S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/18/2020 - 23:39

ముంబయి, ఫిబ్రవరి 18: వరుసగా నాలుగో రోజైన మంగళవారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఏజీఆర్ వ్యవహారం టెలికాం ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని కనబరిచింది. లావాదేవీలు ప్రారంభంలో తీవ్రంగా నష్టపోయిన సెనె్సక్స్ అనంతరం కొంతమేరకు కోలుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 161.31 పాయింట్లు నష్టపోయి 40,894.38 వద్ద ముగిసింది. ఒకదశలో 444 పాయింట్లు కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

02/18/2020 - 23:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: సెప్టెంబర్‌తో ముగిసే మార్కెటింగ్ సంవత్సరంలో దేశంలో చక్కెర ఎగుమతులు ఐదు మిలియన్ టన్నులకు చేరుకుంటాయని జాతీయ చక్కెర మిల్లుల సంఘం (ఐఎస్‌ఎంఏ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 8-9 మిలియన్ టన్నుల మేర చక్కెర కొరత ఉన్నందున దేశీయ ఎగుమతులకు విదేశాల్లో ఎంతో డిమాండ్ ఉందని ఈ సంస్థ తెలిపింది. ఈ ఏడాది 6 మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపింది.

02/18/2020 - 23:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశవ్యాప్తంగా గోధుమ ఉత్ప త్తి ఏడాదికాయేడాది రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2019-20 పంటల సంవత్సరంలో గోధుమ దిగుబడి 106.21 మిలియన్ టన్నుల మేర ఉండవచ్చునని ఆశిస్తున్నారు. సకాలంలో రుతుపవనాల రాక, వర్షపాతం వల్ల ఎకరాకు గోధుమ దిగుబడి ఎప్పటికప్పుడు పెరుగుతోందని, ఈసారీ రికార్డు స్థాయిలోనే దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

02/18/2020 - 07:30

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను అనివార్యంగా కొనసాగించాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. వ్యవస్థాగత సంస్కరణలను కొనసాగించడం ద్వారా డిమాండ్‌ను పునరుద్ధరించగలుగుతామని, అలాగే ఆర్థిక వ్యవస్థకూ మరింత మద్దతు ఇవ్వగలుగుతామని ఆయన తెలిపారు. ప్రస్తుత మాంద్య పరిస్థితుల నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలంటే అన్ని రకాలుగానూ సానుకూల చర్యలు ఎంతో అవసరమని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

02/17/2020 - 23:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: తమ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను మరే ఇతర సంస్థతోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని జీవిత బీమా కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంక్‌తో తమ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను ఎల్‌ఐసీ విలీనం చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం ఈమేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది.

02/17/2020 - 23:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నాణ్యతాయుతమైన ఎగుమతులపైనే దృష్టి పెట్టాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారంనాడు ఇక్కడ పిలుపునిచ్చారు. ముడి వస్తువులను కాకుండా విలువ చేర్చిన ఉత్పత్తుల ఎగుమతుల ద్వారానే వైవిధ్యాన్ని తీసుకురావాలని ఆయన అన్నారు. ఇనుప ఖనిజానికి బదులు అత్యంత నాణ్యతాయుతమైన ఉప్పును ఎగుమతి చేయాలని, ఈ రకమైన ఉత్పత్తుల వల్ల అంతర్జాతీయంగా భారత ఎగుమతుల పరిమాణం పెరుగుతుందని తెలిపారు.

02/17/2020 - 23:04

ముంబయి, ఫిబ్రవరి 17: ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో కూడా సోమవారం నష్టాలను చవిచూశాయి. ఒకపక్క ఆర్థిక మాంద్య పరిస్థితులు, కరోనా వైరస్ ప్రభావం ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగు వేసేలా చేస్తున్నాయి. సోమవారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 202.05 పాయింట్లు తగ్గి 41,055.69 పాయింట్ల వద్ద ముగిసింది.

02/17/2020 - 23:02

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ సోమవారం 2020 సంవత్సరానికి సంబంధించి భారత వృద్ధి రేటును గతంలో అంచనా వేసిన 6.6 శాతం నుంచి 5.4 శాతానికి కుదించింది. తాజాగా ఇందుకు సంబంధించి తన అంచనాలను వెల్లడించిన మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ సంస్థ గత రెండేళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా గాడి తప్పిందని, ఆర్థిక రికవరీ అన్నది అనుకున్నంత తేలిక కాదని తెలిపింది.

02/17/2020 - 05:27

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆధీనంలోని దేశంలోని రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)ను అమ్మడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే మంత్రు ల బృందం బీపీసీఎల్ అమ్మకానికి సంబంధించి, బిడ్స్‌ను ఆహ్వానించడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

02/17/2020 - 04:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను పరిశీలిస్తే, సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలోనే అధికంగా ఉంది. ఇటీవల కేంద్రం సబ్సిడీ సిలిండర్‌తోపాటు సబ్సిడీ లేని సిలిండర్ ధరను కూడా పెంచిన విషయం తెలిసిందే. ఈ పెరుగుదలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Pages