S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

10/24/2017 - 01:02

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్‌లో ఐదోసారి అధికారంలోకి వచ్చేందుకు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు, కొత్తగా తెర మీదికి వచ్చిన కులతత్వం, పటేల్ వర్గం రిజర్వేషన్ల రాజకీయం, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాద యాత్రలు గుజరాత్‌లో బి.జె.పి విజయావకాశాలను దెబ్బతీయవచ్చుననే మాట వినిపిస్తోంది.

10/17/2017 - 00:02

వ్యవస్థలోని లోపాలను సరిదిద్దకుండా ఫలితాలు సాధించటం అసాధ్యం. 2022 నాటికి నవ భారతాన్ని నిర్మించాలని కలలు కంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమ లక్ష్య సాధన కోసం పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన నవ భారత నిర్మాణానికి భాగస్వాములు కావాలని గవర్నర్లకు పిలుపు ఇచ్చారు.

10/09/2017 - 23:01

ఇంతకాలం అనధికార అధ్యక్షుడుగా కొనసాగిన రాహుల్ గాంధీ ఈనెలాఖరు నుండి అధికారికంగా అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో రాణించగలుగుతారా? లేదా? అనే అంశం కాంగ్రెస్ లోపల, బైటా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి అధ్యక్ష పదవి చేపడుతున్న గాంధీ కుటుంబ సభ్యుడి నాయకత్వ పటిమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా విఫలమైన వ్యక్తి అధ్యక్షుడిగా రాణించగలుగుతారా?

10/03/2017 - 00:02

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు కూడా నరేంద్రమోదీపై బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బి.జె.పి సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తదితరులు మోదీ ఆర్థిక విధానాలపై పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు.

09/26/2017 - 00:31

మైన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి వచ్చి పలు ప్రాంతాల్లో తిష్ఠవేసిన రొహింగ్యా ముస్లింలను పంపించివేయకూడదంటూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో గత వారం లక్షలాది మంది ముస్లిం మైనారిటీలు ఉద్యమించటం కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించి ఉండాలి.

09/18/2017 - 23:56

వారసత్వ,కుటుంబ,వ్యక్తి ఆధారిత రాజకీయాలకు చరమగీతం పాడనంత వరకు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లలేదు. ఇప్పుడు దేశంలో వారసత్వ రాజకీయం ప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా తయారయ్యింది. ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా మారి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది.

09/11/2017 - 23:43

చైనా వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. సిక్కిం సెక్టార్‌లో 72 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్ ఉద్రిక్తతతకు యుద్ధ ప్రాతిపదికపై తెర దించటంతోపాటు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషె మహమ్మద్, లష్కరే తయ్యబాలను బ్రిక్స్ తీర్మానంలో ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.

09/04/2017 - 23:31

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా కేంద్ర మంత్రిమండలి విస్తరణ ద్వారా కొం డను తవ్వి ఎలుకను పట్టినట్టు వ్యవహరించారు. మంత్రివర్గాన్ని విస్తృత స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలనుకున్న మోదీ చివరకు విస్తరణతో సరిపెట్టుకున్నారు. ఈ విస్తరణ ద్వారా ఆయన ఏం సాధించాలనుకున్నారనేది రాజకీయ విశే్లషకులకు సైతం అర్థం కావటం లేదు.

08/29/2017 - 00:49

సుప్రీం కోర్టు గత వారం రెండు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కేహార్ తన పదవీ కాలం ముగుస్తున్న వేళ వెలువడిన ఈ రెండు తీర్పులు సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం.

08/22/2017 - 00:36

దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే వ్యవస్థీకృత అవినీతి అంతం కావటం ఎంతో అవసరం. వ్యవస్థీకృత అవినీతికి చరమగీతం పాడుతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు వంటి విప్లవాత్మక చర్యల ద్వారా అవినీతిని అంతం చేసే దిశగా ప్రయాణం ప్రారంభించానని ఆయన చెబుతున్నారు.

Pages