S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/07/2017 - 08:25

విజయవాడ, ఏప్రిల్ 6:మిర్చి రైతుకు గిట్టుబాటు ధర లభించకపోవటంపై రాష్ట్ర మంత్రి మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిందిగా కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రిమండలి విస్తరణ జరిగిన తరువాత తొలిసారిగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ అయింది. అనంతరం వివరాలను మంత్రి కాలువ శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

04/07/2017 - 08:24

కాకినాడ, ఏప్రిల్ 6: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ బీచ్ గురువారం సాయంత్రం మరుభూమిగా మారింది. సముద్ర స్నానం చేస్తూ ముగ్గురు మృతిచెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలల ఉద్ధృతికి తొలుత ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు.

04/06/2017 - 07:53

హైదరాబాద్, ఏప్రిల్ 5: దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారంతో ఏడో రోజుకు చేరుకుంది. సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల్లోనే కొనసాగుతున్న సమ్మె ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంస్ సమ్మెను చేపట్టనుంది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోగా మార్కెట్ యార్డులు బోసి పోతున్నాయి.

04/06/2017 - 07:50

అమరావతి, ఏప్రిల్ 5: ‘ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన మాకు మంత్రి కావాలనుంటుంది.. అది తప్పు కాదు.. కానీ మన స్థాయి, అర్హతలు, పార్టీ ఇబ్బందులు, రాజకీయ అవసరాలు, పార్టీ భవిష్యత్తు లక్ష్యాలేమిటో కూడా చూసుకోవాలి కదా?

04/06/2017 - 07:50

విజయవాడ, ఏప్రిల్ 5: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 6న ముగ్గురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. వెలగపూడి సచివాలయం బ్లాక్-4లో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా బ్లాక్-4లో బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు పబ్లిసిటీ సెల్‌ను ప్రారంభిస్తారు.

04/06/2017 - 07:48

ఒంటిమిట్ట, ఏప్రిల్ 5: కడప జిల్లా ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. భక్తుల జయజయధ్వనాల మధ్య ధ్వజపటాన్ని ఎగురవేసిన అర్చకులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.

04/06/2017 - 07:42

విజయనగరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసారు. విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం అనంతరం కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదికపై జలకలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

04/06/2017 - 06:45

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 5: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పలు సదుపాయాలు కల్పిస్తున్న ప్రభుత్వం తమ పట్ల సవతితల్లి ప్రేమ కనబరుస్తోందని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అమలుచేసిన వేతన సవరణ, పదవీ విరమణ వయోఃపరిమితి పెంపు తమకు అమలుకావడంలేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే...

04/06/2017 - 06:45

ఏలూరు, ఏప్రిల్ 5: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న అగ్రిగోల్డ్ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను విచారణ నిమిత్తం సిఐడి కస్టడీకి ఇస్తూ ఏలూరులోని జిల్లా కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని పెదపాడు పోలీసుస్టేషన్‌లో ఈ సంస్థపై కేసు నమోదు కావడం తెలిసిందే.

04/06/2017 - 06:42

హైదరాబాద్, ఏప్రిల్ 5: ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విలువలను కాపాడడంలో గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్‌లు విఫలమయ్యారని వైకాపా ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఈ నెల 6న (గురువారం) ఢిల్లీలో రాష్టప్రతి అపాయింట్‌మెంట్ ఖరారైందని, రాష్టప్రతిని కలిసి ఆంధ్రలో ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

Pages