S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/18/2016 - 03:09

పోలవరం, అక్టోబర్ 17: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను నవంబర్ నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సోమవారం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు.

10/18/2016 - 03:07

అమడగూరు, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరవుతో విడదీయలేని బంధం ఉందని, చంద్రబాబు, కరవు అవిభక్తకవలలు లాంటి వారని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరవు ఆయన వెన్నంటే ఉంటుందన్నారు. సోమవారం అనంతపురం జిల్లా అమడగూరు మండలంలో పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి, మాజీ కేంద్రమంత్రి సూర్యప్రకాశ్‌రెడ్డి రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

10/18/2016 - 03:03

అనంతపురం, అక్టోబర్ 17: అనంతపురం నగరంలో సోమవారం బిసి కమిషన్ పర్యటనలో రసాభాస చోటుచేసుకుంది. కాపులను బిసి జాబితాలో చేర్చవద్దంటూ బిసి సంఘాల నాయకులు కమిషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గట్టిగా కేకలు వేస్తూ బిసి కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాల చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బిసి కమిషన్ సభ్యులు వచ్చారు.

10/18/2016 - 03:00

విజయనగరం(టౌన్),అక్టోబర్ 17: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని సంప్రదాయ బద్ధంగా జరిపారు. పూసపాటి గజపతుల ఆడపడుచు, భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న పైడితల్లి అమ్మవారికి ఆలయ ఆనువంశిక ధర్మకర్త, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు దంపతులు రాజకుటుంబం తరపున పట్టు వస్త్రాలు, పసుపుకుంకుమ సమర్పించారు.

10/18/2016 - 02:56

గుంటూరు, అక్టోబర్ 17: ఇకపై అన్ని మండల కేంద్రాల్లో ఎల్‌ఇడి బల్బులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా 659 మండలాలు, 13వేల గ్రామాల్లో ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటుతో మండల పరిషత్‌లకు, గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల్లో ఆదా అవుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

10/18/2016 - 02:55

విజయవాడ, అక్టోబర్ 17: గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి వివిధ కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరినీ సాధ్యమైనంత మేరకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార, ఐటి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

10/18/2016 - 02:55

గుంటూరు, అక్టోబర్ 17: హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన రూ.10వేల కోట్ల నల్లధనం ఎవరిదో జగన్మోహనరెడ్డి తేల్చిచెప్పాలని టిడిపి నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై వారం రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని, ఆ నల్లధనం ఎవరిదనే ప్రస్తావన రాగానే జగన్ భుజాలు తడుముకుంటున్నారని ఆయన విమర్శించారు.

10/18/2016 - 02:54

విజయవాడ, అక్టోబర్ 17: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో పలువురు సర్పంచ్‌లు తమ గ్రామాల్లోని సమస్యలను ఏకరవు పెట్టారు. గ్రామాల్లో డ్రైనేజీ, రైతుల సమస్యలు, మరుగుదొడ్లకు బిల్లుల మంజూరులో జాప్యం, ఇతర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.

10/18/2016 - 02:54

ఖమ్మం, అక్టోబర్ 17: నకిలీ విత్తనాలతో జిల్లా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, నకిలీ నోట్లకన్నా నకిలీ విత్తనాలు ప్రమాదకరమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నకిలీ విత్తన విక్రేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..

10/18/2016 - 02:53

విజయవాడ, అక్టోబర్ 17: రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నీరు-ప్రగతి’పై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జలవనరులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖల అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages