S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/08/2016 - 15:58

భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి కూలి 11 మంది గాయపడ్డారు. శుక్రవారం చర్చి శ్లాబ్‌ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమం.

01/08/2016 - 14:07

విజయవాడ : కొత్త రాజధాని నిర్మాణంలో ఎన్నో సవాళ్లున్నాయని,సింగిల్‌ విండో పద్ధతిలో త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరుచేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ విజయవాడ విభాగం ఏర్పాటు చేసిన స్థిరాస్తి ప్రదర్శనను సీఎం ప్రారంభించారు.

01/08/2016 - 13:46

శ్రీకాకుళం : జిల్లాలో శుక్రవారంనాడు మధ్యాహ్నం 12.30 గంటల మధ్య మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. పొందూరు మండలంలోని పుల్లాజీపేట, లొలుగ, దెల్లిపేట, కృష్ణాపురం తదితర గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.

01/08/2016 - 13:41

విజయవాడ : విజయవాడలోని మొగల్రాజపురంలో విషాదం నెలకొన్నది. విద్యుత్ స్థంభాలు ఎక్కి పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా అయి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

01/08/2016 - 11:56

విజయవాడ: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత ఉండేలా వ్యవహరించాలని ఎ.పి. సి.ఎం. చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఉదయం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జన్మభూమి, మా ఊరు తదితర పథకాల అమలు తీరును సమీక్షించారు. పదవి సంతృప్తిగా ఉండాలన్నదే అంతిమ లక్ష్యంగా భావించి పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

01/08/2016 - 11:52

చిత్తూరు: పుత్తూరు మండలంలో అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించి ఓ వ్యాన్‌లో తరలిస్తున్న 20 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. పోలీసుల రాకను గమనించి నిందితులు వ్యాన్ వదిలేసి పరారయ్యారు.

01/07/2016 - 12:12

ఏలూరు: ఉంగుటూరు మండలం కైకరం గ్రామం వద్ద గురువారం ఉదయం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

01/07/2016 - 12:11

కర్నూలు:రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఉత్సాహభరితంగా జరపాలని, వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేయాలని సి.ఎం. చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ జరిపిన సందర్భంగా వంటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు.

01/07/2016 - 12:10

కర్నూలు: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఎ.పి. సి.ఎం. చంద్రబాబు హామీ ఇచ్చారని రాష్ట్ర ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఆయన గురువారం ఉదయం ఇక్కడ చంద్రబాబును కలిసి ఉద్యోగుల సమస్యలపై వివరించారు. ఉద్యోగులకు డిఏ, హెల్త్‌కార్డులు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్దీకరణపై రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సి.ఎం. హామీ ఇచ్చారన్నారు.

01/07/2016 - 12:09

గుంటూరు: క్రోసూరు మండలం గుడిపూడిలో బుధవారం అర్ధరాత్రి రామారావు, వెంకాయమ్మ అనే వృద్ధ దంపతులను దుండగులు కత్తులతో గొంతుకోసి హతమార్చారు. గురువారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూశాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Pages