S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/17/2016 - 06:10

విశాఖపట్నం, నవంబర్ 16: ప్రభుత్వ భూములను ఆక్రమించి, ఇళ్లను నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు సర్వం సన్నద్ధమైంది. విశాఖ వేదికగా నగర పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు చేతుల మీదుగా గురువారం చేపట్టనున్నారు. దాదాపు 30వేల మందికి రూ.4వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి పట్టాలు పంపిణీ చేయనున్నారు.

11/17/2016 - 06:07

రాజమహేంద్రవరం, నవంబర్ 16: తూర్పు గోదావరి జిల్లా నివురుగప్పిన నిప్పులా మారింది. ఎటు చూసినా పోలీసు బలగాలే మోహరించాయి. మొత్తంగా పరిశీలిస్తే బుధవారం కూడా జిల్లా అంతటా పోలీసు పహారా వుంది. కాపు సామాజికవర్గ కీలక నేతలంతా ఇళ్ల నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం కొనసాగుతోంది. పోలీసులు ఎపుడు గృహ నిర్బంధం సడలిస్తే అపుడు యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నామని కాపు జెఎసి నేతలు చెబుతున్నారు.

11/16/2016 - 04:10

కర్నూలు, నవంబర్ 15: పెద్దనోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిలుచుంటున్న వారికి తమ వంతు సేవగా పెరుగన్నం, నీళ్ల ప్యాకెట్లను అందజేశారు కర్నూలులోని సద్గురు దత్త కృపాలయం సభ్యులు.

11/16/2016 - 04:08

హైదరాబాద్, నవంబర్ 15: వచ్చే ఏడాది మార్చి లోపల విద్యుత్ చౌర్యాన్ని 9శాతానికి తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు విద్యుత చౌర్యం శాతానికి 9.98 శాతానికి తగ్గించామన్నారు. ఒక శాతం విద్యుత్ చౌర్యం తగ్గించే రూ.270కోట్లు మిగులుతుందన్నారు.

11/16/2016 - 03:17

విజయవాడ, నవంబర్ 15: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధతే లక్ష్యంగా ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.

11/16/2016 - 03:15

మంగళగిరి, నవంబర్ 15: రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు, బీసీ కులాల మధ్య ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చిచ్చు పెడుతున్నారని, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆరోపించారు.

11/16/2016 - 03:13

నందిగామ, నవంబర్ 15: ఆస్తి వివాదాల నేపధ్యంలో కృష్ణా జిల్లా నందిగామలో రిటైర్డ్ ఎఎస్‌ఐ గుంజి వెంకటేశ్వరరావును మంగళవారం దుండగులు దారుణంగా హత్య చేశారు. పట్టపగలు సినీ ఫక్కీలో జరిగిన ఈ హత్యాకాండ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సేకరించిన సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

11/16/2016 - 03:11

విజయవాడ, నవంబర్ 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్న పదం రద్దయిన పెద్ద నోట్ల వంటిదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. సిఎంతో తెలుగుదేశం ఎంపీల సమావేశం అనంతరం సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే జనవరి తరువాత ప్రత్యేక హోదా అంశం ఉండదని తెలిపారు. కొంతమంది అనవసరంగా ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని విమర్శంచారు.

11/16/2016 - 03:11

విజయవాడ, నవంబర్ 15: ఇటీవల వరకు చాలామణిలోనున్న రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్ల రద్దును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే, అయితే దీనికి ప్రత్యాహ్నయ ఏర్పాట్లు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ వైకాపా శాసనసభ్యురాలు రోజా నిప్పులు చెరిగారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.

11/16/2016 - 03:08

తిరుపతి, నవంబర్ 15: ప్రధాని మోదీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టాడని, ఈక్రమంలో నిత్యావసరాల ధరలు పెరిగి ఆహార భద్రతకు కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు.

Pages