S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/10/2016 - 02:18

కాకినాడ, మే 9: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఉదయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిర్వహించే ధర్నాకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హోదాను డిమాండ్‌చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో ధర్నాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

05/10/2016 - 02:16

కాకినాడ, మే 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఎన్‌జిఒల సంఘ నేత పరుచూరి అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలుంటాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అంశానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు.

05/10/2016 - 02:15

చింతలపూడి, మే 9: నిషేధిత రేవులో ఇసుక తవ్వుతూ ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. మరొకరు గాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శివపురం గ్రామ సమీపంలోని తమ్మిలేరులో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శివపురం రేవులో నాణ్యమైన ఇసుక లభిస్తుందని కూలీలు నిత్యం ఇక్కడ ఇసుక తవ్వకాలు సాగిస్తుంటారు.

05/10/2016 - 02:15

గుంటూరు, మే 9: పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన సమయంలో ప్రవేశపెట్టిన ఏ బిల్లులోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఎలాంటి ప్రస్తావన లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ అన్నారు. సోమవారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన ఆనాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు.

05/10/2016 - 02:13

అనంతపురం సిటీ, మే 9: రాష్ట్ర వ్యాప్తంగా ఏపి ఈ-సెట్ ప్రశాంతంగా జరిగిందని ఏపి ఈ-సెట్ కన్వీనర్ ఆచార్య పిఆర్ భానుమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన పరీక్షకు 36,755 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 34,738 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షకు 94.51 శాతం విద్యార్థులు హజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు సంబందించిన కీ ని ఈ నెల 10వ తేదీన ఏపిఈసెట్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని తెలిపారు.

05/10/2016 - 02:12

పార్వతీపురం, మే 9: తిరుమల వెంకన్న లడ్డూలో నల్లజెర్రి కనిపించడంతో ఓ భక్తుడు కలవరపడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన గౌరీ పట్టాపుదేవీప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 3న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం చేసుకుని 4న ఇంటికి చేరుకున్నాడు. వెంట వెంకన్నస్వామి ప్రసాదం లడ్డూలు తెచ్చుకున్నాడు.

05/09/2016 - 18:07

విశాఖ: ఎపి ఎంసెట్ ఫలితాల విడుదలలో అనివార్యమైన జాప్యం జరుగుతోంది. ‘నీట్’పై ఈరోజు సాయంత్రంలోగా సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందని భావించి ఎంసెట్ ఫలితాలను ప్రకటించేందుకు ఎపి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేందుకు గంటల తరబడి నిరీక్షించారు.

05/09/2016 - 17:46

చిత్తూరు: వైకాపాకు చెందిన మదనపల్లి ఎమ్మెల్యే తిప్పారెడ్డి టిడిపిలో చేరనున్నట్లు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సోమవారం ప్రకటించారు. ఆయన మదనపల్లిలో పర్యటించిన సందర్భంగా టిడిపిలోకి రావాలని తిప్పారెడ్డిని ఆహ్వానించారు. జగన్ వైఖరి నచ్చకే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని బొజ్జల అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఆశిస్తున్నందునే వైకాపా ఎమ్మెల్యేలు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నారన్నారు.

05/09/2016 - 16:37

విజయవాడ: గుంటూరు జిల్లా వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు వచ్చే నెల 20నాటికి పూర్తవుతాయని మున్సిపల్ మంత్రి నారాయణ సోమవారం తెలిపారు. అమరావతి వద్ద శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాలకు డిజైన్లను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. డిజైన్లను ఆమోదించిన వెంటనే పలు నిర్మాణాలను స్థలాలను కేటాయిస్తామన్నారు.

05/09/2016 - 16:35

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు. నిధుల కేటాయింపుతో పాటు పలు రంగాల్లో రాయితీలిచ్చి ఎపిని ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రగతి కోసం 15వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించాలని కొణతాల విజ్ఞప్తి చేశారు.

Pages