S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/16/2017 - 00:23

విజయవాడ, మే 15: రాష్ట్రంలోని మాజీ లెజిస్లేటర్ల సమస్యలపై ప్రభుత్వం ఇంతకు ముందు అంగీకరించిన అంశాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఏపి మాజీ లెజిస్లేటర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సుబ్బరాజు, ఫోరం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం.. సోమవారం శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

05/16/2017 - 00:23

అమరావతి, మే 15: ఉపాధిహామీ పథకం (నరేగా) పనులు గత ఏడాది కన్నా ఈ ఏడాది మందకొడిగా జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టాలని పిలుపిచ్చినా వేగం లేకపోవడంపై ఆయన ఆగ్రహించారు. నిర్లిప్తత వల్ల అనేక సమస్యలు వస్తాయని, అలసత్వం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

05/16/2017 - 00:22

అమరావతి, మే 15: జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని ప్రధాని లీక్ చేయాలి. ఆయన ఆ పని చేయరు. ఇక చేస్తే జగన్ చేయాలి. ఆయనకు ఆ అవసరం ఉండదు. ఇక లీక్ ఎవరు చేశారు? అంత అవసరం ఎవరికి ఉంటుంది? పీఎంఓతో సన్నిహితంగా వ్యవహరించేంత ప్రభావశాలురు ఎవరు? అసలు ఆ వినతిపత్రం మీడియాకు ఎలా వచ్చింది? ఎవరి ద్వారా అందింది? ఏ స్థాయిలో అది లీకయింది?

05/15/2017 - 23:35

విశాఖపట్నం, మే 15: సుమారు 1000 కోట్ల హవాలా కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు పోలీసులను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డి మహేష్‌ను విశాఖ నగర పోలీసులు శనివారమే నగరానికి తీసుకువచ్చి, ఆదివారం అరెస్ట్ చూపించారు. అతనిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు.

05/15/2017 - 23:34

విజయవాడ, మే 15: కాలుష్య రహిత పరిశ్రమలు, కార్మికుల భద్రత కోసం కొత్త చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీని కోసం కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిలతో కూడిన సబ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైంది.

05/15/2017 - 23:33

కర్నూలు టౌన్, మే 15: భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు కటుంబ సమేతంగా సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌కు హాజరయ్యాడు. కలెక్టర్ సత్యనారాయణకు తన సమస్యను వివరిస్తూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోయాడు.

05/15/2017 - 23:32

గుంటూరు, మే 15: మిర్చి రైతుల వెతలు తీరటంలేదు.. ప్రభుత్వాలు మద్దతు ప్రకటిస్తున్నా..ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్నా.. గిట్టు బాటు ధర ఎండమావిగా మారుతోంది.. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5వేల మద్దతుధరతో పాటు 1250 రవాణా ఖర్చులు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు దరి చేరలేదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 15 వందల చంద్రన్న రాయితీ పథకంలో అడుగడుగునా రైతు దగా పడుతున్నాడు..

05/15/2017 - 04:10

కుప్పం, మే 14: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ గృహ కల్పన ద్వారా కుప్పం మండలానికి సుమారు 1400 కాలనీ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసింది.

05/15/2017 - 04:09

రాజమహేంద్రవరం, మే 14: రాజమహేంద్రవరం పేపర్‌మిల్లులో తొలగించిన 10 మంది కార్మికులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనా, పరిశ్రమల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జెకె గార్డెన్స్‌లో ఆదివారం గౌడ, శెట్టిబలిజ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

05/15/2017 - 04:07

పాడేరు, మే 14: విశాఖ మన్యంలో గిరిజన, గిరిజనేతరుల ఆరాధ్య దైవమైన పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్యాత్మిక లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు.

Pages