S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/21/2019 - 16:58

విజయవాడ:తమ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం వల్ల ప్రభుత్వానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిర్ కుమార్ యాదవ్ వెల్లడించారు.

10/21/2019 - 12:48

విజయవాడ: పోలీసులు విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని చెప్పారు. అందరికీ సమ న్యాయం అందేలా హోంగార్డులు విధి నిర్వహణలో చనిపోతే రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని చెప్పారు.

10/21/2019 - 05:24

నెల్లూరు రూరల్, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం వల్ల అవినీతిపరుల ఆట కట్టించామని, అదేవిధంగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా కాకుండా కాపాడగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పెన్నా నది నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు.

10/21/2019 - 05:19

విజయవాడ, అక్టోబర్ 20: రాజ్యాధికారం ద్వారానే బీసీలు అభివృద్ధి సాధించగలరని, ఇప్పటివరకు జనాభాలో సగభాగం పైగా ఉన్న బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుని వదిలేశాయని వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అధ్యక్షతన నగరంలో ఆదివారం ‘బీసీల రాజకీయ మేధోమథన సదస్సు’ జరిగింది.

10/21/2019 - 05:01

రాజమహేంద్రవరం, అక్టోబర్ 20: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద గత నెల 15వ తేదీన సుడిగుండంలో చిక్కుకుని బోల్తా పడిన రాయల్ వశిష్ఠ పున్నమి బోటు వెలికితీతకు మార్గం సుగమమయ్యింది. విశాఖపట్నం నుంచి వచ్చిన పది మంది డైవర్లు ఆదివారం నుంచి రంగంలోకి దిగారు. శివశక్తి అండర్ వాటర్ డైవర్ సర్వీస్ బృందానికి చెందిన సుమారు పదిమంది స్కూబా డైవర్లు బోటు వెలికితీత పనుల్లో పాల్గొంటున్నారు.

10/21/2019 - 01:18

విజయనగరం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్యాశాఖలో జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ రెండు కీలకమైన విభాగాల మధ్య సమన్వయలోపం ఏర్పడటం, ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడంతో దీనిని చక్కదిద్దేందుకు సంస్కరణలు చేపట్టారు.

10/21/2019 - 01:17

విజయవాడ: తాజాగా జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, మార్పులతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

10/21/2019 - 01:16

అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసం సమీపంలో పేలుడు సంభవించింది. ఆదివారం వేకువఝామున జరిగిన ఈ ఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఉరుకులు, పరుగులు తీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళకు గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన ఇంటి తలుపులు, ఇనుప గేట్లు విరిగిపడ్డాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

10/21/2019 - 01:15

అమరావతి, అక్టోబర్ 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమ వారం ఢిల్లీ వెళుతున్నారు. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఉ. 8గంటలకు జరిగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరై 10గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.

10/21/2019 - 04:10

అమరావతి: రాష్ట్రంలో ఎల్‌ఈడీ వీధిదీపాల అమరికను ప్రత్యేక ప్రజాహిత కార్యక్రమంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఎల్‌ఈడీ వీధి దీపాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని స్పష్టం చేశారు.

Pages