S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2016 - 07:37

విశాఖపట్నం, ఏప్రిల్ 29: పారిశ్రామిక నగరం విశాఖలోని పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పరిశ్రమల్లో పాటిస్తున్న భద్రతాప్రమాణాలు, ఇతర అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలందాయి. ఈ మేరకు కలెక్టర్ యువరాజ్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

04/30/2016 - 07:35

తిరుమల, ఏప్రిల్ 29: తిరుమల శేషాచలం అడవుల్లో శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు జాపాలి తీర్థం వెళ్లే కాలినడక మార్గం మధ్యలో ఉన్న గౌతమి వనం ప్రాంతంలో, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో తుంబుర తీర్థం వద్ద ఉన్న కన్యమడుగు ప్రాంతాలు అగ్నికి ఆహుతైయ్యాయి. గౌతమివనం వద్ద జరిగిన ప్రమాదంలో సుమారు మూడు హెక్టార్ల అటవీప్రాంతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.

04/29/2016 - 18:15

కాకినాడ: ఇక్కడ పర్లోవపేటలో మత్స్యకారులకు చెందిన సుమారు వంద గుడిసెలు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. ఓ ఇంట్లో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసి పడడంతో మంటలు మిగతా గుడిసెలకు వ్యాపించాయి. గుడిసెల్లో సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో మత్స్యకారులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. తాము సర్వస్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు.

04/29/2016 - 18:15

గుంటూరు: అనేక సమస్యల నేపథ్యంలో ఏర్పడిన ఎపికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని సిఎం చంద్రబాబు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం కరవు సమస్య వెంటాడుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

04/29/2016 - 17:06

అనంతపురం: వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే ఆ పార్టీలో అతని కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని మంత్రి పరిటాల సునీత అన్నారు. జగన్ ధోరణి నచ్చకే వైకపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని, డబ్బులిచ్చి వారిని చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సిఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూశాకే వైకాపా ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా టిడిపిలోకి వస్తున్నారని ఆమె అన్నారు.

04/29/2016 - 16:07

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో టూరిజంను శ్రీలంక తరహాలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీసీ హోటల్‌కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో టూరిజం అభివృద్ధికి ఐటీసీ సహకరించాలని కోరారు.

04/29/2016 - 14:00

గుంటూరు: మంగళగిరి మండంల ఎర్రబాలెంలోని ఓ పరుపుల తయారీ పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం తెలిశాక అగ్నిమాపక సిబ్బంది వచ్చి రెండుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. కోటి రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.

04/29/2016 - 13:57

విశాఖ: నాలుగు రోజులపాటు మంటలు ఎగసిపడిన బయోమ్యాక్స్ రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశించింది. దువ్వాడ సెజ్‌లోని ఈ కర్మాగారంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించాక మంటలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకు నాలుగు రోజుల సమయం పట్టింది. ప్రమాదం వల్ల 125 కోట్ల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

04/29/2016 - 12:45

విజయవాడ: మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష (నీట్)ను అన్ని రాష్ట్రాలూ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ ఎపి ఎంసెట్ శుక్రవారం ఉదయం యథావిధిగా ప్రారంభమైంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉదయం 10 గంటలకు ఎంట్రన్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం మెడిసిన్ ఎంట్రన్స్ జరుగుతుంది. ఎంసెట్ నిర్వహణకు ఏపి ప్రభుత్వం మొత్తం 546 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది.

04/29/2016 - 12:45

తిరుపతి: ఇక్కడికి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Pages