S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

11/13/2016 - 06:56

నిన్నటి శుక్రవారం హైదరాబాదు విశ్వవిద్యాలయం హిందీ శాఖ 3‘వేణుగోపాల్‌కి కావ్య-చేతన’2 అం శంపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్నాను. విన్న విషయాల వల్ల మతిపోయింది. అక్కడ చర్చించిన విషయాలు, శనివారం సదస్సు ముగింపు సమావేశంలో నేను మాట్లాడబోయే విషయాలు కలిపి మీతో పంచుకోవాలని ఉత్సుకతతో రాస్తున్న ముచ్చట్లు ఇవి.

10/30/2016 - 00:37

కవిత్వం ఒక జీవ సామాజిక శాస్త్రం. అవసరానుగుణంగా అది ఎన్నో ఆకారాలెత్తుతుంది. దానికి గుణం, దృష్టి, ఆత్మ ఒక వైపు, శైలి, వ్యక్తీకరణ మరోవైపు రక్షణ వలయంగా నిలుస్తాయి. ఈ రెంటిలో ఏది బలహీనమైనా మరొకటి జాగిలపడుతుంది. కవిత్వ దార్ధ్యత ఈ రెంటి కలయికలోంచి ఉత్పన్నం అవుతుంది.

10/23/2016 - 01:03

భూస్వామ్య రాచరిక సంస్కృతి కన్నా భిన్నమైనది ప్రజాసంస్కృతి. ఈ సంస్కృతి నిరంతరం సృజనశీలమైనది. ఉత్పత్తి శ్రమ, శారీరక శ్రమ రెంటి ద్వారా సృష్టింపబడే ఫలితాంశంతోపాటే ప్రజాసంస్కృతి రూ పొందుతుంది. అప్పుడప్పుడు పరికరాలతో చేసే పని (మోట, ఏతాం, రోలు, విసురురాయ వంటివి) లోంచి తీరొక్క రాగం వెలువడుతుంది. ఇక్కడ రాగం ఒంటరి కాదు. సామూహిక జన్యువు. రాగంలో శబ్దం మిళితం అయి ఉంటుంది.

10/09/2016 - 00:43

కొందరిది రాత సాహిత్యం. నోటి సాహిత్యం అందరిది. చాలామందికి అందనిది పుస్తక సాహిత్యం. అలవోకగా అందేదే ప్రజాసాహిత్యం. పుస్తకం హస్త్భూషణం. వౌఖిక పాఠం మస్తకభూషణం. చేతికందడం ముఖ్యమా, బుద్ధికి చేరడం అభిలషణీయమా.. ఆలోచించాలి. క్షేత్ర పర్యటన కోసం సూర్యాపేట, నకిరేకల్లు ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు పలస వెంకటేశ్వర్లు తారసపడ్డాడు. అతను సేకరించిన జానపద సాహిత్యం చూశాక కలిగిన భావాలు ఇవి.

10/01/2016 - 23:57

తెలంగాణా (5 జూన్, 2016) రచయితల వేదిక ఏటిగడ్డ కిష్టాపూర్ పర్యటన జరిపి దాదాపు నాలుగు నెలలైంది. నాలుగు నెల్ల కిందటి జ్ఞాపకాలు రోజురోజుకి ఎక్కవవుతున్నాయ. వాటిని ఈ వారం మీతో-

09/25/2016 - 01:03

రేపు పనె్నండు పటం కథల ప్రదర్శన. కథాగాన కార్యక్రమం. 3 గజాలనుండి 12 గజాల పొడవు వెడల్పుగల పటాలను హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని సిడాస్ట్ ఒక్క చోటుకు తెప్పిస్తున్నది. ఇలాంటి కార్యక్రమం మునుపెన్నడూ జరుగలేదు. పటాలు పుట్టిన వేలేండ్ల నుండి కూడా ఇలాంటి ఆలోచన ఎవరికీ రాలేదా? వచ్చికూడా ఒక చోట చేర్చి చూడాలని అనిపించలేదు.
ఎందువల్ల సాధ్యం కాలేదో?
కారణాలు బలీయంగానే ఉండి ఉంటాయి.

09/18/2016 - 03:02

మీకు గుర్తుందా..

09/11/2016 - 04:04

చాలామంది కవులు తమ సంస్థ రాజకీయ దృక్పథం లేదా ఆ పంథాకి అనుగుణంగా మాత్రమే రాస్తారు. అది తప్పుకాదు. కాని ఆ సాహిత్యమే మొత్తం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందని అనుకోవడం ఆలోచన సరికాదు. ఒకే తాత్విక భూమికతో పనిచేసే రాజకీయ పార్టీల దృక్పథాలు, పంథాలు మాత్రం అనేకం. వాటిలో సాధారణ భావజాలం, పనివిధానం, సామాజిక వాస్తవికతలు, సమస్యలు, మూలకారణాల అవగాహన ఒకటే.

09/04/2016 - 00:15

ఆర్థిక సరళీకరణ, ప్రపంచ బ్యాంకు విధానాలు,

08/28/2016 - 01:11

మనుషుల్లో మానవత్వం అంతరించడానికి కారణాలు అనే్వషించాల్సిన సమయం ఇది.
మానవ సమాజాన్ని మానవీయ కోణంలో నడుపుతామని ప్రతిజ్ఞలు చేస్తున్న ప్రభుత్వ నేతలు, అధికారులు, న్యాయ వ్యవస్థ వంటి పలు రంగాల వైఫల్యంవల్లే మానవీయ భావన తగ్గుతోందా? ఆలోచించాలి.

Pages