S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/30/2018 - 04:33

మోర్తాడ్: ఉత్తర భారతావనిలో పశుగ్రాసంగా సాగు చేసే ఎర్రజొన్న పంట సాగుకు కేంద్ర బిందువుగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లో ఆ పంట సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గిట్టుబాటు ధర విషయంలో విత్తన వ్యాపారులకు, పంట సాగు చేసే రైతులకు మధ్య దశాబ్ద కాలంగా వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో రైతులు ఆ పంట సాగు చేయాలంటేనే పక్కకు తప్పుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

12/29/2018 - 23:32

ముంబయి, డిసెంబర్ 29: గత వారం నష్టాలను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్ ఈవారం ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆతర్వాత క్రమంగా బలపడి, లాభాలతో ముగిసింది. గతవారం మార్కెట్‌కు చివరి రోజైన శుక్రవారం లావాదేవీలు ముగిసే సమయానికి సెనె్సక్స్ 35,742.07 పాయింట్లను నమోదు చేసింది. అయితే, 24వ తేదీన ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయిన సెనె్సక్స్ 35,470.15 పాయింట్ల వద్ద ముగిసింది.

12/29/2018 - 23:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఈ ఏడాది భారీగా నష్టపోయిన రంగాల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్‌బీఎఫ్) కంపెనీలను ప్రధానంగా ప్రస్తావించాలి. ఒకవైపు బ్యాంకింగ్ రంగం మోసాలు.. పరారీలు.. నిష్క్రమణలతో బ్యాంకింగ్ వ్యవస్థ చావు దెబ్బతింటే, ద్రవ్య లభ్యత సక్రమంగా లేకపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

12/29/2018 - 23:28

హైదరాబాద్, డిసెంబర్ 29: పరిశ్రమల రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలు ఎంతో ఊతం ఇస్తున్నాయని యూపీ పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహన పేర్కొన్నారు. ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లో వచ్చే జనవరి 15 నుండి ప్రారంభమయ్యే కుంభమేళా గురించి ప్రజాచైతన్యం తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు.

12/29/2018 - 23:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అధికారాలను దుర్వినియోగం చేసి, కొన్ని కంపెనీలకు వందల, వేలాది కోట్ల రూపాయల రుణాలను ఉదారంగా ఇచ్చేసి, ఆతర్వాత రుణాల ఎగవేతల కారణంగా బ్యాంకుల నష్టానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నది.

12/29/2018 - 23:26

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,066.00
8 గ్రాములు: రూ.24,528.00
10 గ్రాములు: రూ. 30,660.00
100 గ్రాములు: రూ.3,06,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,279.144
8 గ్రాములు: రూ. 26,233.152
10 గ్రాములు: రూ. 32,791.44
100 గ్రాములు: రూ. 3,27,914.4
వెండి
8 గ్రాములు: రూ. 332.00

12/28/2018 - 22:45

ముంబయి, డిసెంబర్ 28: సెనె్సక్స్ బెంచిమార్కును అధిగమించి వరుసగా మూడోరోజూ లాభాల బాటలో నడిచింది. శుక్రవారం 269.44 పాయింట్లు ఎగబాకి 36,076.72 పాయంట్ల వద్ద స్థిరపడింది. విదేశీ ఇనె్వస్టర్లు పెద్దయెత్తున అమ్మకాలకు పాల్పడినప్పటికీ రూపాయి విలువ బలపడడంతో భారతీయ మార్కెట్లు లాభాల బాటలోనే నడిచాయి.

12/28/2018 - 22:35

ముంబయి, డిసెంబర్ 28: బంగారు నగలకు డిమాండ్ మరింతగా పెరుగుతున్నదని ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసీఆర్‌ఏ) సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే విడుదల చేసిన ప్రకటనను అనుసరించి, వ్యవస్థీకృత రంగంలో బంగారు నగలకు డిమాండ్ 6 నుంచి 7 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.

12/28/2018 - 22:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తూర్పు సముద్ర తీర ప్రాంతంలో తుపాను పీడిత ఓఎన్‌జీసీ సెమీ సబ్‌మెర్సిబుల్ క్షేత్రం ‘ఒలిండా స్టార్’లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన నిపుణుల బృందం రక్షణ చర్యలు చేపట్టింది. రికార్డు స్థాయిలో రిగ్‌ను పునరుద్ధరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో ఈనెలారంభంలో పెథాయ్ తుపాను విరుచుకుపడిన సంగతి తెలిసిందే.

12/28/2018 - 22:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న ఆరు అనుబంధ సంస్ధలు త్వరలో ‘షేర్ల అమ్మకాల ఆఫర్ల’తో ముందుకు రానున్నాయి. టీహెచ్‌డీసీఐఎల్, టీసీఐఎల్, రైల్ టెల్ సహా ఇరు ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు ఈ ఆఫర్లు చేయనున్నాయని, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ కంపెనీ (కేఐఓసీఐఎల్) మాత్రం ‘్ఫలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎప్‌ఓపీ)తో ముందుకొస్తుందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Pages