S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/13/2018 - 03:18

అమరావతి, డిసెంబర్ 12: రేషన్ డీలర్లకు ప్రభుత్వం బకాయిపడిన మధ్యాహ్న భోజన పథకం బియ్యం కమీషన్‌ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యానికి ప్రభుత్వం కమీషన్ చెల్లిస్తుంది.

12/13/2018 - 03:17

గుంటూరు, డిసెంబర్ 12: టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తెలంగాణ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి చంద్రబాబు చేసిన ప్రచారమే కారణమన్నారు.

12/13/2018 - 03:16

అమరావతి, డిసెంబర్ 12: ఈనెల 28న కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో జరిగే కలెక్టర్ల సమావేశంలో ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి, సంక్షేమ పథాకల అమలు, వృద్ధిరేటు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరపనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

12/13/2018 - 03:15

అమలాపురం, డిసెంబర్ 12: వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించే పెంటావాలెంట్ వ్యాక్సిన్ వికటించి, రెండున్నర నెలల చిన్నారి కన్నుమూసిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి. అమలాపురం రూరల్ మండలం విత్తనాలవారి కాలువగట్టుకు చెందిన కర్రి వౌనిక రెండున్నర నెలల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

12/13/2018 - 03:11

శ్రీకాకుళం, డిసెంబర్ 12: తమను అన్నివిధాలుగా ఆదుకోవాలని వంశధార బాధితులు వైసీపీ అధినేత జగన్‌ను కోరారు. బుధవారం ఆమదాలవలస నియోజకవర్గం కృష్ణాపురం నుంచి పాదయాత్ర ప్రారంభానికి ముందు వంశధార బాధితులు జగన్‌ను కలసి తమ కష్టాలు చెప్పుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలన్నారు.

12/13/2018 - 03:10

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాఫ్రంట్ బహిరంగ సభలకు జనం తండోపతండాలుగా వచ్చారని, అయితే ఆశించిన ఫలితాలు రాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఒక్క సీటు దక్కకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు.

12/13/2018 - 02:56

జగ్గంపేట, డిసెంబర్ 12: తెలంగాణ ప్రజలు చంద్రబాబును తమ రాష్ట్రంలోకి రానివ్వకుండా తీర్పు ఇచ్చి, సరైన బుద్ధిచెప్పారని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని ఆయన నివాసంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. గోవిందా...గోవిందా అంటూ కాపునేతలతో కలిసి ముద్రగడ విలేఖర్ల సమావేశం ప్రారంభించారు.

12/13/2018 - 02:55

విజయవాడ(సిటీ), డిసెంబర్ 12: తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల సమరానికి బీసీ వర్గాలు సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపు ఇచ్చారు. బీసీ వర్గాలు ఆధిపత్య కులాలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన సమయం ఆసన్నమైయ్యిందన్నారు.

12/13/2018 - 02:37

విజయవాడ, డిసెంబర్ 12: ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌కాప్ స్పెషల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం.విజయ సునీతను ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్‌గా, అనంతపురం - హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్‌పర్సన్ పి.ప్రశాంతిని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

12/13/2018 - 02:35

విజయవాడ(సిటీ), డిసెంబర్ 12: డిసెంబర్ 15 నుండి డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోనికి ఉంచుతున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. ఎస్‌జీటీ అభ్యర్థులు సెంటర్ల ఎంపికకు సంబంధించి ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Pages