S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/19/2016 - 00:22

విశాఖపట్నం, జూలై 18: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానంలో సోలార్ పవర్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషీయంట్ ఎండోమెంట్ ప్రాజెక్ట్ (ఇఇఇపి)ను అమలు చేయనుంది. దీనివల్ల సింహాచలం కొండపై వరుసగా నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి.

07/18/2016 - 03:58

న్యూఢిల్లీ, జూలై 17: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ వారం మార్కెట్ సరళిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

07/18/2016 - 03:51

హైదరాబాద్, జూలై 17: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని వచ్చే వీలుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పెట్టుబడుల కోసం ఇపిఎఫ్‌ఒ కేటాయించిన నిధుల్లో 12 శాతం వరకు స్టాక్ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.

07/18/2016 - 03:48

ముంబయి, జూలై 17: ద్రవ్యోల్బణాన్ని ఎలా కట్టడి చేయాలో తనకు చెప్పాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శకులకు సవాల్ విసిరారు. దేశ వృద్ధిరేటు కంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపైనే రాజన్ దృష్టి పెట్టారంటూ తనపై వచ్చిన విమర్శలకు ఆయన పైవిధంగా స్పందించారు. తనను విమర్శించడానికి ముందు ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపులో పెట్టవచ్చో చెప్పండని ఆయన ప్రశ్నించారు.

07/18/2016 - 03:47

న్యూఢిల్లీ, జూలై 17: పెట్టుబడులపై విదేశీ మదుపరుల ఆలోచనా సరళి మారినట్లుంది. గత నెల వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) ఆసక్తి కనబరిచినది తెలిసిందే. అయతే ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు.

07/18/2016 - 03:45

న్యూఢిల్లీ, జూలై 17: భారత్‌లో వ్యాపార నిర్వహణ కష్టంగా ఉందని ఎయిర్‌ఏషియా సిఇఒ షా ఇమ్రాన్ అహ్మద్ అన్నారు. దేశీయ విధానాలు, స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమన్న ఆయన భారత్‌లో తమ వ్యాపారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ ఎయిర్‌ఏషియా వృద్ధి మందగమనాన్ని సమర్థించుకున్నారు.

07/17/2016 - 05:26

ముంబయి, జూలై 16: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) చెక్ బౌన్సు కేసులో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరైన విజయ్ మాల్యాకు ముంబయి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు)ను జారీ చేసింది. శనివారం విచారణకు హాజరుకావాలని మే 7న అంధేరి సబర్బన్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు మాల్యాను ఆదేశించగా, మాల్యా రాకపోవడంతో తాజా ఎన్‌బిడబ్ల్యును మెజిస్ట్రేట్ ఎఎ లౌల్కర్ జారీ చేశారు.

07/17/2016 - 05:25

అహ్మదాబాద్, జూలై 16: బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలకు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) కారకులైనవారి పేర్లను బహీర్గతం చేస్తామని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) హెచ్చరించింది. మొండి బకాయిదారుల్లో తొలి 7,000 మంది పేర్లను ప్రకటిస్తామని శనివారం వెల్లడించింది.

07/17/2016 - 05:25

న్యూఢిల్లీ, జూలై 16: విమానయానం.. సంపన్నులకు మాత్రమే అనువైన ప్రయాణం. అయితే ఇప్పుడు ఈ మాటకు కాలం చెల్లింది. మధ్యతరగతి ప్రయాణికులకూ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తోంది మరి. విమానయాన సంస్థల ఆలోచనల్లో మార్పులు, కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సంస్కరణలు కలిసి విమాన ప్రయాణాన్ని సామాన్యుడికీ సౌకర్యవంతంగా చేస్తున్నాయి.

07/17/2016 - 06:23

హైదరాబాద్, జూలై 16: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని చూస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు దేశానికి ఎంతో మేలు చేస్తుందని జస్టిస్ గూడ రఘురాం అభిప్రాయపడ్డారు.

Pages