S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/01/2018 - 00:11

ముంబయి, మే 31: మదుపరులు విస్తృతంగా కొనుగోళ్లకు పూనుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. రెండు రోజుల నష్టాలకు తెరదించుతూ గురువారం మార్కెట్ కీలక సూచీలు బాగా పుంజుకున్నాయి.

06/01/2018 - 00:10

న్యూఢిల్లీ, మే 31: బ్యాంకుల్లో రోజువారీ ఆధార్ నవీకరణ లక్ష్యాన్ని యుఐడీఏఐ సగానికి తగ్గించింది.ది 2018, జూలై 1నుంచి అమల్లోకి రానున్నది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఆధార్ సదుపాయం ఉన్న బ్యాంకులు రోజుకు 12 వరక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్లు, నవీకరణలు పూర్తి చేయాలి. అదేవిధంగా 2019, జనవరి 1 నుంచి రోజుకు 16 ఎన్‌రోల్‌మెంట్లు, నవీనకరణలు పూర్తి చేయాల్సి ఉంది.

06/01/2018 - 00:09

న్యూఢిల్లీ, మే 31: దేశ వ్యాప్తంగా రెండవ రోజు కూడా బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ దేశంలోని 21 జాతీయ బ్యాంకులకు చెందిన సిబ్బంది చేపట్టిన సమ్మె రెండవ రోజు గురువారం కూడా జయప్రదంగా ముగిసింది. దాదాపు పది లక్షల మందికిపైగా ఉద్యోగులు సమ్మెలోపాల్గొన్నారు.

06/01/2018 - 00:09

న్యూఢిల్లీ, మే 31: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గతనాలుగేళ్లలో స్ధూల జాతీయోత్పత్తి 7.3 శాతం ఉండేటట్లు చర్యలు తీసుకుందని, అతకు ముందు ఐదేళ్లలో జిడిపి 7.5 శాతం ఉండేదని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్‌మేషన్ సర్వీసస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసెల్) పేర్కొంది. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, అలాగే వైఫల్యాలపై క్రెసిల్ రేటింగ్ ఇచ్చింది.

06/01/2018 - 00:08

విశాఖపట్నం, మే 31: ప్రపంచ మార్కెట్‌లో అరకు కాఫీకి ఆదరణ తగ్గిపోతోంది. గత రెండేళ్ళగా కాఫీ పంట ఆశాజనకంగా లేకపోవడం, ప్రభుత్వం నుంచి గిరిజన రైతులకు ప్రోత్సాహాకాలు లేకపోవడం, పంట అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టకపోవడం వంటివి ఆదరణ తగ్గిపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

05/31/2018 - 02:52

ముంబయి, మే 30: వీడియోకాన్‌కు భారీగా రుణాల అందచేతలో సీఈవో చందాకొచ్చర్ ఎదుర్కొంటున్న ‘క్విడ్ ప్రో కో’ అభియోగాలపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు భారతీయ దిగ్గజ ప్రయివేట్ బ్యాంకు ఐసీఐసీఐ బోర్డు వెల్లడించింది. వీడియోకాన్ సంస్థ (వేణుగోపాల్ ధూత్)కు రుణ సదుపాయం కల్పించడంలో చందాకొశ్చర్, ఆమె కుటుంబీకులు ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డారన్న అభియోగాలు తలెత్తడం తెలిసిందే.

05/31/2018 - 02:53

ముత్తుకూరు, మే 30: ఆసియా తీరంలోనే అతి పెద్ద పోర్టుగా రూపుదిద్దుకుంటున్న కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి నాగపూర్‌కు నేరుగా కంటైనర్ రైల్వే సర్వీసును ప్రారంభించి మరో మైలురాయిని అధిగమించింది. కృష్ణపట్నం పోర్టు నుంచి కాంకార్ సహకారంతో నాగపూర్‌కు కంటైనర్ రైల్వే సర్వీసును ఓడరేవు సీఇఓ అనిల్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

05/31/2018 - 02:55

ముంబయి, మే 30: వరుసగా రెండోరోజు కూడా స్టాక్ మార్కెట్లు మందకొడిగానే సాగాయి. మూడీస్ రేటింగ్ తగ్గడం, అమెరికా - చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో దాని ప్రభావం భారతీయ మార్కెట్లపై పడింది. ఈ పరిణామాలను ప్రతిబింబిస్తూ సెనె్సక్స్ 43 పాయింట్లు తగ్గి 34,906.11 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 18.95 పాయింట్లు తగ్గి 10,614.35 పాయింట్ల వద్ద ముగిసింది.

05/31/2018 - 02:56

న్యూఢిల్లీ, మే 30: మూడీస్ భారత్ అభివృద్ధి అంచనాను రెండు శాతం తగ్గించింది. 2018 సంవత్సరానికి భారత్ ఆర్థిక ప్రగతి 7.5 శాతంగా గతంలో అంచనా వేసింది. అయితే దీన్ని 7.3 శాతానికి తగ్గిస్తూ తాజాగా అంచనా వేసింది. పెరిగిన చమురు ధరలు, ఆర్థిక పరిస్థితులు కఠినతరమైన నేపథ్యంలో, వృద్ధివేగం మందగిస్తుందని పేర్కొంది. అయితే 2019లో దేశ ఆర్థిక ప్రగతి 7.5 శాతంగానే ఉండబోతున్నదన్న తన అంచనాలో మార్పులేదని స్పష్టం చేసింది.

05/31/2018 - 02:27

న్యూఢిల్లీ, మే 30: విజయ్ మాల్యా, లలిత్ మోదీలను త్వరగా అప్పగించడంలో సహాయపడాలని, నీరవ్ మోదీ ఎక్కడున్నదీ తెలుసుకోవడంలో సహాయపడాలని, ఇక్కడ జరిగిన ఇండో- యూకే ఆంతరంగిక వ్యవహారాలపై జరిగిన చర్చల సందర్భం గా యూకేను కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటు వాదుల భారత వ్యతిరేక కా ర్యకలాపాలను బ్రిటన్‌లో అనుమతించరాదని కూడా కోరినట్టు వారు వెల్లడించారు.

Pages