S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/01/2018 - 00:34

జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు జో రందుకోవడంతో దేశంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కాగలరా? లేదా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న ప్రధాన ప్రశ్న. భాజపాలోని మరొకరు ఆ పదవి లోకి వస్తారా? ప్రతిపక్ష నేత మరెవరైనా వస్తారా? అన్నది రెండో ప్రశ్న. తిరిగి లోక్ సభలో సొంతంగా భాజపా ఆధిక్యతను సంపాదించుకుంటే మోదీ మరోసారి ప్రధాని కావడం తథ్యం.

08/31/2018 - 00:32

విభిన్నంగా ఆలోచించే వర్తమాన రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ముం దు వరసలో నిలుస్తారు. ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రిగా కావచ్చు, పార్టీని శాసించే అధ్యక్షుడిగా కావచ్చు. ఆయనది ఒక విలక్షణ శైలి.

08/29/2018 - 00:31

తెలుగు వాడుక భాష వ్యాప్తి కోసం అలనాడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు చేసిన కృషి చిరస్మరణీయం. వాడుక భాషోద్యమ పితామహుడిగా, సంఘ సంస్కర్తగా చెరగని ముద్ర వేసిన ఆయన జన్మదినాన్ని (ఆగస్టు 29) ఏటా ‘తెలుగు భాషా దినోత్సవం’గా పాటిస్తున్నాము. గ్రాంథిక భాషతో కఠినంగా ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి, వ్యవహారిక భాషలోని అందాన్ని, వెసులుబాటును లోకానికి తెలియచెప్పిన మహనీయుడు ‘గిడుగు’.

08/26/2018 - 03:40

ఈమధ్య జాతీయ మాధ్యమాలలో ‘మూకదాడి’ (లించింగ్)పై చర్చ జరుగుతోన్నది. చర్చలలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశే్లషకులు, మేధావులు పాల్గొంటున్నారు. కాని సమాజంలో జరుగుతున్న లించింగ్‌కు గల కారణాలను అనే్వషించి నిరోధించుటకు ప్రయత్నం చేయటాన్ని విస్మరించి కేవలం రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఒకరిపై ఒకరు మాటల దాడులతోటే చర్చలను ముగిస్తున్నారు.

08/25/2018 - 00:21

చైనాను ఆదర్శంగా చూపిస్తూ, యాభై ఏళ్ల క్రితం నక్సల్‌బరీ ఉద్యమాన్ని ప్రారంభించారు కొందరు కమ్యూనిస్టులు. అనంతరం వారే నక్సలైట్లయ్యారు, ఆ తర్వాత మావోయిస్టులయ్యారు. అప్పుడు ఏ చైనానైతే ఆదర్శంగా చూపారో అదే చైనా ఇప్పుడు వారి అంచనాలకు మించిపోయింది. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థికశక్తిగా ఎదిగింది. అనూహ్యంగా దూసుకుపోతోంది. రెండంకెల వృద్ధిరేటును సాధిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది.

08/23/2018 - 21:08

ఆగస్టు 23వ తేదీ తెలుగుజాతికి పర్వదినం. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తెలుగు తేజం’ టంగుటూరి ప్రకాశం పంతులు 1872లో ఇదే రోజున జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, గాంధీజీ ఆదర్శాలను నూటికి నూరుపాళ్లు అమలు పరిచిన ప్రజానేతగా, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

08/21/2018 - 23:33

ప్రపంచం ఇప్పుడు కొత్త ‘మతం’ వైపు పయనిస్తోంది. మతమంటే కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు, విధానాలు, విశ్వాసాలు. మనిషి చుట్టూ పరిస్థితులు మారినప్పుడల్లా మతాలు రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు ‘భగవంతుడు-భక్తి’ చుట్టూ మతం ప్రవహించింది. ఆ విశ్వాసంతో శతాబ్దాలపాటు కొనసాగారు.. కొనసాగుతూ ఉన్నారు. అయితే అదే అంతిమం కాదు, అక్కడే మనిషి ఆగిపోలేదు.

08/19/2018 - 00:26

భారత దేశంలో కులవ్యవస్థ కారణంగా జనంలో అసమానతలు పెరుగుతున్నాయి.. కాబట్టి కుల రహిత సమాజం ఆవిర్భవించాలి.. క్రైస్తవంలో, ఇస్లాంలో కులాలు అసలే ఉండవు.. కేవలం హిందూ మతంలోనే అనేక కులాలు ఉంటాయి..’ అని ఇటీవల కొందరు సరికొత్త వాదనలు చేస్తున్నారు. అయితే- ఇస్లాంలో, క్రైస్తవంలో వేర్వేరు తెగలుంటాయన్న విషయం ప్రస్తావించకుండా వారు హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకొని వివాదాలను రాజేస్తున్నారు.

08/18/2018 - 00:17

సాంకేతికతను ఆలంబనగా చేసుకొని మన దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాల్సిన అవసరం పెరుగుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో అనేకానేక సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్న మాట నిజమే. ఆధునిక నాగరికత, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన జీవన విధానంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. నైతిక విలువలు నానాటికీ దిగజారడం ఆందోళనకర పరిణామం.

08/17/2018 - 00:28

కాలానుగుణంగా సమాజ వైఖరిలో వచ్చిన మార్పువల్ల కాస్త పెద్దగా కనిపించే ప్రతి ఊరిలో నేడు ఒకటి కన్న ఎక్కువ స్కూళ్లు కనపడుతున్నాయి. ప్రతి స్కూలును బేరీజు వేసుకునే అవకాశం రావటం సముచితమే. కానీ, తల్లిదండ్రుల ‘ఆప్షన్ల’ మేరకు పిల్లలు స్కూళ్లకు వెళుతున్నారు. ధనవంతుల పిల్లలు ఒక దగ్గరకు, పేదల పిల్లలకు మరో ఒక స్కూలు వెళ్తున్నారు. ఈనాడు విద్య వ్యాపారంగా మారింది.

Pages