S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/09/2016 - 15:40

విశాఖ: ఇక్కడి సముద్రతీరంలో స్నానాలకు దిగి గల్లంతైన అయిదుగురు యువకుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కమ్యూనిటీ గార్డులు సకాలంలో స్పందించడం వల్ల మృతుల సంఖ్య తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఇటీవల బీచ్‌లో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో వీటి నివారణకు మంత్రి గంటా అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు.

05/09/2016 - 15:39

తిరుపతి: పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలంటే భవనాలు నిర్మించేందుకు తగిన స్థలాలు, నిధులు అవసరమని ఎపి డిజిపి జెవి రాముడు సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం వల్ల పోలీస్ శాఖలో నియామకాలు జరపలేని పరిస్థితి ఉందన్నారు. ఎపిలో పోలీస్ శిక్షణ కేంద్రాలు, పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.

05/09/2016 - 15:38

చిత్తూరు: ఇక్కడికి సమీపంలోని గోపాలపురం వద్ద సోమవారం కారు, స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

05/09/2016 - 15:38

హైదరాబాద్: ఎపి అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్‌గా వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. సమావేశాలకు హాజరైనపుడు తమకు అలవెన్స్‌లు పెంచాలని కమిటీ సభ్యులు కోరారు.

05/09/2016 - 15:36

కడప: తప్పుడు పత్రాలతో బ్యాంకురుణాలు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ముగ్గురు నిందితులను ప్రొద్దుటూరులో సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నకిలీ పాస్ పుస్తకాలు, కంప్యూటర్లు, పదిలక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

05/09/2016 - 12:45

విశాఖ: ఏడాదిలో ఒకసారి మాత్రమే లభించే సింహాచలేశుని నిజరూపాన్ని సందర్శించి భక్తులు ఆనందపారవశ్యానికి లోనవుతున్నారు. చందనోత్సవం సందర్భంగా ఇక్కడి సింహాచలం కొండపై స్వామివారి నిజరూప దర్శనం సోమవారం తెల్లవారు జామునుంచి ప్రారంభమైంది. తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, కేంద్రమంత్రి పి.అశోకగజపతిరాజు స్వామిని సందర్శించి చందనం, పట్టువస్త్రాలను సమర్పించారు.

05/09/2016 - 12:44

ఏలూరు: ఇసుక పెళ్లలు విరిగిపడడంతో ఊపిరాడక ఇద్దరు కూలీలు మరణించిన ఘటన చింతలపూడి మండలం తమ్మిలేరువాగులో సోమవారం జరిగింది. ఇసుక తవ్వేందుకు కొందరు కూలీలు వాగు వద్దకు వెళ్లారు. అయితే, అక్కడ ఇంతకుముందే కొందరు ఇసుక తవ్వడంతో గోతులు ఏర్పడ్డాయి. ఒక గొయ్యిలో దిగి ఇసుకను తీస్తుండగా పైనుంచి పెళ్లలు విరిగిపడడంతో ఊపిరాడక లక్ష్మీనారాయణ, నరేష్ అనే కూలీలు అక్కడికక్కడే మరణించారు.

05/09/2016 - 12:42

ఏలూరు: ఎపికి ప్రత్యేకహోదాపై గతంలో ఇచ్చిన హామీలను బిజెపి విస్మరించిందని తాను అనుకోవడం లేదని, ఈ విషయమై సిఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు సోమవారం ఇక్కడ మీడియాతో అన్నారు. బిజెపితో తాము ఇప్పటికీ సామరస్యంగానే వెళ్తున్నామని ఆయన చెప్పారు.

05/09/2016 - 12:41

అనంతపురం: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఎన్ని పోరాటాలకైనా సిద్ధమేనని సినీనటుడు శివాజీ అన్నారు. హోదా కోసం ఇక్కడ దీక్ష చేస్తున్న ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌కు ఆయన సోమవారం మద్దతు ప్రకటించారు. హోదాపై బిజెపి చెబుతున్న మాటల్ని నమ్మేందుకు జనం సిద్ధంగా లేరన్నారు. విద్యార్థులు ఉద్యమించి రోడ్లపై చేరుకునే పరిస్థితి రాకుండా ఇకనైనా కేంద్రం ఎపికి ప్రత్యేకహోదా ప్రకటించాలన్నారు.

05/09/2016 - 12:41

విజయవాడ: మాజీ మంత్రి, వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరేందుకు మార్గం సుగమమైంది. పార్టీలో చేరాల్సిందిగా సిఎం చంద్రబాబు కొత్తపల్లికి ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ టిడిపిలో చేరేందుకు తాను సిద్ధమేనని ఆయన చెప్పారని తెలిసింది.

Pages