S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/16/2017 - 23:48

విజయవాడ, మే 16: ఏరువాక ఉత్సవాలతో (వోర్వకల్ ఫెస్టివల్) రాష్ట్ర పర్యాటకంలో కొత్త పుంతలకు నాంది పలుకుతున్నామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ప్రజల దైనందిక జీవనశైలిలో కొంత ఆటవిడుపు కలిగేలాగా రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంగళవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.

05/16/2017 - 23:48

విజయనగరం, మే 16: దేశంలో యువతకు శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ఉద్దేశించిన మొబైల్ సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 20న జిల్లాలోని కొత్తవలస చేరనుంది. 16 ఎసి కోచ్‌లతో ఉన్న ఈ రైలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించింది. 2007లో న్యూఢిల్లీలో ప్రారంభమైన ఈ రైలు ఏడో దశలో ఇక్కడకు చేరనుంది. 2007 నుంచి 2011 వరకు సైన్స్ ఎక్స్‌ప్రెస్ కింద ఈ రైలును నడిపారు.

05/16/2017 - 23:47

రాజమహేంద్రవరం, మే 16: రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థకు గుండెలాంటి గోదావరి డెల్టా విభాగాల కార్యాలయాలను మూడు దశబ్దాల నాటి ఒక జిఒ ఆధారంగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో కాటన్ హయాంలో నిర్మించిన బ్యారేజీ ఆధారంగా మూడు డెల్టాలు ఏర్పాటయ్యాయి. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టాలను పర్యవేక్షించడానికి మూడు డివిజన్ కార్యాలయాలు నెలకొల్పారు.

05/16/2017 - 23:47

నంద్యాల, మే 16: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత రాష్టప్రతి ఎన్నిక లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన భావించినా సమయాభావం వల్ల నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్టప్రతి ఎన్నిక తరువాతే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశే్లషకులు అంటున్నారు.

05/16/2017 - 23:46

విజయవాడ, మే 16: నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమీక్ష నిర్వహించారు. వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో తన చాంబర్‌లో వివిధ శాఖల మంత్రులతో మంగళవారం సమీక్షించారు.

05/16/2017 - 02:54

ఒంగోలు/నెల్లూరు,మే 15:ప్రచంఢభానుడి దాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మూడురోజులపాటు జిల్లాలో ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినట్లుగా తొలిరోజున ఎండల తీవ్రత భారీగా ఉంది. ప్రకాశం కందుకూరులో అత్యధికంగా మధ్యాహ్నం ఒంటిగంటకు 44.82 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాకేంద్రమైన ఒంగోలులో 44.3, మార్కాపురంలో 45డిగ్రీలు సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

05/16/2017 - 02:52

విజయవాడ, మే 15: వచ్చే జనవరి నాటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం మేర మట్టిపనులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతిపై సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

05/16/2017 - 02:49

విశాఖపట్నం (జగదాంబ), మే 15: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. సాధారణ బదిలీల్లో కొంత వెసులుబాటు కల్పించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దరఖాస్తుల స్వీరకరణకు ఆది నుంచి అవాంతరాలు తప్పట్లేదు. ఈ నెల 5 నుంచి సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది.

05/16/2017 - 02:49

విజయవాడ (క్రైం), మే 15: క్యాన్సర్ వ్యాధితో చిన్నారి సాయిశ్రీ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. సుమశ్రీ జీవించే హక్కును కాలరాసిన ఆమె తండ్రి, అధికార పార్టీకి చెంది న ఎమ్మెల్యే, మరికొందరిపై బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. చిన్నారి మృతికి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరుతూ ఈమేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని పిటిషనర్ కోరాడు.

05/16/2017 - 02:48

తిరుపతి, మే 15: గత రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు అండ్ కో రూ.2లక్షల కోట్లను దోచుకుందని, ఆ సొమ్మును దాచుకోవడానికి సిఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లారని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె విలేఖరులతో మాట్లాడారు. రోజంతా రాష్ట్ర ప్రజల కోసమే విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

Pages