S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/10/2017 - 04:22

మచిలీపట్నం, ఏప్రిల్ 9: అవినీతి, అక్రమార్జన కేసులో ఎక్కడ బెయిల్ రద్దు చేస్తారోనన్న భయంతోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. మచిలీపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జగన్ తీరును ఆయన తూర్పారబట్టారు.

04/10/2017 - 02:16

కాకినాడ, ఏప్రిల్ 9: వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న ధారావాహికాల్లో మహిళలకు సంబంధించి భయంకరమైన రీతిలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఆడ పిల్లల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తంచేశారు. హీరోయినే్ల విలన్లుగా నటించడంతో పాటు చిన్న పిల్లలు, పెళ్లి కావలసిన పిల్లలకు ఎవరిని ఎలా చంపాలో, అత్తగారిని కోడలు ఎలా చంపాలి?

04/10/2017 - 02:14

గుంటూరు, ఏప్రిల్ 9: పార్టీ ఫిరాయింపులు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని, చాలాకాలంగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ జరుగుతున్నదేనని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏదో ఒకరోజు ఫుల్‌స్టాప్ పడాల్సిందేనన్నారు.

04/10/2017 - 02:12

విజయవాడ, ఏప్రిల్ 9: రాష్ట్ర కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు వెలగపూడి సచివాలయంలో ఆదివారం ఘన స్వాగతం లభించింది. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం పితాని ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

04/10/2017 - 02:11

విజయవాడ, ఏప్రిల్ 9: జిఎస్టీ బిల్లు ఆమోదం కోసం మరోసారి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్‌లో నాలుగు జిఎస్టీ బిల్లులు ఆమోదం పొందడంతో, రాష్ట్రాల నుంచి కూడా ఆమేరకు ఆమోదిస్తూ తీర్మానం చేయాల్సి ఉంది. దీంతో ఏప్రిల్ నెలాఖరు, లేదా మే మొదటి వారంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్నారు. అయితే తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

04/10/2017 - 00:40

అమరావతి, ఏప్రిల్ 9: పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీ నుంచి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వ్యవహారంపై వస్తున్న విమర్శలకు అధికారిక వివరణ ఇచ్చే ప్రయత్నాలు జరగకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఆ నలుగురు రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపారన్న లీకు వార్తలే తప్ప, అసెంబ్లీ కార్యాలయం గానీ, స్పీకర్ గానీ ఇప్పటివరకూ ధృవీకరించకపోవడంతో ఈ అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

04/10/2017 - 00:39

అమరావతి, ఏప్రిల్ 9: అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ సమీకరణలు, ప్రాంతాల పేర్లు చెప్పి నామినేటెడ్ చైర్మన్ పదవులు పొందిన వారిలో అధిక శాతం పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ తరహా చైర్మన్ల పనితీరుపై తాజాగా నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

04/10/2017 - 00:38

విజయవాడ (పాయకాపురం), ఏప్రిల్ 9: జాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ప్రచారం చేశారని, కానీ ఎన్నికల అనంతరం బాబుకు మాత్రమే జాబు వచ్చిందని, ఎన్టీఆర్ ఆరోగ్యమిత్రలో పనిచేస్తున్న 2వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ జీవో 28 విడుదల చేశారని ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు విమర్శించారు.

04/10/2017 - 00:38

అమరావతి, ఏప్రిల్ 9: మంత్రివర్గ ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల పనితీరుపై దృష్టి సారించకపోవడంపై సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత పేషీలోనే ఫైళ్లు పెండింగ్‌లో ఉంటే దానిని వైఫల్యంగా పట్టించుకోని బాబు, మంత్రుల పనితీరుపైనే దృష్టి సారించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని స్పష్టం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల బదిలీలపై గత నాలుగు నెలల నుంచీ మీనమేషాలు లెక్కబెడుతున్నారు.

04/09/2017 - 03:30

హైదరాబాద్, ఏప్రిల్ 8: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్టుల్లో శనివారం నిర్వహించిన అదాలత్‌లలో 10,414 కేసులు పరిష్కరించినట్లు ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి పివి రాంబాబు తెలిపారు. ఈ కేసుల్లో రూ.20.69 కోట్ల మొత్తానికి వివిధ పరిష్కారాలను చూపించినట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

Pages