S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/15/2017 - 03:31

గుంటూరు (పట్నంబజారు), మే 15: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ గొల్లపూడిలోని దేవాదాయ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ నెల 18న నూతన భవనాన్ని మంత్రి మాణిక్యాలరావు, కార్పొరేషన్ చైర్మన్ ఐవై ఆర్ కృష్ణారావు ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిపురపు శ్రీ్ధర్, అధ్యక్షుడు బలరాం కృష్ణమూర్తి తెలిపారు.

05/15/2017 - 03:29

మంగళగిరి, మే 14: పేదవారెవరూ ఆకలితో అలమటించకూడదని, పేదవాడు గొప్పవాడు కావాలని, రైతే రాజు కావాలని ప్రతిక్షణం చెబుతూ దానికి అనుగుణంగా పనిచేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో నిత్యం పేదలకు నాలుగు రూపాయలకే భోజనం అందించే పథకాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చ

05/15/2017 - 02:40

హైదరాబాద్, మే 14: ప్రధాని నరేంద్ర మోదీని ఎపి రాష్ట్ర ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ కలిస్తే మీరెందుకు ఉలిక్కిపడతారని వైఎస్‌ఆర్‌సిపి నేత బొత్స సత్యనారాయణ ఎపి సిఎం చంద్రబాబు, టిడిపి నేతలను ప్రశ్నించారు. ప్రధానిని కలిస్తే ఇందులో తప్పేముందని నిలదీశారు. ఆదివారం నాడిక్కడ ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావే శంలో మాట్లాడారు.

05/15/2017 - 01:53

ఎల్కతుర్తి, మే 14: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఎల్కతుర్తి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి చెరువులో దిగి మృతి చెందారు.

05/15/2017 - 01:53

కాకినాడ, మే 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం వెతుకులాడే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల కంటే ఈ సంవత్సరం ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో చాలా వరకు సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.

05/15/2017 - 01:51

రాజమహేంద్రవరం, మే 14: తక్షణం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ పోరాటంలో ఉద్యోగుల పోరాటం కీలకమన్నారు. మాదిగ ఉద్యోగుల జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

05/15/2017 - 01:51

తిరుపతి, మే 14: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై వారి సూచనలు, సలహాలు సేకరించి మరింత మెరుగైన సేవలందించనున్నట్లు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదివారం తిరుమల ఇన్‌చార్జ్ జెఇఓ పోలా భాస్కర్‌తో కలిసి తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లను ఇఓ తనిఖీ చేశారు.

05/15/2017 - 01:49

మాచర్ల, మే 14: అప్పులపాలైన ఓ మిర్చిరైతు కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి గ్రామానికి చెందిన రమావత్ లాలునాయక్(46) ఈ ఏడాది 5 ఎకరాల్లో మిర్చి సాగుచేశాడు. 2 ఎకరాలు సొంత పొలం కాగా, 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. దిగుబడి బాగానే ఉన్నప్పటికీ ఆశించిన మేరకు ధరలు లేకపోవటంతో 5 లక్షల రూపాయల మేర అప్పులపాలయ్యాడు.

05/15/2017 - 01:49

భీమవరం, మే 14: పారిశుద్ధ్య నిర్వహణ ..ఇది నగరాలు..పట్టణాలకు అతి పెద్ద బాధ్యత. నిత్యం కమిషనర్లు తెల్లవారుజామున పారిశుద్ధ్య నిర్వహణపై తిరుగుతుంటారు. ఇందుకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటాయి. అయినా సమస్య సమస్యగానే మిగిలిపోతోంది. దీంతో కమిషనర్లకు ఇది తలకు మించిన భారంగా పరిణమించింది.

05/15/2017 - 01:48

విజయనగరం, మే 14: పట్టణంలోని వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.శోభన్‌బాబు రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. ఆదివారం మధ్యాహ్నాం 2 గంటల సమయంలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఈ మొత్తం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీనికి సంబంధించి సెంట్రల్ యూనిట్ ఎసిబి డిఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు వెల్లడించిన వివరాలివి.

Pages