S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

05/02/2017 - 00:42

ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదం, నక్సలైట్ల ఆగడాలను అరికట్టటంలో ఎందుకు విఫలమవుతోంది? పెద్దనోట్ల రద్దు ద్వారా సీమాంతర ఉగ్రవాదం, నక్సలిజం నడ్డి విరిచామని ప్రకటించుకున్న బిజెపి ప్రభుత్వం అసలు లక్ష్యాన్ని సాధించలేకపోవటం ఆశ్చర్యకరం.

04/25/2017 - 07:07

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బి.జె.పి ఘన విజయాలు సాధిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనటంతో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. బి.జె.పికి ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం హస్తగతం కావటంతో ప్రతిపక్షాల అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాయి.

04/18/2017 - 08:49

కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాశ్మీర్‌ను కాపాడుకునేందుకు ఇప్పుడైనా గట్టి చర్యలు తీసుకొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. చైనా పాకిస్తాన్‌తో కుమ్మక్కై ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వాడర్ ఓడరేవుకు అతిపెద్ద రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్డు నిర్మాణాన్ని కొనసాగనివ్వటమే భారత్ చేస్తున్న పెద్దతప్పు.

04/11/2017 - 00:46

సజావుగా సాగుతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పరువును ‘శివసేన’ సభ్యులు బజారున పడేశారు. ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఒక అధికారిని ఇరవై నాలుగుసార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్‌కు మద్దతుగా ఆ పార్టీ సభ్యులు లోక్‌సభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజుపై దాడికి యత్నించడంతో పార్లమెంటు పరువు పోయింది.

04/04/2017 - 00:21

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినప్పటి నుండి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల్లో నీరసం ఆవహించింది. గతంలో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల్లో గతంలో కనిపించిన ఉత్సాహం, సమైక్యత, ఆత్మవిశ్వాసం ఇటీవల బాగా లోపించాయి.

03/21/2017 - 01:09

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయంతోపాటు మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాక జాతీయ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మోదీ రథ చక్రాలు ఇలాగే సాగితే కాంగ్రెస్ ముక్త భారత్, విపక్ష ముక్త భారత్ ఏర్పడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

03/14/2017 - 00:44

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ ప్రతిపక్ష పార్టీల అధినాయకులకు కనువిప్పు కావాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు ఐదు రాష్ట్రాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద నోట్ల రద్దు తదితర విప్లవాత్మక నిర్ణయాలకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది.

03/07/2017 - 02:58

ఉత్తరప్రదేశ్‌తోపాటు ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు నేటితో తెరపడింది. ఐదు రోజుల తరువాత అంటే మార్చి 11 తేదీ వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయటంతోపాటు జాతీయ రాజకీయాలను ఒక పెద్ద మలుపు తిప్పుతాయి.

02/28/2017 - 00:51

మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో ‘స్థానిక ఎన్నికల’ ఫలితాలు చూసిన తర్వాతైనా రాహుల్ గాంధీ మేల్కొనకపోతే- రాజకీయ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం నుండి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కాపాడలేరు. మహారాష్టల్రో ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకూ పనికిరాని స్థానాకి పడిపోవటంతో పాటు ‘శివసేన’ పంచన చేరవలసిన దుస్థితికి చేరింది.

02/21/2017 - 00:57

ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల తప్పులను ఎండగట్టటం సమర్థనీయమే కానీ, ఓట్ల కోసం ప్రజలను త ప్పుదోవ పట్టించటం, మభ్యపెట్టటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకు ప్రణాళికలు, పథకాల గురించి చె ప్పుకునే స్వేచ్ఛ ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుంది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెప్పటంతోపాటు ప్రత్యర్థుల విధానాలను ఎండగట్టటం ఎన్నికల ప్రచారంలో భాగమే అవుతుంది.

Pages