S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/20/2017 - 02:49

అమరావతి, మే 19: రాష్ట్రంలో సురక్షిత సేద్యమే కాదు, సుఫల సేద్యం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం తన నివాసం నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పేదరికం నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి మన వ్యవసాయ రంగం లక్ష్యాలు కావాలన్నారు.

05/20/2017 - 02:50

విజయవాడ, మే 19: రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెలకు రూ.10వేల ఆదాయం సంపాదించాలంటే మహిళా స్వయం సహాయక సంఘాలన్నిటికీ పునర్ వైభవం సాధింపచేయడం ఒక్కటే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. డ్వాక్రా మహిళలందరికీ వెంటనే నైపుణ్య శిక్షణ, కనీస విద్య అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేపట్టాలని చెప్పారు.

05/20/2017 - 02:10

సెక్షన్ 108 గడువూ పొడిగించాలి కేంద్రాన్ని కోరాలని ఏపీ నిర్ణయం
కాదంటే సుప్రీంకు వెళ్లే యోచన ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష మంత్రి కాలవ, పరకాల వెల్లడి

05/20/2017 - 02:09

ఆరుగురిపై 40మంది దాడి నలుగురి పరిస్థితి విషమం
సీఎం సీరియస్, అరెస్టులకు ఆదేశం
బాబే సమాధానం చెప్పాలన్న కరణం

05/20/2017 - 02:05

విజయవాడ, మే 19: మద్యం మత్తులో వాహనాలు నడిపి ఎదుటి వారి మృతికి కారణమైతే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని డిజిపి నండూరి సాంబశివరావు హెచ్చరించారు. రోడ్డు భద్రతపై ప్రతి నాలుగో మంగళవారం సిఎం అన్ని సంబంధిత శాఖలతో సమీక్షిస్తున్నారని, ఈమేరకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా తాగి వాహనం నడిపి ప్రమాదాలు చేసేవారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

05/19/2017 - 05:01

అమరావతి, మే 18: రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు జూన్ 2 నుంచి 8వరకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అర్హులైన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో, సక్రమంగా అందాలని సూచించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

05/19/2017 - 04:27

విశాఖపట్నం, మే 18: ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆహార భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రేషన్‌పై కోత పడింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే సరుకులకు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తాన్ని జోడించి, రేషన్ డిపోల ద్వారా సరుకులు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో 29,980 రేషన్ దుకాణాలు ఉన్నాయి.

05/18/2017 - 04:51

చీరాల, మే 17: భార్యపై అనుమానంతో భర్త ఆమెను నడుస్తున్న రైల్లో నుంచి బయటకు తోసేయడంతో కిందపడి మృతి చెందిన విషాద సంఘటన ప్రకాశం జిల్లా కడవకుదురు రైల్వే గేటు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన అశుతోష్, అల్పనాకుమారి (23) దంపతులు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.

05/18/2017 - 01:33

అమరావతి, మే 17: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ భవంతిని తలమానికంగా వుండేలా తీర్చిదిద్దడం కోసం 160 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల, హరిత అవసరాలకోసమే వదిలిపెడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తుది ప్రణాళికలో కొన్ని మార్పులు చేసినట్టు రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలియజేశారు.

05/18/2017 - 01:32

విజయవాడ, మే 17: జూలై నాటికి నిరుద్యోగ భృతి విధివిధానాలు ఖరారు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరుద్యోగ భృతిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో బుధవారం సమావేశమైంది. అనంతరం లోకేష్ విలేఖరులతో మాట్లాడుతూ ఇతర దేశాలు, రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు జరుగుతున్న తీరుపై చర్చించామని తెలిపారు.

Pages