S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

09/17/2017 - 02:24

రచన అనేక రూపాలతో వ్యక్తం అవుతుంది. వాటిని ప్రక్రియలు అంటాం. సృజనాత్మక సాహిత్యంలో అవి ఎక్కువగా ఉంటాయి. చరిత్రలు, డైరీలు, జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అనే ప్రక్రియలు కూడా ఉంటాయి. జీవిత చరిత్రలను ఇతరులు రాస్తారు. స్వీయచరిత్రని తనకు తానే రాసుకుంటాడు.

09/03/2017 - 00:42

‘యాదవ సంస్కృతి, చరిత్ర, కళారూపాలు’ అం శంపై ప్రసంగించడానికి ఆగస్టు 20న చీరాలకి రావలసిందిగా పిలిచారు. మన దేశంలో వృత్తి స్వీకరణ పుట్టుకతోనే తప్పనిసరి. వృత్తులు మారరాని చట్రంలో బిగిసుకునిపోయాయి. మారడానికి ఎవరికీ ఎలాంటి స్వేచ్ఛ లేదు. అలా ఎన్నో శతాబ్దాలు గడిచిపోయాయి. వివిధ కులాలు తమ మూల చరిత్రని, వర్తమాన స్థితిగతుల్ని, తమ జీవన విధానాలను సమీక్షించుకోవడానికి కూడా నోచుకోలేదు.

08/27/2017 - 00:15

బంజారాలకి వున్నన్ని పేర్లు మరే తెగకి లేవు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపించిన తెగ కూడా ఇదే. ఐనా సంస్కృతీ సంప్రదాయాలు, భాష, అంతటా ఒకటే. హంగేరీ వంటి దేశాలలోని రోమాజిప్సీ తెగవారు తాము భారతదేశంనుండి వచ్చామని చెప్పుకుంటారు. ఆ రకంగా బంజారాలు పర దేశాల్లో కూడా జీవిస్తున్నారు. అక్కడ కూడా వీరు సంచార జీవులే!

08/20/2017 - 00:20

ఎప్పటి నుండో కలవాలని అ నుకున్నాం. కాలం కలిసిరాలేదు. అతనే మొన్న హైదరాబాదు వచ్చాడు. వచ్చినవాడు ఊరికే రాలేదు. తన కవితా సంపుటాలతో వచ్చాడు. ‘ఈ పుస్తకాలు చూడొద్దు. చదవండి. కాస్త కష్టమే.ఐనా చదవాలి’ అన్నాడు. అంత అవసరమా? అన్నాను. ఈ కవిత్వం చదవకపోతే ఏ కవిత్వం చదువుతారు? కాస్తంత గట్టిగా అన్నాడు. కవిత్వం ‘అంతరించిపోయే వనరుల్లో’ చేరిందన్నాను.

08/05/2017 - 23:33

గత ఆది, సోమ, మంగళవారాలు గుంజాల గోండి గూడెంలో రెప్పలు తెరిచి మూసేసరికే గడిచిపోయాయి. అక్కడి నుండి వచ్చేప్పుడు ఎన్ని అనుభవాలో, అన్ని గుణపాఠాలు.

07/30/2017 - 01:08

గత ఆదివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మాధవవరం కలాన్ ఊరికి బస్సులో వెళ్లాం. ఒంటరిగా కాదు, ఇరవై నాలుగు మంది రచయితలతో. మేం అక్కడికి చేరేసరికి మరో ముప్పై మంది రచయితలు, కవులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని అక్షరాల్ని బీజాలుగా విత్తాలని మా ఆరాటం. ఎందుకంటే రచయితల వారసత్వంలో పగలు ఉండవు, ప్రేమలు తప్ప. మేం మూకుమ్మడిగా పోయింది అలాంటి ఒక రచయిత జ్ఞాపకాల మననం కోసం.

07/23/2017 - 00:36

ఇది విగ్రహాల యుగం. మనుషులు, వ్యవస్థలు బిజీ బిజీ. వారు విగ్రహాలను తయారుచేస్తున్నారు. వాటిని ఎలా, ఎక్కడ ప్రతిష్ఠించాలో ఆలోచనలు చేస్తున్నారు. ఎంత పెద్దగా నిలపాలో అని సతమతమవుతున్నారు. మొన్న తూర్పుగోదావరి జిల్లాలో తిరుగుతున్నప్పుడు తాటిచెట్ల పొడవును తలదనే్న ఆంజనేయస్వామి విగ్రహాలు అడుగడుగునా కనుపించాయి. తాగునీరు, సాగునీరు, శుభ్రత లేని మురిగ్గుంటలున్న ఊళ్ళల్లో వాడవాడకో విగ్రహం.

07/16/2017 - 01:16

మొన్న పనె్నండో తేదీన వికారాబాద్ దాటి తాండూరు వెళ్లాం. అంతరించిపోతున్న రెండు ఆదిమ కళల పరిస్థితి గురించి, ఆ కళాకారుల జీవన స్థితిగతుల గురించి తెలుసుకోవాలని బయలుదేరాం. నాతోపాటు ఓ ఆంగ్లపత్రిక విలేఖరి, ఫోటో జర్నలిస్టు , పారిస్ నుండి వచ్చిన పరిశోధకుడు డా.డానియల్ నేజర్స్ మాతో జతకలిశారు. నాతో వచ్చిన మహిళా విలేఖరి కినె్నర తంత్రీ వాద్యం గురించి ఓ వ్యాసం రాయాలి.

07/09/2017 - 00:43

మొన్న రెండో తేదీన రాజమండ్రిలో సినారె ప్రత్యేక సంచిక ఆవిష్కరణ. రాజమండ్రి పాత స్నేహితుల పలకరింపులు. సందడిలో రెండు రో జులు కరిగి అనేక జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం. వాటిలో కొన్ని.. మీ ముందుకు..! కొన్ని సాంస్కృతిక నగరాలు ఉంటాయి. వాటిని ఎవరైనా ఆస్వాదించవచ్చు. రాజమండ్రి తీర గోదావరికి ఎప్పుడూ కొత్తనీరు తాకిడే. అక్కడికి ఎవరు వచ్చినా ఆ నగరం స్వాగతం పలుకుతుంది. తనలో ఇముడ్చుకుంటుంది.

07/02/2017 - 00:11

పేదరికం తప్పుకాదు. ప్రతి దైవం పేదగానే పుడతాడు. ప్రజావీరులు సైతం పేదరికంలోంచి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చరిత్రలో నిలిచిపోతారు. పేదరికాన్ని, పేదల్ని ద్వేషించడం అంటే దానిని సృష్టిస్తున్న మనని మనం ద్వేషించుకోవడమే. అది ఒక వాస్తవం! ఎవరు అణచివేసినా పేదలు మొదట దేవుణ్ణి ద్వేషిస్తారు. దైవంలో నమ్మకం ఉన్న రాజు ఎవరైనా సరే నరకయాతన అనుభవించాల్సిందేనని ఒక నమ్మకం.

Pages