S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/30/2016 - 00:23

విజయవాడ, నవంబర్ 29: చెన్నైలోని వెల్‌టెక్ విశ్వవిద్యాలయం ఫ్రాన్స్‌లోని ఓ విశ్వవిద్యాలయంతో కలిసి పెట్రో ఉత్పత్తుల పొదుపునకు దశల వారీగా రోడ్లపైకి ఇ-సైకిళ్లను తీసుకురావాలని ఇటీవల నిర్ణయంచింది. దీనికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా కూడా ఊపింది.

11/29/2016 - 07:27

న్యూఢిల్లీ, నవంబర్ 28: బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 16 రోజుల తర్వాత సోమవారం తిరిగి తెరుచుకున్న బులియన్ మార్కెట్‌కు పెద్ద షాక్‌నిస్తూ 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,750 రూపాయలు క్షీణించింది. కేవలం ఒక్కరోజే ధర ఇంతగా దిగజారడంతో 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర 29,400 రూపాయలకు, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,250 రూపాయలకు పడిపోయాయి. వెండి ధర కూడా విపరీతంగా నష్టపోయింది.

11/29/2016 - 07:26

ముంబయి, నవంబర్ 28: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం మరో 30 పైసలు క్షీణించి 68.76 రూపాయలకు చేరింది. శుక్రవారం 68.46 రూపాయల వద్ద ముగిసినది తెలిసిందే. దిగుమతిదారుల నుంచి డాలర్లకు పెరిగిన డిమాండ్.. రూపాయి విలువ దిగజారడానికి దారితీసింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న సంకేతాలు..

11/29/2016 - 07:25

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆదిత్యా బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్‌కు చెందిన మెన్స్‌వేర్ బ్రాండ్.. పీటర్ ఇంగ్లాండ్ స్టోర్లలో ఇక ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ దుస్తులు అమ్మనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి చేనేత కార్మికులతో కలిసి కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్ కమిషనర్ హాండ్లూమ్స్, పీటర్ ఇంగ్లాండ్ ఈ ‘ఇండియా హాండ్లూమ్ బ్రాండ్’ కలెక్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

11/29/2016 - 07:24

ముంబయి, నవంబర్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ చివర్లో కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.83 పాయింట్లు పుంజుకుని 26,350.17 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.60 పాయింట్లు పెరిగి 8,126.90 వద్ద నిలిచింది. టెలికామ్, పవర్, రియల్టీ, ఆటో రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

11/29/2016 - 07:23

కాకినాడ, నవంబర్ 28: ఆరేళ్ల క్రితం నాటి అందరి ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రికార్డులను బయటకు తీసి, ఇప్పుడు చేస్తున్న డిపాజిట్లతో పోల్చి లెక్కలు కడతామని విశాఖ జోన్-2 ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ సి ఓంకారేశ్వర్ స్పష్టం చేశారు.

11/28/2016 - 04:59

న్యూఢిల్లీ, నవంబర్ 27: స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించనున్నాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ.

11/28/2016 - 04:54

న్యూఢిల్లీ, నవంబర్ 27: కేవలం రెండు రోజుల్లోనే పది వేలకుపైగా కస్టమర్లు సేవింగ్స్ ఖాతాలను తెరిచారని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. గత వారం రాజస్థాన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే. ఈ క్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అధికంగా తమ ఖాతాలను తెరిచారని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చెప్పింది.

11/28/2016 - 04:53

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత కరెన్సీ రూపాయి విలువ మున్ముందు మరింత పతనం అవుతుందని డ్యూషే బ్యాంక్ రిసెర్చ్ నివేదిక ఒకటి అంచనా వేసింది. డాలర్‌తో పోల్చితే వచ్చే నెలాఖరుకల్లా 70 రూపాయల స్థాయికి దిగజారవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది చివరికి ఇది 72.50 రూపాయల స్థాయికి క్షీణించవచ్చంది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ నెలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయినది తెలిసిందే.

11/28/2016 - 04:52

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశవ్యాప్తంగా పోస్ట్ఫాసుల్లో 32,631 కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగాయి. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. ఈ నెల 8వ తేదీ రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగా, డిసెంబర్ 30 వరకు రద్దయిన నోట్లను బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించారు.

Pages