S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

03/21/2017 - 01:09

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయంతోపాటు మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాక జాతీయ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మోదీ రథ చక్రాలు ఇలాగే సాగితే కాంగ్రెస్ ముక్త భారత్, విపక్ష ముక్త భారత్ ఏర్పడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

03/14/2017 - 00:44

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు కనువిప్పు కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ఐదు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద నోట్ల రద్దు తదితర విప్లవాత్మక నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది.

03/07/2017 - 02:58

ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు నేటితో తెరపడింది. ఐదు రోజుల తరువాత అంటే మార్చి 11 తేదీ వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయటంతోపాటు జాతీయ రాజకీయాలను ఒక పెద్ద మలుపు తిప్పుతాయి.

02/28/2017 - 00:51

మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ‘స్థానిక ఎన్నికల’ ఫలితాలు చూసిన తర్వాతైనా రాహుల్ గాంధీ మేల్కొనకపోతే- రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం నుండి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కాపాడలేరు. మహారాష్టల్రో ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకూ పనికిరాని స్థానాకి పడిపోవటంతో పాటు ‘శివసేన’ పంచన చేరవలసిన దుస్థితికి చేరింది.

02/21/2017 - 00:57

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల తప్పులను ఎండగట్టటం సమర్థనీయమే కానీ, ఓట్ల కోసం ప్రజలను త ప్పుదోవ పట్టించటం, మభ్యపెట్టటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకు ప్రణాళికలు, పథకాల గురించి చె ప్పుకునే స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పటంతోపాటు ప్రత్యర్థుల విధానాలను ఎండగట్టటం ఎన్నికల ప్రచారంలో భాగమే అవుతుంది.

02/14/2017 - 01:08

బాత్‌రూంలో రెయిన్ కోట్ వేసుకుని స్నానం చేయటం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వచ్చినట్లు మరెవ్వరికి రాదంటూ వ్యంగ్య విమర్శలు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నది. నరేంద్ర మోదీ రాష్టప్రతి ప్రసంగంపై రాజ్యసభలో జరిగిన చర్చకు బదులిస్తూ మన్మోహన్ సింగ్‌పై వ్యంగ్య వాఖ్యలు చేశారు.

02/07/2017 - 01:11

రాజకీయ పార్టీలకు అందే విరాళాలను అదుపు చేసేందుకు మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఎంత మాత్రం సరిపోవు. సగటు మనిషి తన ఆదాయ వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ, దేశాన్ని నడిపించే రాజకీయ పార్టీలు వాటి ఆదాయ వివరాలను బహిర్గతం చేయకూడదా? రాజకీయ పార్టీలకు ఎవరెంత విరాళం ఇస్తున్నారు? అనేది ప్రజలు తెలుసుకోకూడదా? పాలితులు అన్ని వివరాలు వెల్లడించాలి.

01/31/2017 - 01:19

పెద్దనోట్ల రద్దు వ్యవహారం ఆర్థిక వ్యవస్థను, యావత్ దేశాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈ బడ్జెట్- ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కత్తిమీద సాములా మారింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో రోజు అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన జైట్లీ 2017-18 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదిస్తారు.

01/24/2017 - 05:39

అమెరికా నలభై ఐదవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌తో వ్యవహరించే విషయంలో భారత్ ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో కఠిన విధానాలను అవలంబిస్తానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

01/17/2017 - 01:36

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనునిత్యం విమర్శించటం ద్వారా రాజకీయంగా ఎదిగిపోగలుగుతామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన రాజకీయ సలహాదారులు భావిస్తే పప్పులో కాలేసినట్లే. ప్రత్యర్థులను విమర్శించటం, ఆరోపణలను కురిపించటం ద్వారా ఎవ్వరూ ఎదిగిపోలేరు. ఇంతకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెనక ఉంటూ అమ్మచాటు పిల్లవాడిగా వ్యవహరించిన రాహుల్ గాంధీ ఇటీవల మాటలు బాగా నేర్చుకున్నారు.

Pages