S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/15/2017 - 01:47

నర్సీపట్నం, మే 14: నర్సీపట్నం సబ్ జైల్‌లో అనుమానాస్పద స్థితిలో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో జైలు సిబ్బంది ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కొయ్యూరు మండలం పెదమాకవరం గ్రామానికి చెందిన గిరిజనుడు అడబాల రామకృష్ణ(40) నాటుసారా కలిగి ఉన్నాడని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

05/14/2017 - 23:46

విజయవాడ (కార్పొరేషన్), మే 14: త్వరలో జరగనున్న రాష్టప్రతి ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డియే అభ్యర్ధి బలపరుస్తామనే రాజకీయ విధానాన్ని ప్రకటించిన టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి అధినేతలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక హోదా పై షరతుతోనే రాష్టప్రతి అభ్యర్థిని బలపర్చాలని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

05/14/2017 - 23:46

గుంటూరు, మే 14: తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా రగులుకుంటోంది.. కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ పదవుల్లో కాపు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంలేదనే వాదనలు తెరపైకి వస్తున్నాయి..

05/14/2017 - 23:45

గుంటూరు, మే 14: రాజధాని ప్రాంతాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో ఏపి సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1691 ఎకరాల్లో ఆర్ధికాభివృద్ధిని సాధించాలనేది ఒప్పంద సారాంశం. ఇందులో భాగంగా తొలివిడత 656 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. పూర్తిగా స్విస్‌ఛాలెంజి విధానంలో అభివృద్ధిని నిర్దేశించారు.

05/14/2017 - 23:45

అమరావతి, మే 14: ప్రధాని మోదీ-వైసీపీ అధ్యక్షుడు జగన్ భేటీకి పెడార్ధాలు తీయడం మంచిది కాదని, లోపల వారిద్దరు ఏం మాట్లాడుకున్నారన్న విషయంపై తెలుగుదేశం నాయకులు, మంత్రులు చెప్పడం బట్టి టిడిపి.. ప్రధాని-ఆయన కార్యాలయం-నివాసంపై నిఘా పెడుతున్నట్లు అనుమానించాల్సి వస్తుందని మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

05/14/2017 - 23:44

అమరావతి, మే 14: రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ప్రధాని మోదీ - వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భేటీ వెనుక రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కొద్దికాలం నుంచీ ఢిల్లీ రాజకీయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్న విజయసాయి తాజాగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ప్రధానిని కలిసేందుకు ఇప్పటివరకూ అనేకసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా ప్రధాని కార్యాలయం స్పందించలేదు.

05/14/2017 - 04:20

నెల్లూరు, మే 13: చేతికందొచ్చిన కొడుకు మరణించడం ఎంతో బాధాకరమని, ఈ లోటు ఎవరూ పూడ్చలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడ్ని కోల్పోయిన మంత్రి పొంగూరు నారాయణ అతని కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా శనివారం పరామర్శించారు.

05/14/2017 - 04:16

భీమవరం, మే 13: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ నెల 9వ తేదీన మాజీ ఎమ్మెల్యే, భీమవరం నియోజకవర్గ వైసిపి కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ కనిష్ఠ కుమారుడు సాగర్-సుధల వివాహం పట్టణంలో జరిగింది. ఈ వేడుకలను గ్రంధి శ్రీనివాస్ కుటుంబం జగన్‌ను ఆహ్వానించారు.

05/14/2017 - 03:42

విజయవాడ, మే 13: శాసనమండలి సభ్యుడుగా ఎన్నికైన మంతెన సత్యనారాయణరాజు శాసనసభ ప్రాంగణంలోని శాసనమండలి చైర్మన్ చాంబర్‌లో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి ఆయనతో ప్రమాణం చేయించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంతెన టిడిపి తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే.

05/14/2017 - 03:40

అమరావతి, మే 13: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడకు రాకుండా ఆరుగంటల పాటు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? శనివారం ఎలక్ట్రానిక్ చానెళ్లలో వైసీపీ నేతలు వేసిన ప్రశ్నలు, ప్రసారం చేసిన కథనాలు నిజంగానే అందరిలోనూ అనుమానాలు రేపాయి. అయతే వాస్తవానికి చంద్రబాబు ఆ సమయంలో రెండు కంపెనీల సిఇఓలతో చర్చలు జరిపినట్టు వెల్లడయంది.

Pages