S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/24/2018 - 04:01

మోర్తాడ్, అక్టోబర్ 23: లారీల కొరత ఏర్పడడంతో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న రాసులు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు వాహనాలు కేటాయించినప్పటికీ, అవి రెండుమూడు రోజుల పాటు రాకపోవడంతో ఎక్కడికక్కడ అటు పంట నిల్వలు, వాటిని నింపిన బస్తాలు పెరిగిపోతున్నాయి.

10/24/2018 - 03:54

విశాఖపట్నం: రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు పారిశ్రామిక వేత్తలు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న ఫిన్‌టెక్ ఫెస్టివల్-2018లో భాగంగా పారిశ్రామిక వేత్తలతో జరిగిన ప్రత్యేక భేటీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలన్నారు.

10/24/2018 - 03:46

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: రాష్ట్రంలో వనాల అభివృద్ధిలో భాగంగా ఆదాయ వనరులను సముపార్జించడమే లక్ష్యంగా ఆంధ్రపదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) పనిచేస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ దివి శివరామ్ చెప్పారు. అడవుల అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సముపార్జించుకుంటూ స్వయం సమృద్ధి సాధించడమే ఈ సంస్థ ప్రధాన కార్యకలాపమన్నారు.

10/24/2018 - 03:15

ముంబయి, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ మంగళవారం కూడా బలహీనపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా ఆరు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి.

10/24/2018 - 03:13

ముంబయి, అక్టోబర్ 23: రూపాయి విలువ మంగళవారం తొలుత పతనమయినప్పటికీ చివరకు తిరిగి పుంజుకొని దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.57 వద్ద ముగిసింది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత వరకు తగ్గడం, బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయానికి పూనుకోవడం వల్ల రూపాయి పుంజుకుంది. మంగళవారం ఉదయం డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.74 వద్ద ప్రారంభమయింది.

10/24/2018 - 03:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: భారత్‌లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఈ సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో అయిదు శాతం పెరిగి, సరికొత్త గరిష్ఠ స్థాయి 44 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. పండుగల సీజన్ ముందున్న తరుణంలో హ్యాండ్‌సెట్ల విక్రేతలు భారీగా స్మార్ట్ఫోన్లను అమ్మడం వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో వీటి అమ్మకాలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయని ‘కౌంటర్‌పాయింట్ రీసెర్చ్’ తన నివేదికలో వెల్లడించింది.

10/24/2018 - 03:10

భువనేశ్వర్, అక్టోబర్ 23: భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పెట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ మంగళవారం విదేశీ కంపెనీలకు పిలుపునిచ్చారు. దేశంలో 2030-31 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని, అందువల్ల ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా విదేశీ కంపెనీలు అపరిమితమయిన ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వివరించారు.

10/24/2018 - 03:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ లాభార్జనలో విశే్లషకుల అంచనాలను మించిపోయింది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 14.8 శాతం పెరుగుదలతో రూ. 2,534 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ తన సాఫ్ట్‌వేర్ సేవల వ్యాపారం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించడం వల్ల తన నికర లాభాన్ని బాగా పెంచుకోగలిగింది.

10/24/2018 - 03:08

ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,126.00
8 గ్రాములు: రూ.25,008.00
10 గ్రాములు: రూ. 31,260.00
100 గ్రాములు: రూ.3,12,600.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,331.00
8 గ్రాములు: రూ. 26,648.00
10 గ్రాములు: రూ. 33,310.00
100 గ్రాములు: రూ. 3,33,100.00
వెండి
8 గ్రాములు: రూ. 330.40

10/23/2018 - 03:37

విజయవాడ: నౌకా నిర్మాణ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి కనబరిచాయి. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దక్షిణ కొరియాలో భారత కాన్సులేట్ జనరల్ నేతృత్వంలో ఆ దేశ పారిశ్రామికవేత్తల బృందం సోమవారం కలిసింది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించింది.

Pages