S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

10/24/2016 - 23:57

దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనుభవ రాహిత్య రాజకీయాల మూలంగా కుప్పకూలుతోంది. ఆయన వ్యవహారశైలితో విసిగిపోతున్న సీనియర్ నాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు పార్టీపై ఆశలు వదులుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే అంశంపై కాంగ్రెస్‌లో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

10/17/2016 - 22:59

జాతీయ, ప్రాంతీయ రాజకీయాల్లో బంధుప్రీతి, ఆశ్రీత పక్షపాతం పరాకాష్ఠకు చేరాయి. పదవుల్లో ఉన్న అధినాయకులు ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబపాలన కొనసాగిస్తూ కీలక పదవులన్నింటినీ తమ వారికి అంటగడుతున్నారు. అయితే, ప్రజలు తలచుకుంటే అవినీతి మంత్రులు మట్టి కరవకతప్పదనేది కేరళలో రుజువైంది.

10/11/2016 - 06:39

ఉరీ సైనిక శిబిరంపై దాడికి ప్రతిగా భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు జరిపాయా? లేదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేయటం అంటే సైన్యంతోపాటు దేశాన్ని అవమానించినట్లే. భారత సైన్యం సర్జికల్ దాడులు జరపనేలేదంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు సాక్ష్యాలు బైట పెట్టాలని డిమాండ్ చేస్తున్న వారిని దేశ ద్రోహులుగా పరిగణించాలి.

10/04/2016 - 02:05

ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసినంత మాత్రాన పాకిస్తాన్ దారికి వస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. సైన్యం అధీనంలో ఉన్న పాకిస్తాన్ అంత సులభంగా దారికి రాదన్న విషయాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. దెబ్బకు పది దెబ్బలు కొడితే తప్ప పాకిస్తాన్ సైన్యానికి, గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు బుద్ధి రాదు.

09/27/2016 - 01:45

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌కు అభివృద్ధి గురించి పాఠాలు చెప్పేబదులు మన దేశప్రగతిపై దృష్టి కేంద్రీకరించాలంటూ ప్రతిపక్షాలు సూచించండం అర్థరహితం. కనీసం పాక్‌తో వ్యవహరించే విషయంలోనైనా ప్రతిపక్షాలు ప్రధానికి అండగా నిలబడటం మంచిది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ఏ మేరకు అభివృద్ధి చెందింది? పరిపాలన ఏ విధంగా మారుతోంది?

09/20/2016 - 07:57

కుక్కతొక వంకర అనేది మరోసారి రుజువైంది. యురిలోని సైనిక శిబిరంపై ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడి పాకిస్తాన్ కుక్కతోక వంకర విధానానికి మరో నిదర్శనం. ఇస్లామిక్ తీవ్రవాదం ద్వారా భారత దేశంపై ప్రచ్చన్న యుద్ధం కొనసాగిస్తున్న పాకిస్తాన్ వైఖరిలో మార్పు రానేరాదు. పాకిస్తాన్ తనంత తాను మంచి మార్గంలోకి రానప్పుడు గట్టిగా బుట్టి చెప్పటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించకతప్పదు.

09/12/2016 - 23:50

ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేసే బదులు వారిని భక్షించే స్థాయికి ఎదిగిపోయారు. ఓటింగ్ జరిగేంత వరకు ప్రజల కాళ్లావేళ్లా పడే నాయకులు ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వారిని పీల్చిపిప్పి చేస్తున్నారు. ఓటుకు నోటు ఇచ్చి కొన్నాం కాబట్టి ఓటర్లు అంటే ప్రజలు తమ బానిసలు అనే విధంగా వ్యవహరిస్తున్నారు.

08/29/2016 - 23:59

ఇంకా పునాదులు కూడా పడని అమరావతిలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. రెండు వేల ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు ప్రదర్శన మెరుగయ్యేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక కార్యచరణ పథకాన్ని తయారు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

08/22/2016 - 23:52

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు అభివృద్ధి మంత్రానికి బదులు కుల కుతంత్రాలకు పెద్ద పీట వేయటం అత్యంత దురదృష్టకరం. ఈ సంవత్సరాంతం లేదా వచ్చే సంవత్సరం జనవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రాం తీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలు సైతం ముఖ్యమైన కులాలకు చెందిన ప్రజల మద్దతు సంపాదించేందుకు రక, రకాల ఎత్తులు వేయటం రాజకీయ వ్యవస్థకు పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది.

08/16/2016 - 00:11

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, భారత భూభాగమని ప్రకటించినంత మాత్రాన సరిపోదు. శత్రువుల చెరలో ఉన్న భారత భూభాగాన్ని విడిపించుకునేందుకు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అనేది ముఖ్యం.

Pages