S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/17/2018 - 05:34

మడకశిర, నవంబర్ 16: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిరలో హంద్రీనీవా కాలువ పనులను ఆయన పరిశీలించారు.

11/17/2018 - 05:33

భీమవరం, నవంబర్ 16: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పేరుతో నిర్మిస్తున్న ఇళ్లను కేంద్రం ప్రభుత్వం స్కానింగ్ చేస్తోంది. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-పంచాయితీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ- పీఆర్) ద్వారా సామాజిక తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వారే స్వయంగా లబ్ధిదారులుగా ఎంపికైన వారిచ్చిన చిరునామాలకు వెళ్ళి ఆరా తీస్తున్నారు.

11/17/2018 - 05:40

రాజమహేంద్రవరం, నవంబర్ 16: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం గూడ్స్‌రైలుకు చెందిన వ్యాగన్ పట్టాలు తప్పింది. తాల్చేరు నుంచి బొగ్గులోడుతో బయలుదేరిన గూడ్స్ రైలు ఉదయం 6గంటల సమయంలో మెముకార్‌షెడ్ సమీపంలోకి వచ్చేసరికి ఇంజన్ వెనుక ఉన్న వ్యాగన్ పట్టాలు తప్పింది. ఆసమయంలో రైలు తక్కువ వేగంతో వెళుతుండటం వల్ల పెను ప్రమాదం తప్పింది.

11/17/2018 - 05:31

అమరావతి, నవంబర్ 16: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న చంద్రన్న బీమా పథకానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పరిశ్రమలు, కార్మికశాఖ మంత్రి పితాని సత్య నారాయణ ఆదేశించారు. సచివాలయం రెండవ బ్లాక్‌లోని తన కార్యాలయంలో చంద్రన్న బీమాపై శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

11/17/2018 - 05:30

భద్రాచలం టౌన్, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు శాఖ చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు విస్తృతంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

11/17/2018 - 05:29

విశాఖపట్నం, నవంబర్ 16: దేశ ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీస్థాయిలో పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. విశాఖ నగరంలో సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేపట్టే పోరాటాలకు సంబంధించి కార్యాచరణను రూపొందిస్తామన్నారు.

11/16/2018 - 13:37

విశాఖపట్నం: రాష్ట్రంలోకి తమ అనుమతి లేకుండా సీబీఐ ప్రవేశానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుపట్టారు. చంద్రబాబు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. జగన్ కేసులో వాస్తవాలు ఇంతవరకు బయటపెట్టలేదని అన్నారు.

11/16/2018 - 06:30

అనకాపల్లి, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిపై ఎటువంటి బహిరంగ చర్చకైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. 22 కోట్ల రూపాయల వ్యయంతో బాబూ జగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణ పనులకు విశాఖ జిల్లా చోడవరంలో సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం శంకుస్థాపన చేసారు.

11/16/2018 - 06:29

కాకినాడ సిటీ, నవంబర్ 15: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సీపోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ వ్యవహారాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ పోర్టు కేంద్రంగా జరుగుతున్న నాసిరకం బియ్యం ఎగుమతుల కారణంగా అంతర్జాతీయంగా దేశీయ ఉత్పత్తులకు చెడ్డపేరు వస్తోందన్నారు.

11/16/2018 - 06:03

కర్నూలు, నవంబర్ 15: అధికార పదవులు తీసుకోవడంలో ముందున్న కర్నూలు జిల్లా నేతలు సమస్యల పరిష్కారంలో వెనుకబడిపోయారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యుడు, 11 మంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఏకంగా 15 రాష్టస్థ్రాయి పదవులు దక్కించుకున్నా జిల్లా నేతలు పార్టీ అధినేత వద్ద జిల్లా సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపడంలో విఫలమయ్యారన్న అపవాదు తలకెత్తుకున్నారు.

Pages