S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/06/2017 - 06:29

గుంటూరు, ఏప్రిల్ 5: ‘‘గత రెండున్నరేళ్లలో ఎక్కడా జరగని అభివృద్ధి..సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేశాం.. నా ప్రయోజనాల కోసం మీ సహకారం అడగటంలేదు.. నాకు ఎలాంటి కోరికలు లేవు. కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా.. మంచికి మద్దతివ్వండి.. మీ జీవితాల్లో వెలుగు చూడాలనేదే నా ఆకాంక్ష’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

04/05/2017 - 04:20

అమరావతి, ఏప్రిల్ 4: ఒకే పార్టీలో మూడు తరాల ప్రతినిధులతో అనుబంధమంటే అదొక తీపి అనుభూతి. అలాంటి అపురూప అనుభూతి తెలుగుదేశం పార్టీలో కొందరికే దక్కింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీరామారావు, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబునాయుడు, ఇప్పుడు క్యాబినెట్‌లో చేరిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్..

04/05/2017 - 04:19

తాడేపల్లి, ఏప్రిల్ 4: వివిధ కాలాల్లో విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయటానికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కొత్త సాంకేతిక పద్ధతులను అమల్లోకి తెచ్చి అమలు పరుస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల మేనేజ్‌మెంట్ అధారిటీ ఎండి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ కమిషనర్ శేషగిరి బాబు తెలిపారు.

04/05/2017 - 04:19

విజయవాడ, ఏప్రిల్ 4: అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక నుంచి ఇంటిగ్రేటెడ్ హెల్త్ రికార్డు సిస్టమ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగికి సంబంధించిన హెల్త్ రికార్డు భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇలా చేయడం ద్వారా మళ్లీ ఆసుపత్రికి వచ్చినవారి పూర్వ వ్యాధుల చరిత్ర పరిశీలించి మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుందని చెప్పారు.

04/05/2017 - 04:18

అమరావతి, ఏప్రిల్ 4: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న అధికార తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మిత్రపక్షమైన బిజెపి నుంచి కూడా అలాంటి వ్యతిరేకతే ఎదురుకావడంతో నైతిక సంకటంలో పడింది.

04/05/2017 - 02:22

విశాఖపట్నం, ఏప్రిల్ 4: ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ గంగాధరం ఆస్తులు లెక్కకట్టడానికి నాలుగు రోజులు పట్టింది. తవ్వే కొద్దీ ఆయన అక్రమాస్తులు బయటపడుతునే ఉన్నాయి. ఆయన అక్రమార్జన ఎంత? అన్నది ఎసిబి అధికారులు చివరకు లెక్కతేల్చారు. గంగాధరం అక్రమంగా కూడబెట్టిన బంగారు ఆభరణాలను, విలువైన డాక్యుమెంట్లను మంగళవారం విశాఖ ఏసిబి కార్యాలయానికి తీసుకువచ్చారు.

04/05/2017 - 02:20

తుని, ఏప్రిల్ 4: తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణ శివారు ఇసుకలపేట సమీపంలో మంగళవారం ఉదయం బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడగా, వారితో ఇద్దరి పరిస్థితి విషమంగావుంది. బాణాసంచా తయారీ సందర్భంగా నిప్పురవ్వలు ఎగసిపడటంతో ప్రమాదం సంభవించింది. వివరాలిలావున్నాయి...

04/05/2017 - 02:19

విజయవాడ, ఏప్రిల్ 4: సమస్యల నుంచి పారిపోకుండా, సంక్షోభాన్ని అవకాశంగా మలచుకున్న శ్రీరామచంద్రుడు మానవాళికి ఆదర్శనీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. సుపరిపాలనకు ఆద్యుడు శ్రీరాముడని, అష్టకష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టలేదని చంద్రబాబు చెప్పారు.

04/05/2017 - 02:18

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 4: పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అనైతిక రాజ్యాంగ చర్యలు నిరోధించేందుకు భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తక్షణమే జోక్యం చేసుకోవాలని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి కోరారు.

04/05/2017 - 02:18

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా ఫిరాయింపుదార్లకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడాన్ని నిరసిస్తూ వైకాపా ఈనెల 7న రాష్టవ్య్రాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని వైకాపా ఎంపి వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

Pages