S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/08/2017 - 08:39

యొకహామ (జపాన్), మే 7: రుణాల మంజూరు, అలాగే ఆసియా ప్రాంతంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల వౌలిక రంగాభివృద్ధికి సాయం విషయంలో చాలా సమయం పడుతోందని, దీన్ని తగ్గించుకోవాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి)ను భారత్ కోరింది. ఎడిబి బోర్డ్ ఆఫ్ గవర్నర్ల బిజినెస్ సెషన్‌లో ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ సమాజ హితానికీ నిధులను ఎడిబి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

05/08/2017 - 08:39

న్యూఢిల్లీ, మే 7: ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా త్రైమాసిక ఫలితాలపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

05/08/2017 - 08:37

లండన్, మే 7: బ్రిటన్ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. నిరుడుతో పోల్చితే 3.2 బిలియన్ పౌండ్లు పెరిగిన వీరి సంపద.. ప్రస్తుతం 16.2 బిలియన్ పౌండ్లకు చేరింది. ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్’లో వెయ్యి మందికి చోటు దక్కగా, అందులో 40కిపైగా భారత సంతతివారే కావడం విశేషం.

05/07/2017 - 09:11

ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు
రూ. 500 కోట్ల బిట్‌కాయిన్స్ డిమాండ్

05/07/2017 - 09:09

శ్రీనగర్, మే 6: బ్యాంకులు లక్ష్యంగా మిలిటెంట్లు దాడులకు తెగబడుతుండటంతో దక్షిణ కాశ్మీర్‌లో దాదాపు 40 బ్యాంకు శాఖల్లో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. పుల్వామ, షోపియన్ జిల్లాల్లోగల సమస్యాత్మక ప్రాంతాల్లోని శాఖల్లో నగదు లావాదేవీలు ఆగిపోయాయి. భద్రతా దళాల సూచనల మేరకు బ్యాంకింగ్ వర్గాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

05/07/2017 - 09:09

హైదరాబాద్, మే 6: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, మాజీ సిఇఒ క్రిష్ గోపాలకృష్ణన్.. ఇన్ఫోసిస్‌లో తాను ప్రస్తుతం ఉద్యోగిగా లేనప్పటికీ, ఆ సంస్థతో తనకున్న బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదన్నారు. ఉన్నతోద్యోగుల వేతనాల విషయంలో సంస్థ యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య అభిప్రాయబేధాలు నెలకొన్న నేపథ్యంలో గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

05/07/2017 - 09:09

హెచ్‌డిఎఫ్‌సి లైఫ్
న్యూఢిల్లీ, మే 6: హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 274 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 8 శాతం అధికం. ప్రీమియంల ద్వారా ఆదాయం ఈసారి 892 కోట్ల రూపాయలుగా ఉంది. పోయినసారి కంటే 9 శాతం అధికమని సంస్థ తెలిపింది.
అజంతా ఫార్మా

05/07/2017 - 09:08

నూజివీడు, మే 6: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అన్నదానం ట్రస్టుకు కృష్ణాజిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామం నుండి పది టన్నుల మామిడి కాయలను శనివారం పంపారు. నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మామిడి కాయలను లారీలో లోడు చేసి దేవస్థానానికి పంపారు.

05/06/2017 - 08:46

ముంబయి, మే 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల క్షీణత మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 267.41 పాయింట్లు పతనమై 29,858.80 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 74.60 పాయింట్లు పడిపోయి 9,285.30 వద్ద నిలిచింది.

05/05/2017 - 09:16

హైదరాబాద్, మే 4: తెలుగు చలనచిత్ర రంగంలో రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి -2 సినిమా ఫ్యూచరి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీనుంచి రూ.200 కోట్ల రూపాయలకు బీమా పాలసీ తీసుకుంది. ఫ్యూచర్ జనరలి ఇన్సూరెన్స్ కంపెనీ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. ఫిలిమ్ ప్యాకేజి ఇన్సూరెన్స్ ప్యాకేజి కింద ఈ బీమా చేసినట్లు ఆ కంపెనీ తెలియజేసింది.

Pages