S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/09/2016 - 12:01

హైదరాబాద్: ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించరాదని స్పీకర్ పదేపదే చెప్పటంతో, అందుకు నిరసనగా ఎ.పి. అసెంబ్లీలో బుధవారం వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. సమావేశం ప్రారంభమైన వెంటనే విపక్ష నేత వై.ఎస్.జగన్ మాట్లాడుతూ రైతు రుణాలను ప్రభుత్వం చెల్లించనందున రాష్టవ్య్రాప్తంగా రైతులు అధిక మొత్తంలో అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

03/09/2016 - 07:04

హైదరాబాద్: ఓ మహిళను వేధించిన కేసులో ఏపి మంత్రి రావెల కిషోర్‌బాబు తనయుడు రావెల సుశీల్‌కు మంగళవారం నాంపల్లి కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడికి ఆదేశించింది. సుశీల్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు కేసు విచారణ పూర్తి చేశారని, రాజకీయ ఒత్తిడితో సుశీల్‌ను ఈ కేసులో ఇరికించారని న్యాయవాది వాదించారు.

03/09/2016 - 06:57

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్ధను ఆర్ధికంగా పటిష్ఠం చేయాలని వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కండక్టర్ల వ్యవస్ధను తొలగించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెయ్యి కోట్లను మంజూరు చేసి ఆర్టీసి నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఏపిఎస్ ఆర్టీసి కూడా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

03/09/2016 - 06:54

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా పక్షపాతులని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భంగా శాసనసభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మంత్రి రావెలపై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు.

03/09/2016 - 06:53

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మంగళవారం నాడు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది.

03/09/2016 - 06:53

హైదరాబాద్: విద్యుత్ ఆదాకు సంబంధించి ఎల్‌ఇడి బల్బులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ల ప్రక్రియ ద్వారా సేకరిస్తున్నారని, ఇందు లో పారదర్శకత లేదని, రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వ సంస్ధను అడ్టుపెట్టుకుని కుంభకోణానికి పాల్పడుతోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

03/09/2016 - 06:51

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ల పోస్టులను మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడి తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

03/09/2016 - 06:50

హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో విశాఖపట్నంలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణంపై బిజెపి శాసనసభ్యుడు పి విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మృణాళిని బదులిస్తూ ఆరు నెలల్లో కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, దరఖాస్తు దారులకు సొమ్ము చెల్లిస్తున్నామని తెలిపారు.

03/09/2016 - 06:10

విజయనగరం: పట్టణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు 14వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులను జిల్లా పరిషత్ ద్వారా ఖర్చుచేయాలని ఆదేశించింది. 25 శాతం నిధులను మళ్లిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాపంచాయతీ అధికారులకు ఆదేశాలు అందాయి.

03/09/2016 - 06:10

రాజమహేంద్రవరం: అర్బన్ ప్రాంతాల్లో అదుపులేని అనధికార నిర్మాణాలతో ముంచుకొస్తున్న ముంపు ప్రమాదాలను నివారించడానికి పురపాలక శాఖ ఒక సీజన్ ముందుగానే అప్రమత్తమయ్యింది. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల ఏర్పడే ముంపు ప్రమాదాన్ని ముందుగానే ఎదుర్కోవడానికి పురపాలక శాఖ ప్రణాళికను సిద్ధంచేస్తోంది.

Pages