S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/13/2016 - 08:28

ఒంటిమిట్ట, ఏప్రిల్ 12: మరో అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామయ్య బ్రహ్మోత్సవాలు తిరుమల వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న తరహలోనే జరుపుతామని టిటిడి ఇఓ సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన జిల్లా అధికారులతో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు ఒంటిమిట్ట విచ్చేశారు. ముందుగా సీతారాముల కల్యాణ వేదిక ప్రాంగణాన్ని పరిశీలించారు.

04/13/2016 - 08:27

విజయవాడ, ఏప్రిల్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి ఇంటి మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించేవారు. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. అంతేకాకుండా భద్రతను మరింత పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కలిగి ఉన్నారు.

04/13/2016 - 08:20

విజయవాడ, ఏప్రిల్ 12: బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, కాజోల్ దంపతులను ఏపి టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో అజయ్ దేవగన్ బుధవారం కలిశారు.

04/13/2016 - 08:18

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: విభజన చట్టం ఆర్డినెన్స్‌తో విలీనమైన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారిగా అడుగుపెడుతున్నారు. భౌగోళికంగా విలీనం జరిగిందే తప్ప పాలనాపరంగా సేవలు ఈ మండలాల ప్రజలందరికీ చేరలేదు. వౌలిక సదుపాయాలు లేక ఇక్కడి జనజీవనం సమస్యలతో సతమతమవుతోంది.

04/13/2016 - 08:17

నంద్యాల, ఏప్రిల్ 12: కర్నూలు జిల్లా నంద్యాలలో ఎస్‌ఆర్‌బిసి డిఇగా పనిచేస్తున్న శేషుబాబు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్టు ఎసిబి అధికారుల సోదాల్లో వెల్లడయింది.

04/13/2016 - 08:16

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ టిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రంలోని అన్ని బస్ డిపోలలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

04/13/2016 - 06:50

విజయవాడ, ఏప్రిల్ 12: అక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.. ఆ ప్రాంతంలో ఏ పొలం చూసినా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రధాన పంటలతోపాటు అంతర్ పంటలను పండిస్తూ రైతులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పచ్చని శోభతో కళకళలాడుతున్న గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ఈ పొలాలను రాజధాని కోసం తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనేక ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. బలవంతంగా

04/13/2016 - 05:57

విజయవాడ, ఏప్రిల్ 12:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాల కారణంగా తక్షణం నవ్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో 50 విదేశీ ఐటి కంపెనీల యాజమాన్యాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

04/12/2016 - 18:03

విజయవాడ: కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు 485 కోట్ల రూపాయలతో ఘాట్లు, రోడ్లు నిర్మిస్తామని ఎపి మంత్రి పుల్లారావు మంగళవారం ఇక్కడ తెలిపారు. అధునాతన ఘాట్లను నిర్మిస్తామని, భక్తులకు టిటిడి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. కృష్ణా తీరంలో అన్ని ఆలయాలను ఆధునీకరిస్తామన్నారు.

04/12/2016 - 18:03

విజయవాడ: ఎపిలో వినోదం, మీడియా క్రియేటివ్ సిటీ నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్ ఆసక్తి చూపుతున్నారని సిఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ మంగళవారం అజయ్, కాజోల్ దంపతులు సిఎంను మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. ఎపిలో పర్యాటకరంగ ప్రచారకర్తలుగా పనిచేసేందుకు ఈ ఇద్దరూ స్వచ్ఛందంగా ముందుకువచ్చారు.

Pages