S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/02/2019 - 22:30

ముంబయి, జనవరి 2: అనారోగ్య కారణంగా వైద్య పరీక్షలు, చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్ జైట్లీ స్థానంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ భారత స్టాక్ మార్కెట్‌పై చెప్పుకోదగిన ప్రతికూల ప్రభావాన్ని చూపలేదనే చెప్పాలి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్, జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ పాయింట్లు పెరగడమే ఇందుకు కారణం.

02/02/2019 - 22:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగా లబ్ధి పొందేందుకు వీలుగా దేశంలోని చిన్న, మధ్యతరహా రైతులను వెంటనే గుర్తించాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ శనివారం అన్ని రాష్ట్రాలను కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సుదీర్ఘ లేఖలు రాసింది.

02/02/2019 - 22:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గోవాలో 267.81 కోట్ల రూపాయల ఖర్చుతో ఆయుర్వేద, నేచురోపతి ఆసుపత్రి నిర్మాణం జరుగనుం ది. ఇందుకు ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బీసీసీ ముందుకు వచ్చింది. ఈ భారీ ఆసుపత్రి నిర్మాణానికి వీలుగా ఎన్‌బీసీసీ ఆయుష్ మం త్రిత్వ శాఖతో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

02/02/2019 - 22:26

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,249.00
8 గ్రాములు: రూ.25,992.00
10 గ్రాములు: రూ. 32,490.00
100 గ్రాములు: రూ.3,24,900.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,474.866
8 గ్రాములు: రూ. 27,798.928
10 గ్రాములు: రూ. 34,748.66
100 గ్రాములు: రూ. 3,47,486.6
వెండి
8 గ్రాములు: రూ. 332.00

02/02/2019 - 22:25

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: టీవీఎస్ మోటార్ కంపెనీ జనవరి నెలలో తమ వాహనాల విక్రయం ద్వారా 4 శాతం అభివృద్ధి సాధించింది. ఈ ఏడాది ప్రథమార్థంలోని ఒక నెల కాలంలో మొత్తం 2,82,630 యూనిట్లను విక్రయించింది. అదే గత ఏడాది ఇదే నెలలో 2,71,801 యూనిట్ల విక్రయాలు జరిపినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

02/01/2019 - 20:43

‘ది కాఫీ చైన్’లో భాగంగా లెగో పాప్-అప్ కేఫ్‌ను లండన్‌లో ప్రారంభిస్తున్న హాలీవుడ్ స్టార్లు క్రిస్ ప్రాట్, టిఫానీ హాడిష్. ‘ది లెగో మూవీ-2’ సినిమాను పాప్ అప్ కఫే స్పాన్సర్ చేస్తున్నది. అదే విధంగా యూనిసెఫ్‌తో కలిసి వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నది.

02/01/2019 - 20:40

ముంబయి, ఫిబ్రవరి 1: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. నష్టాలు తప్పవేమోనన్న అనుమానాలతో మొదలైన ట్రేడింగ్ చివరికి 212.74 పాయింట్లు పెరిగి, 36,469.43 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 62.70 పాయింట్లు పెరగడంతో 10,893.65 పాయింట్లకు చేరింది.

02/01/2019 - 20:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వస్తూత్పత్తి విభాగంలో దేశంలో మూడు సరికొత్త సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జాతీయ స్టాక్ ఎక్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) తెలిపింది. ముంబయి, చెన్నై, ఢిల్లీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పాన్ ఇండియా సరఫరా వ్యవస్థను మరింత సౌకర్యవంతం చేయడంలో భాగంగా ఈ సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్‌ఎస్‌ఈ గురువారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

02/01/2019 - 20:38

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రభుత్వం నిర్వహించే వేలం పాటల్లో రీటైల్ ఇనె్వస్టర్లు నేరుగా పాల్గొనేందుకు వీలుగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నిర్వహించే ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల విషయంలో సహాయకారిగా ఉండేందుకు బీఎస్‌ఈ సరికొత్త యాప్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు బీఎస్‌ఈ రిజిస్ట్రర్ట్ వ్యాపార సభ్యుడి సహాయంతోనే రీటైల్ ఇనె్వస్టర్లు ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉండే ది.

02/01/2019 - 20:38

హాంగ్‌కాంగ్, ఫిబ్రవరి 1: అమెరికా-చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధానికి స్వస్థి పలికేందుకు ఇరు దేశాలూ సాగిస్తున్న చర్చలు శుక్రవారం సైతం ఓ కొలిక్కి రాలేదు. ఎలాంటి ఒప్పందాలూ జరకుండానే ఈ చర్చలు ముగిశాయి. ఈ శిఖరాగ్ర చర్చలు తదుపరి కూడా కొనసాగించాలని ఇరుదేశాలూ తీర్మానించాయి. ఈక్రమంలో ఇనె్వస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఆసియన్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమ ఫలితాలనే అందుకున్నాయి.

Pages