S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/16/2017 - 02:47

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: ఆంధ్రప్రదేశ్ ఐసెట్, ఈసెట్ ఫలితాలు-2017 సోమవారం విడుదలయ్యాయి. సెట్‌ల ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో విడుదల చేశారు. ఐసెట్‌లోశాఖపట్నానికి చెందిన ఎం మనోజ్ 189.9317 మార్కులతో టాపర్‌గా నిలిచాడు. ఐసెట్‌లో 86.56 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఐసెట్‌కు 70,678 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 62,962 మంది పరీక్షకు హజరయ్యారు.

05/16/2017 - 02:44

రాజమహేంద్రవరం, మే 15: రాజమహేంద్రవరం నగరంలో పింఛన్ల బాగోతం బయటపడింది. వైసిపి, స్వతంత్ర అభ్యర్థి ప్రాతినిధ్యం వహించే వార్డుల్లో మృతిచెందిన లబ్ధిదారుల పేరిట పింఛన్లు దిగమింగారు. ఈ వ్యవహారం సోమవారం జరిగిన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రగడ సృష్టించింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన సోమవారం జరిగింది.

05/16/2017 - 00:28

హైదరాబాద్, మే 15: పాత్రికే విలువలకు తిలోదకాలిచ్చి ఫిబ్రవరి 17న ప్రధానికి రాసిన లేఖను మే 10న ఇచ్చినట్లు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అంతేకాకుండా ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

05/16/2017 - 00:27

విజయవాడ, మే 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)పై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వెలగపూడి సచివాలయంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిఎస్‌టి వల్ల దేశానికి, రాష్ట్రానికి కలిగే లాభాల గురించి పార్లమెంట్ రీసెర్చి సర్వీస్ సభ్యులువివరించారు. ఇప్పటికే పార్లమెంట్‌లో అమోదముద్ర పొందిన ఎస్‌జిఎస్‌టి బిల్లును ఆసెంబ్లీలో అమోదించి కేంద్రానికి పంపాల్సి ఉంటుంది.

05/16/2017 - 00:27

విజయవాడ(బెంజిసర్కిల్), మే 15: జిఎస్‌టి బిల్లు కోసం జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతులకు అన్ని పంటల్లోనూ గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు సమస్యలపై తప్పకుండా చర్చ జరగాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది.

05/16/2017 - 00:26

విజయవాడ, మే 15: వెలగపూడి సచివాలయ ఆవరణలో ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. తిరిగి ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించాలని తాజాగా ప్రతిపాదించారు. ఈ సదస్సులో జిఎస్‌టిపై కలెక్టర్లకు అవగాహనతోపాటు వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల గురించి సిఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

05/16/2017 - 00:26

అమరావతి, మే 15: బిజెపి-జగన్ కలిస్తే మాకే లాభమంటూ కొందరు ఎమ్మెల్సీలు చేసిన బహిరంగ ప్రకటనలు, ఒక క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాదికి ప్రధానికి ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారంటూ నిలదీసిన వైనం ఇప్పుడు టిడిపి-బిజెపి బంధానికి విఘాతం కలిగేలా చేసింది. దీనిపై దిద్దుబాటుకు దిగిన టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.

05/16/2017 - 00:25

గుంటూరు, మే 15: విశాఖపట్నంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడులో చర్చించాల్సిన అంశాలపై సోమవారం ఇక్కడి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తీర్మానాల కమిటీ సమావేశమైంది. ఎమ్మెల్సీ టిడి జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 16 అంశాలను ఎంపిక చేశారు. మొదటగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులర్పించే అంశాన్ని పార్టీ నేత పాటిబండ్ల అనిల్ ప్రతిపాదిస్తారు.

05/16/2017 - 00:24

విజయవాడ, మే 15: మహాత్మాగాంధీ 150వ జయంతి 2019 అక్టోబర్ 2తేదీ నాటికి స్వచ్ఛాంధ్రను సాధించే క్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖులను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఉత్తర్వులు జారీచేసారు.

05/16/2017 - 00:24

విజయవాడ, మే 15: ప్రధాని నరేంద్ర మోదీ వద్ద వైకాపా అధినేత జగన్ ఆటలు సాగవని తమకూ తెలుసునని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అవినీతిపరుల విషయంలో ప్రధాని చండశాసనుడని, కాళ్లకు మొక్కితే కనికరం లభించదని ఎద్దేవా చేశారు. కాపురం చేయలేం కానీ శోభనానికి ఓకే అన్నట్లుగా వైసిపి తీరు ఉందని ఆరోపించారు.

Pages