S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

01/18/2016 - 23:45

విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగా నిర్వహించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఇదే విధానం కొనసాగింది. ఇజ్రాయిల్‌తో స్నేహం చేస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారని కాంగ్రెస్ భయపడింది. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్‌తో స్నేషం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.

01/12/2016 - 06:58

పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై జైషె మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన దాడి నేపథ్యంలో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనటం అసాధ్యమనే అభిప్రాయం మరింత బలపడుతోంది.

01/05/2016 - 04:48

ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా పార్టీ సిద్ధాంతాన్ని రుద్దేందుకు ప్రయత్నించినంత కా లం వామపక్షాలకు మోక్షం లేదు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ప్లీనంలో లోతు గా ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ వ్యవస్థల్లో సమూల మార్పులు చేయటంలోనూ,వ్యూహాన్ని మార్చుకోవటంలో సీపీఎం విఫలమైంది.

12/28/2015 - 22:51

ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న సాహస దౌత్యం ఆశించిన ఫలితాలు ఇస్తుందా? హిందూత్వవాదిగా ముద్ర పడిన నరేంద్ర మోదీ పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు నేల విడిచిసాము చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

12/22/2015 - 04:48

పార్లమెంటును బలి తీసుకుంటున్న రెండు సంఘటనలు రాజకీయ నాయకుల కనపడని అవినీతికి అద్దం పడుతున్నాయి. అవినీతికి సంబంధించిన ఆరోపణలను కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలా పార్లమెంటును స్తంభింపజేయటం రాజకీయ పార్టీలకు ఎంత మాత్రం తగదు. పార్టీ రాజకీయాలకు మరోసారి పార్లమెంటు సమావేశాలు బలికావడం దురదృష్టకరం. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు.

12/17/2015 - 04:58

కరిమేఘం- అన్నది ఒక వన్యమృగం. ఈ కరిమేఘాన్ని ‘ముళ్లపంది’ అని ‘ఏడుపంది’ అని ‘ఒంటరికాడు’అని కూడ అంటున్నారు. సాధు జంతువైన ఈ కరిమేఘం ‘ఆత్మరక్షణ’ విషయంలో మా త్రం అమిత జాగరూకతతో మెలగుతోంది. అప్పుడప్పుడప్పుడు ‘పంటల’ను భోంచేసి పోతుంది కనుక కరిమేఘానికి ‘పంది’అన్న అపవాదు ఏర్పడి ఉంది!

12/15/2015 - 03:01

నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వివాదంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం తప్పు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యల మూలంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో తమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించటం గర్హనీయం.

12/07/2015 - 23:47

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగుతున్నందుకు అధికార, ప్రతిపక్షాలను రెం డింటిని అభినందించవలసిందే. పార్లమెంటు సమావేశాలు పార్టీ రాజకీయాలకు బలి కాకపోతే దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై అర్థవంతమైన చర్చ జరుగుతుంది, సభ్యులు తమ ప్రాంతంతోపాటు దేశానికి సంబంధించిన పలు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారనేందుకు శీతాకాల సమావేశాలు ప్రబల నిదర్శనం.

12/01/2015 - 05:12

ప్రతిపక్షంతో కలిసి పని చేస్తేనే పార్లమెంటు సజావుగా కొనసాగుతుందనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నందుకు సంతోషించాలి. ప్రతిపక్షంతోపాటు స్వపక్షాన్ని కూడా కలుపుకుని పని చేయాలనే జ్ఞానోదయం కూడా కలిగితే బాగుంటుంది. ప్రతిపక్షంతో కలిసి పని చేయనందుకే గత పదహారు నెలల్లో జరిగిన పార్లమెంటు సమావేశాలు కొట్టుకుపోయాయి.

11/24/2015 - 05:48

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ గుణపాఠం నేర్పించిన ప్రతిపక్షం విజయగర్వంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయకూడదు. ఈ నెల 26 తేదీ నుండి ప్రారంభమవుతున్న శీతాకాల సమావేశాలలోనైనా దేశం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేతుబద్దమైన చర్చ జరిపి పరిష్కారాలు కనుగొనేందుకు అధికార, ప్రతిపక్షాలు చిత్తశుద్దితో ప్రయత్నించాలి.

Pages