S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/12/2016 - 07:35

హైదరాబాద్, మే 11: శాంసంగ్ ఇండియా స్మార్ట్ నూతన శ్రేణి ఎయిర్ కండీషనర్లు, స్మార్ట్ డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. బుధవారం నాడిక్కడ ఒక హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త ఉత్పత్తులను శాంసంగ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటాని ఆవిష్కరించారు.

05/12/2016 - 07:34

న్యూఢిల్లీ, మే 11: పది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితులు.. దేశ ఆర్థిక వ్యవస్థకు కనీసం 6,50,000 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించి ఉండవచ్చని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. వరుసగా గత రెండేళ్లుగా చోటుచేసుకున్న వర్షాభావ పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 256 జిల్లాలు, అక్కడ నివసిస్తున్న దాదాపు 33 కోట్ల మంది ప్రజలు కరవు బారినపడ్డారని అసోచామ్ అధ్యయనం తెలిపింది.

05/12/2016 - 07:31

ముంబయి, మే 11: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 15.62 శాతం పెరిగి 1,055.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 912.60 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం బ్యాంక్ స్పష్టం చేసింది.

05/12/2016 - 07:30

ముంబయి, మే 11: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. గత రెండు రోజులుగా లాభాలను అందుకున్న సూచీలపై మంగళవారం మారిషస్‌తో ద్వంద్వ పన్నుల నిరోధక ఒప్పందం సవరణ ప్రభావం పడింది. వచ్చే ఏడాది నుంచి భారత్‌కు మారిషస్ ద్వారా వచ్చే పెట్టుబడులపై పన్ను వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది.

05/11/2016 - 06:43

హైదరాబాద్, మే 10: కాలుష్యం వెదజల్లే రసాయన ఔషధ పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుండడంతో ఆ పరిశ్రమలను మూసి వేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) సిద్ధమైంది. ఈ మేరకు సిపిసిబి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 450 రసాయన ఫార్మా కంపెనీల యాజమాన్యాలకు షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 28 ఫార్మా కంపెనీలను మూసి వేయాలంటూ నోటీసులు జారీ అయ్యాయి.

05/11/2016 - 06:42

న్యూఢిల్లీ, మే 10: టాటా స్టీల్ బ్రిటన్ ఆస్తుల కొనుగోలు రేసులో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు స్టీల్ కూడా ఉంది. దీన్ని జెఎస్‌డబ్ల్యు స్టీల్ ధ్రువీకరించింది కూడా. సంస్థ వృద్ధిలో భాగంగా వివిధ సంస్థల వ్యాపారాలను కొనుగోలు చేసే దిశగా వెళ్తున్నామని, ఇందులో బ్రిటన్ టాటా స్టీల్ కూడా ఉందని ఓ ప్రకటనలో మంగళవారం జెఎస్‌డబ్ల్యు స్టీల్ తెలిపింది.

05/11/2016 - 06:41

విశాఖపట్నం, మే 10: విద్యుత్ ఆదా, కాలుష్య నియంత్రణకు దోహదపడే సోలార్ పంపుసెట్ల వాడకంలో విజయనగరం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో దూసుకెళ్తోందని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజు తెలిపారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస, కుమిలి గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపుసెట్లను మంగళవారం ఆయన పరిశీలించారు.

05/11/2016 - 06:40

న్యూఢిల్లీ, మే 10: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించనుంది. మారిషస్‌తో ఉన్న 1983 ద్వంద్వ పన్నుల నిరోధక కనె్వన్షన్ని (డిటిఎసి) సవరించగా, కొత్త పన్ను ఒప్పందాల ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి 50 శాతం, 2019 ఏప్రిల్ 1 నుంచి 100 శాతం మారిషస్ పెట్టుబడులపై భారత్ పన్నులను వేయనుంది. ఈ మేరకు మంగళవారం మోదీ సర్కారు స్పష్టం చేసింది.

05/11/2016 - 06:39

బెంగళూరు, మే 10: ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్.. బ్యూటీ సర్వీసెస్ ప్రొవైడర్ సలోసాను హస్తగతం చేసుకుంది. ఈ మేరకు మంగళవారం క్వికర్ తెలియజేసింది. హోమ్ సర్వీసెస్ విభాగంలో 250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలన్న ప్రణాళికలో భాగంగానే సలోసా వ్యూహాత్మక కొనుగోలు అని క్వికర్ తెలిపింది. తాజా పెట్టుబడులు క్వికర్ సేవలను మరింత విస్తృతపరచగలవన్న విశ్వాసాన్ని ఓ ప్రకటనలో ఆ సంస్థ వ్యక్తం చేసింది.

05/11/2016 - 06:39

ముంబయి, మే 10: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాలను అందుకోగలిగాయి. అయితే ఉదయం ఆరంభంలో నష్టాల్లో కదలాడిన సూచీలు చివరకు మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

Pages