S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/15/2016 - 11:55

విజయవాడ: ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా పనిచేయాలని ఎపి సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం ఇరిగేషన్, భూగర్భ జలాలు, వైద్య-ఆరోగ్య శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పదిలక్షల ఇంకుడు గుంతల నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు తగిన ఆరోగ్య సలహాలు ఇవ్వాలని సిఎం ఆదేశించారు.

04/15/2016 - 11:53

కడప: శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

04/15/2016 - 07:18

హైదరాబాద్, ఏప్రిల్ 14: అస్పృశ్యత మూలాలను ప్రశ్నించి, అసమానతల పునాదులను పెకిలించి అపూర్వ సందేశాలను భరతజాతికి అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని ఎబివిపి అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కొన్నారు. అఖిల భాతర విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 కాగడాలతో ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శన చేసి నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.

04/15/2016 - 07:17

హైదరాబాద్, ఏప్రిల్ 14: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి వద్ద మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఎపిఐఐసికి అనుమతిస్తూ ఎపి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మెగా ఫుడ్ పార్కును రూ.184.88 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

04/15/2016 - 07:17

హైదరాబాద్, ఏప్రిల్ 14: సర్వమానవాళికి శ్రీరాముడు ఆదర్శప్రాయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు అందరికీ ఆయన శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎపి అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌బాబు, సినీనటుడు ఎన్ బాలకృష్ణ తదితరులు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

04/15/2016 - 07:15

హైదరాబాద్, ఏప్రిల్ 14: జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ గ్రూప్ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి ఈ కేసును విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు ఇస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ మూడు కేసుల్లో అభియోగాలను మోపింది. ఈ కేసులను సిబిఐ కోర్టు ప్రతి శుక్రవారం విచారిస్తోంది.

04/15/2016 - 07:14

హైదరాబాద్, ఏప్రిల్ 14: గుంటూరు జిల్లాలో రెండు దేవాలయాలను, ఇతర ఆరు దేవాలయాలతో కలిపి ఒక గ్రూపుగా వర్గీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన కేసు గత రెండు దశాబ్ధాలకు పైగా హైకోర్టులో నడుస్తోంది.

04/15/2016 - 07:11

అనంతపురం, ఏప్రిల్ 14: దేశానికి వెనె్నముక అయిన అన్నదాతకు కష్టాలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రస్తుత తరుణంలో రైతన్న తట్టుకుని నిలబడడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా రాయలసీమలాంటి వరుస కరవుప్రాంతాల్లో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టిన పలు బీమా పథకాలు ఏ మాత్రం ధీమా ఇవ్వని పరిస్థితి నెలకొంది.

04/14/2016 - 18:03

కర్నూలు: క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు వేసి అప్పుల పాలైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తికొండలో ఈ దారుణం గురువారం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ దుకాణం నడుపుతున్న మధు అనే యువకుడు క్రికెట్ మ్యాచ్‌లపై స్నేహితులతో బెట్టింగ్‌లు వేస్తూ భారీగా అప్పులు చేశాడు. బుధవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా మధు వేసిన బెట్టింగ్ అంచనాలు తారుమారయ్యాయి.

04/14/2016 - 18:01

అనంతపురం: నగరాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక యాప్‌ను వినియోగిస్తామని ఎపి డిజిపి జెవి రాముడు గురువారం ఇక్కడ తెలిపారు. ప్రయోగాత్మకంగా దీన్ని విజయవాడ,విశాఖ, అనంతపురంలో ప్రారంభిస్తామన్నారు.

Pages