

కాకినాడ, సెప్టెంబర్ 15: కాకినాడ నగర పాలక సంస్థ మేయరుగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. శనివారం కొత్త మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకినాడ కార్పొరేషన్‌లో కౌన్సిల్ హాలును అధికారులు తీర్చిదిద్దారు.

Pages