S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/04/2019 - 04:47

వాషింగ్టన్: చాలా దేశాలతో పోలిస్తే, భారత దేశం అత్యధికంగా పన్నులు వసూలు చేస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇందుకు తాము కూడా స్పందిస్తామని స్పష్టం చేశారు. కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా నుంచి భారత్‌కు ఎన్నో రకాల వస్తువులు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

03/04/2019 - 00:55

న్యూఢిల్లీ, మార్చి 3: పది అత్యంత విలువయిన పది భారతీయ కంపెనీలలోని అయిదు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన గత వారంలో రూ. 35,503 కోట్లు పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లబ్ధి పొందింది.

03/04/2019 - 00:53

న్యూఢిల్లీ, మార్చి 3: కేంద్ర సర్కారు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలతో ఉపాధి కల్పనకు ఊతం వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాలో వైద్య సేవలు పొందుతున్న సమయంలో, ఆయన స్థానంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆర్థిక రంగ పరిపుష్టికి, వివిధ రంగాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అంశాలను చేర్చారు.

03/04/2019 - 00:52

న్యూఢిల్లీ, మార్చి 3: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో భారత ఈక్విటీ మార్కెట్‌లో నికరంగా సుమారు రూ. 17,220 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 2017 నవంబర్ తరువాత విదేశీ మదుపరులు భారత ఈక్విటీ మార్కెట్‌లో ఒక నెలలో ఇంత అధిక మొత్తంలో నికర పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి.

03/04/2019 - 00:52

న్యూఢిల్లీ, మార్చి 3: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకూ తగ్గడం, అంతర్జాతీయ సూచీలు కూడా సానుకూలంగా స్పందించడం వంటి అంశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే స్టాక్ మార్కెట్‌లో కొత్త వారం లాభాలు పండిస్తాయన్న ఆశ మదుపరుల్లోనేగాక, స్టాక్ బ్రోకర్లలోనూ ఆశలు రేపుతున్నది.

03/03/2019 - 03:45

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 7,951.29 కోట్ల మేరకు మోసపోయినట్టు ఆ బ్యాంకు తెలిపింది. ఈ ఖాతాలన్నీ చాలా ముందే నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)గా మారిపోయాయని ఆ బ్యాంకు నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రంలో పేర్కొంది.

03/02/2019 - 22:55

న్యూఢిల్లీ, మూర్చి 2: దేశంలో వేరు శనగ ఉత్పత్తి దారుణంగా పడిపోతే, ఆందోళన కలిగిస్తున్నది. సుమారు పదేళ్ల కాలంలో రెండో అత్యల్ప ఉత్పత్తి నమోదయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా 46.95 మిలియన్ టన్నుల వేరు శనగ ఉత్పత్తి జరిగింది. అంతకు ముందు, 2010-11 ఆర్థిక సంవత్సరంలో 82.65 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2011-12 ఆర్థిక సంవత్సరంలో 69.64 మిలియన్ టన్నులకు పతనమైంది.

03/02/2019 - 22:53

ముంబయి, మార్చి 2: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం జరిగిన ఐదు రోజుల వ్యాపార లావాదేవీలు లాభనష్టాల కలయికగా మారాయి. మొత్తం మీద చివరి రోజైన శుక్రవారం 196.37 పాయింట్లు లాభపడడంతో స్టాక్ మార్కెట్ గట్టెక్కెందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత వారం చివరి రోజున 35,871.48 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్, సోమవారం సుమారు 342 పాయింట్లు లాభపడి, 36,213.38 పాయింట్లకు దూసుకెళ్లింది.

03/02/2019 - 22:48

న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడి బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 310 తగ్గి, రూ. 33,770కి చేరుకుంది. స్థానిక వ్యాపారుల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడానికి దారితీసింది.

03/02/2019 - 22:47

ముంబయి, మార్చి 2: కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు చెందిన ప్రత్యామ్నాయ ఆస్తుల విభాగం గురువారం 600 మిలియన్ డాలర్ల నిరర్థక ఆస్తుల పెట్టుబడి నిధులను ప్రకటించింది. ఈప్రత్యేక పరిస్థితుల నిధుల్లో అబుదాబీ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ) 500 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా సమకూర్చేందుకు ముందుకు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మిగిలిన రూ.100 కోట్ల నిధులను తమ సంస్థ సమకూరుస్తుందన్నారు.

Pages