S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/14/2016 - 18:01

ఏలూరు: ఓ కార్మికుడు తన సహచర కార్మికుడిని హత్య చేసిన సంఘటన చాగల్లు సుగర్ ఫ్యాక్టరీలో గురువారం జరిగింది. ఫ్యాక్టరీలోని బిస్లరీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఓ కార్మికుడు కత్తితో పొడవడంతో డేవిడ్ అనే కార్మికుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. వ్యక్తిగత కక్షల వల్లే ఈ దారుణం జరిగిందని మిగతా కార్మికులు చెబుతున్నారు.

04/14/2016 - 16:28

విజయనగరం: టిడిపిలో చేరాలనుకుంటున్న తమ పార్టీ ఎమ్మెల్యే సుజయకృష్ణను కలిసేందుకు బొబ్బిలి వచ్చిన వైకాపా నేతలు నిరాశతో వెనుదిరిగారు. వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ఉదయం బొబ్బిలి కోటకు చేరుకున్నారు.

04/14/2016 - 14:34

ఒంగోలు: విజయవాడ వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించిన ఘటన టంగుటూరు టోల్‌గేట్ వద్ద గురువారం ఉదయం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలు కోల్పోయారని, మృతులు తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు.

04/14/2016 - 12:13

ఏలూరు: మరో పదిరోజుల్లో ప్రేమించిన యువకుడితో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం ఏలూరులో సంచలనం సృష్టించింది. స్థానిక పడమర వీధికి చెందిన లావణ్య (22) గురువారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. బట్టల దుకాణంలో పనిచేసే లావణ్య, అక్కడే పనిచేస్తున్న వెంకట్ ప్రేమించుకున్నారు.

04/14/2016 - 12:12

విజయనగరం: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును బుజ్జగించేందుకు వైకాపా నేతలు ఆఖరి ప్రయత్నాలు ప్రారంభించారు. సుజయకృష్ణను కలిసేందుకు వైకాపా నేతలు విజయసాయి రెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి గురువారం ఉదయం బొబ్బిలి వచ్చారు. సుజయకృష్ణ కోటలో లేరని అక్కడివారు చెప్పడంతో ఆయన కోసం వైకాపా నేతలు ఎదురుచూస్తున్నారు.

04/14/2016 - 12:12

కాకినాడ: వివాదాస్పద స్థలంలో అంబేద్కర్ జయంతి సభను నిర్వహించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆలమూరు మండలం గుమ్ములూరులో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ఇరువర్గాలకు చెందిన కొందరు గాయపడ్డారు.

04/14/2016 - 12:11

విజయవాడ: ఎపిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని సిఎం ప్రకటించారు. జక్కంపూడిలో పదివేల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తూ, గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

04/14/2016 - 12:10

కడప: వేంపల్లిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. మేనేజర్ గదిలో ఫర్నిచర్, కంప్యూటర్ కాలిపోయినట్లు, సుమారు 5 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు.

04/14/2016 - 07:59

కడప, ఏప్రిల్ 13: ఆర్టీపిపి (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు)ని నీటి సమస్య వెంటాడుతోంది. తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్, మైలవరం ప్రాజెక్టుల నీటి వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఆ ప్రాజెక్టుల సమీపంలోని ప్రజలకు సాగునీరు మాటలావుంచి తాగునీరే గగనంగా మారింది. గతంలో ఆర్టీపిపికి బొగ్గుకష్టాలు ఉండగా, బొగ్గు కొరత పరిష్కారమై ఇప్పుడు నీటి కష్టాలు మొదలయ్యాయి.

04/14/2016 - 07:57

కడప/కర్నూలు/అనంతపురం, ఏప్రిల్ 13: రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. వడగాలులతో పాదచారులు, ద్విచక్రవాహనాలు, బస్సుల్లో ప్రయాణించేవారు ఉక్కిరి బిక్కిరవువుతున్నారు.

Pages