S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/27/2016 - 17:52

నెల్లూరు: పనిఒత్తిడితో మానసికంగా విసిగిపోయిన ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కావలి కచేరిమిట్ట సబ్‌పోస్ట్ఫాసులో బుధవారం జరిగింది. ఆఫీసులో ఒత్తిడి కారణంగా కొండమ్మ అనే ఉద్యోగిని శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

04/27/2016 - 17:52

విశాఖ: మే 10,17, 21 తేదీల్లో విశాఖలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిపేందుకు రంగం సిద్ధమైంది. నీటికొరత కారణంగా మే 1 తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు జరపరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో విశాఖలో కొన్ని మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

04/27/2016 - 17:50

విజయవాడ: అక్రమాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినవారు సైతం తనను విమర్శిస్తున్నారని, అయినా ప్రజల కోసం తాను అన్ని అవమానాలను వౌనంగా భరిస్తున్నానని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ బుధవారం వైకాపా ఎమ్మెల్యే రవికుమార్ టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మట్లాడుతూ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని పరోక్షంగా వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

04/27/2016 - 17:30

విశాఖ: బయోమ్యాక్స్‌లో మంగళవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం బుధవారం సాయంత్రానికి కూడా అదుపులోకి రాలేదు. బయోడీజిల్‌ తయారీకి ఉపయోగించే ముడిపదార్థం నిల్వ చేసిన 12 ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి వరసగా పేలిపోయాయి. శుద్ధి చేసిన బయోడీజిల్‌ ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు

04/27/2016 - 15:38

విజయవాడ: ప్రకాశం జిల్లా అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ బుధవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, ఇతర నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి శిద్ధా రాఘవరావు, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

04/27/2016 - 14:38

విశాఖ: దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో బయోమ్యాక్స్ కంపెనీలో చమురు ట్యాంకర్లు దగ్ధమైన ఘటనలో సుమారు వంద కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. మంగళవారం ఈ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగి 12 ట్యాంకుల్లోని ముడి చమురు దగ్ధమైన సంగతి తెలిసిందే. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంఘటన స్థలంలో శాంపిల్స్ సేకరించారు. వాయు కాలుష్యం ఏ మేరకు ఉందన్న విషయమై వారు అధ్యయనం చేస్తారు.

04/27/2016 - 14:38

తిరుపతి: రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించే జపాన్ కంపెనీలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన బుధవారం చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా శ్రీసిటీలో ఇసుజు కార్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఇసుజు వాహనాలకు రోడ్డు టాక్స్ రద్దుచేస్తామని, శ్రీసిటీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు.

04/27/2016 - 14:35

విశాఖ: కార్యకర్తల బలమే తమ పార్టీకి కొండంత అండ అని టిడిపి యువనేత నారా లోకేష్ అన్నారు. ఇక్కడ బుధవారం పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీకి పత్రిక, టీవీ చానల్ వంటి హంగులు లేవని పరోక్షంగా వైకాపాపై దాడి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు తన తండ్రి, సిఎం చంద్రబాబు కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని వివరించారు.

04/27/2016 - 12:32

విశాఖ: విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం పనసకుట్టు గ్రామంలో 16 మందిలో ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు. వీరిలో 11 మందిని వెంటనే వైద్య చికిత్స కోసం విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించారు. పనసకుట్టులో ఆంథ్రాక్స్ వ్యాధి బయటపడడంతో ఏజెన్సీ గ్రామాల్లో ఆందోళన మొదలైంది.

04/27/2016 - 12:30

హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి,సీనియర్ నేత డాక్టర్ మైసూరారెడ్డి ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఈ-మెయిల్‌లో నాలుగుపేజీల లేఖను పంపారు. అనంతరం మైసూరా ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, డబ్బుకు తప్ప పార్టీలో ప్రజాస్వామ్య విలువలకు స్థానం లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో పార్టీలో తాను కొనసాగడంలో అర్థం లేదన్నారు.

Pages