S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

01/10/2017 - 01:40

అవినీతిని, నల్లధనాన్ని అంతం చేసేందుకే పెద్దనోట్లను రద్దు చేశానంటున్న ప్రధాని మోదీకి త్వరలో అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్షే. సంచలన విధానాలు, కీలక నిర్ణయాలతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తానంటున్న ప్రధానికి ఐదు రాష్ట్రాల ప్రజలు మద్దతు ఇస్తారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

01/03/2017 - 01:34

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారసత్వ రాజకీయాలకు ప్రతీకలుగా ఉంటూనే, ఆ రంగంలో తమదైన ముద్ర వేసుకునేందుకు తపన పడుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో రాహుల్ తన స్థానాన్ని పదిలం చేసుకొనేందుకు యత్నిస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీలో ప్రాబల్యం పెంచుకునేందుకు అఖిలేష్ తన తండ్రిపైనే సమరం ప్రకటించారు.

12/26/2016 - 23:52

అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మో దీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు మొండిగా వ్యతిరేకించడం సబబు కాదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం తమ బాధ్యత అన్నట్టుగా విపక్షాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని ప్రకటించినపుడు స్వాగతించిన ప్రతిపక్షాలు ఆ తర్వాత అందుకు భిన్నంగా నిరసన వ్యక్తం చేయడం విడ్డూరం.

12/20/2016 - 01:07

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రజల ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఎటువంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా సిగ్గుపడవలసిందే. ఇరుపక్షాలు అవలంబించిన మొండి వైఖరి మూలంగానే శీతాకాల సమావేశాలు ప్రజలకు సంబంధించిన ఎలాంటి అంశంపై చర్చ జరపకుండానే వాయిదా పడ్డాయి.

12/12/2016 - 23:57

‘దేవుడి కోసమైనా మీ బాధ్యతలను నిర్వహించండి’ అంటూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తరువాత కూడా మన పార్లమెంటు సభ్యుల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ‘ప్రజలు మిమ్మల్ని పని చేసేందుకు ఎన్నుకున్నారే తప్ప పార్లమెంటును స్తంభింపజేసేందుకు కాదం’టూ ఆయన చెప్పిన హితవు ప్రతిపక్ష పార్టీల నాయకుల కళ్లు తెరిపించలేకపోయింది.

12/05/2016 - 23:31

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ స్వార్థమే పరమావధిగా ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా విపక్షం సభాకార్యక్రమాలను అదేపనిగా అడ్డుకుంటోంది. అధికార పక్షం మొం డిగా వ్యవహరిస్తున్న సమయంలో ప్రతిపక్షం తన వ్యూహాన్ని మార్చుకుని లక్ష్య సాధనకు ప్రయత్నించకుండా తాను కూడా ఏకపక్షంగా ప్రవర్తించడం సమర్థనీయం కాదు.

11/29/2016 - 07:07

దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న ‘పెద్దనోట్ల రద్దు’ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో అధికారికంగా ఒక ప్రకటన చేస్తే బాగుండేదన్న వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలకు, బడా పారిశ్రామికవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘నోట్ల రద్దు’ నిర్ణయంపై ప్రధాని తనకు తానుగా ఉభయ సభల్లో వివరణ ఇచ్చి ఉంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్టమయ్యేది.

11/21/2016 - 23:10

పెద్దనోట్ల రద్దు తర్వాత సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటు ఉభయసభల్లో అర్థవంతమైన చర్చ జరిపి పరిష్కార మార్గాలను సూచించటంలో అధికార, ప్రతిపక్షాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇరుపక్షాలు ఈ వ్యవహారాన్ని తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయే తప్ప ప్రజల ఇబ్బందులు, వాటి నివారణకు అనుసరించవలసిన మార్గాలపై దృష్టి కేంద్రీకరించలేకపోయాయి.

11/15/2016 - 06:38

ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడంతో దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖలు సమూలంగా మారిపోతాయన్న వాదనలు వినిపిస్తుండగా, మరోవైపు దాదాపు అన్ని రా జకీయ పార్టీలూ బెంబేలెత్తిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని విపక్ష పార్టీలు నోట్లరద్దును జీర్ణించుకోలేకపోతున్నాయి.

11/07/2016 - 23:50

పలు విధాలుగా దేశానికి మేలు జరగాలంటే లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ (జమిలి ఎన్నికలు) జరపాలన్న డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఈ విషయంలో విభేదాలకు అతీతంగా రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలని మేధావులు సూచిస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రజలకు, రాజకీయ నాయకులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. ఎన్నికల ఖర్చును కూడా భారీగా తగ్గించుకునే వీలుంటుంది.

Pages