S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/30/2016 - 04:17

విజయవాడ, సెప్టెంబర్ 29: దేశభక్తి, దైవభక్తి ప్రతి ఒక్కరికీ అవసరమని, మనం చేసే మంచి పనికి భగవంతుడు తోడుగా నిలుస్తాడని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. ఈ రెండు లక్షణాలను ప్రజల్లో పెంపొందించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ దేశవ్యాప్తంగా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

09/30/2016 - 04:15

విజయవాడ, సెప్టెంబర్ 29: పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వినూత్నరీతిలో ప్రవేశపెట్టిన పౌర సేవలు విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండోరోజైన గురువారం ముఖ్యమంత్రి వివిధ జిల్లాల వారీ ప్రగతిని సమీక్షించారు.

09/30/2016 - 04:13

అనంతపురం, సెప్టెంబర్ 29: కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర జలాశయం నీటి విడుదలపై ఒంటెద్దు పోకడ అవలంబిస్తోంది. హెచ్‌ఎల్‌సికి నీటి విడుదల చేయడంలో తుంగభద్ర బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. అనంతపురం జిల్లాలోని హెచ్చెల్సీ అధికారులను నీటి విడుదల, నిలిపివేతకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

09/30/2016 - 04:11

మండపేట, సెప్టెంబర్ 29: కాజాలకు ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. వినాయకచవితి సందర్భంగా తాపేశ్వరం సురుచి ఫుడ్స్ తయారుచేసిన 29,465 కిలోల మహాలడ్డూకు గిన్నిస్ బుక్‌లో స్థానం లభించింది. ఈమేరకు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లికార్జునరావు (మల్లిబాబు)కు వర్తమానం అందింది.

09/30/2016 - 04:09

విశాఖపట్నం, సెప్టెంబరు 29: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కలుపుకునేందుకు భారత్ దాడులకు దిగలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్థాన్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించే శిక్షణా కేంద్రాలను, స్థావరాలపై మాత్రమే భారత సైన్యం దాడులు జరిపిందని చెప్పారు.

09/30/2016 - 04:09

గుంటూరు, సెప్టెంబర్ 29: భారీవర్షాలు, వరదలకు రైతులు నష్టపోతే వారిని ఆదుకోవాల్సిందిపోయి, బంగారంపై రుణాలు ఇవ్వవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్యాంకర్లకు ప్రతిపాదించడం అమానుషమని వైసిపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను వైసిపి నేతలు సందర్శించి రైతులను పరామర్శించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

09/30/2016 - 03:41

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ఆయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. దేవాలయాల పర్యవేక్షణ, కమిటీల నియామకాలు, ఇలా ఒకటేమిటి? అన్నీ ఆయన కనుసన్నలలోనే నడవాలి. కానీ, పాపం ఆయన మాట వినే దిక్కులేదు. అది పుష్కరాలయినా, సమీక్ష సమావేశాలయినా, బదిలీలయినా సరే! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వారి పరిథిలోని ఎమ్మెల్యేలకు ఇచ్చిన విలువ మంత్రికి ఇవ్వరు మరి!! పేరుకే మంత్రి. పెత్తనమంతా ప్రభుత్వానిదే.

09/30/2016 - 03:38

హైదరాబాద్, సెప్టెంబర్ 29: దసరా పండగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. సికిందరాబాద్-కాకినాడ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ట్రైన్ నెం. 07011 సికిందరాబాద్-కాకినాడ పోర్ట్‌కు అక్టోబర్ 4,11,18,25 తేదీల్లో, అలాగే నవంబర్ ఒకటిన కాకినాడ-సికిందరాబాద్‌కు ఈ రైళ్లు నడుస్తాయి.

09/30/2016 - 03:37

హైదరాబాద్, సెప్టెంబర్ 29: కృష్ణా గోదావరి బేసిన్‌లో ఒఎన్‌జిసి చమురు, సహజవాయువు బావుల నుంచి రిలయన్స్ తన ఆధీనంలో ఉన్న కెజి డి 6 బావుల్లోకి గ్యాస్‌ను తరలించిందని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. 2009 నుంచి 2015 మధ్య అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలించినట్లు జస్టిస్ ఏపి షా కమిటీ నిర్ధారించిందన్నారు.

09/30/2016 - 03:36

హైదరాబాద్, సెప్టెంబర్ 29: సరిహద్దులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్‌కు సరైన రీతిలో సమాధానం చెప్పేలా దేశ సైనిక దళాలను సరైన రీతిలో ముందుకు నడిపారని ప్రధాని నరేంద్రమోదీని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి వైఎస్ చౌదరి అభినందించారు. దేశానికి మోదీ సమర్థ నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. భారత సైనిక దళాల సాహసోపేతాన్ని మంత్రి అభినందించారు.

Pages