S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/14/2016 - 07:57

ఆత్మకూరు, ఏప్రిల్ 13: ఏడు నెలల గర్భవతికి హటాత్తుగా గర్భం మాయమయింది. దేవుడే తన గర్భాన్ని తీసుకెళాల్డని, తిరిగి మూడు నెలల తరువాత ఇస్తాడని ఆ మహిళ చెబుతుండగా, ఇదంతా దైవ మహిమ అంటూ ఆమెను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. గ్రామ సర్పంచ్ నరసింహులు, ఆమె భర్త పోలన్న తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా అత్మకూరు మండల పరిధిలోని సింగంపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ (35) ఏడు నెలల గర్భవతి.

04/14/2016 - 07:34

విజయవాడ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా మాల మహానాడు నాయకుడు కారెం శివాజీని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు సభ్యులు ఈ కమిషన్‌లో ఉంటారు. ఈ సందర్భంగా కారెం శివాజీ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఈ పదవిని ఏ రాజకీయ నాయకునికి ఇవ్వకుండా ఒక దళితునికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు.

04/14/2016 - 04:35

చింతూరు/ఏలూరు , ఏప్రిల్ 13: నవ్యాంధ్రప్రదేశ్‌లో విలీనమైన ముంపు మండలాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనలో భాగం గా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన మండలాల్లో బుధవారం పర్యటించిన అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో బుధవారం సిఎం పర్యటించారు.

04/14/2016 - 04:29

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ గృహ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. అందరికి గృహాలు అన్న పథకం పేరుతో రాష్ట్రంలో ఆరు లక్షల మంది పేద, బడుగు, బలహీన వర్గాల వారికి గృహాలు నిర్మించనున్నారు.

04/13/2016 - 18:15

కాకినాడ: తెలంగాణ నుంచి ఎపిలో విలీనమైన మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా బుధవారం పర్యటించి గిరిజనులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చింతూరులో ఆయన అంగన్‌వాడీ కేంద్రాన్ని, ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి మట్టితట్టలను తలపైకి ఎత్తుకున్నారు. సబ్-ట్రెజరీ ఆఫీసును ప్రారంభించాక, గ్రామంలో పెట్రోల్ బంకు, ఎల్‌పిజి సిలిండర్ల గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

04/13/2016 - 18:15

విజయవాడ: రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఎపి పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఈ-పాస్ విధానంలో సమస్యలను అధిగమించేందుకు సర్వర్ల సంఖ్యను పెంచుతున్నామని ఆమె బుధవారం ఇక్కడ అధికారులతో సమీక్ష అనంతరం విలేఖరులకు తెలిపారు. అనారోగ్యం పాలై నడవలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం ‘మీ ఇంటికే మీ రేషన్’ విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు.

04/13/2016 - 16:43

విజయవాడ: రాష్ట్రంలో చేనేత కార్మికులకు 110 కోట్ల రూపాయల రుణమాఫీని త్వరలోనే అమలు చేస్తామని ఎపి ఎక్సయిజ్, చేనేత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఇక్కడ తెలిపారు. ఆధార్ లింకేజి లేనందున నేత కార్మికులకు రుణమాఫీలో జాప్యం జరిగిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మినీ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తామన్నారు. కల్తీకల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

04/13/2016 - 16:42

కాకినాడ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎపిలో విలీనమైన మండలాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలిసారిగా ఆయన బుధవారం విలీన మండలాల్లో పర్యటించేందుకు చింతూరు వచ్చారు. వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనులకు మార్కెటింగ్ సౌకర్యాలు,రుణ పరపతి కల్పిస్తామన్నారు. గిరిజన విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు.

04/13/2016 - 16:42

కాకినాడ: పరీక్షా కేంద్రంలో చూచిరాతను అడ్డుకోవడం అన్యాయమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల సందర్భంగా బుధవారం ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రంలో కొందరు విద్యార్థులు చూచికాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్లు పట్టుకుని వారిని బయటకు పంపారు. దీంతో చాలామంది విద్యార్థులు పరీక్షా కేంద్రం బయట ఆందోళనకు దిగారు.

04/13/2016 - 16:39

కాకినాడ: చింతూరు మండలం నిమ్మలగూడెం అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం గర్భిణులకు జరిగిన సీమంతం కార్యక్రమానికి ఎపి సిఎం చంద్రబాబు హాజరయ్యారు. గర్భిణులకు గాజులు, పసుపు,కుంకుమ, స్వీట్లు అందజేశారు. గ్రామంలో మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలను పలకరించి స్వీట్లు పంపిణీ చేశారు.

Pages