S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/03/2018 - 02:14

రోగులకు అవసరం లేని మందులను అంటగట్టడంలో కొన్ని కార్పొరేట్, చిన్నపాటి ఆస్పత్రుల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. తమ ఆస్పత్రుల్లోని మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేయాలంటూ వైద్యులు ఒత్తిడి చేస్తుంటారు. ఈ మోసం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. విదేశాల్లో అయితే రోగాన్ని గుర్తించడం మాత్రమే వైద్యుడి పని.

09/30/2018 - 00:30

నాలుగున్నరేళ్లుగా ప్రజలపై పెనుభారాలు మోపుతూ, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసి భారతదేశాన్ని కార్పొరేట్లకు తాకట్టుపెడుతున్న నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డిఏ సర్కారును సాగనంపడానికి సమయం ఆసన్నమైంది. అవినీతిని అంతం చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధానమంత్రి మోదీ బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలవడంతోపాటు స్వయంగా అవినీతి ఊబిలో కూరుకుపోవడం దారుణం.

09/23/2018 - 01:23

విద్యను ఆర్జించే వయసులోనే యువతీ యువకులలో సేవాభావం, దేశభక్తి, సామాజిక స్పృహ ను కలిగించేందుకు ‘జాతీయ సేవా పథకం’ (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభమైంది. నిరుపేదల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ, సమాజ సేవ చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్ 24వ తేదీన ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా మొదలుపెట్టారు.

09/23/2018 - 01:22

దేశంలో చిల్లర వర్తక రంగంలోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లేదు. ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతకు తలొగ్గి ప్రభుత్వం ఆ పనికి పూనుకోలేదు. అయితేనేం.. రాజమార్గాలు లేనప్పుడు దొడ్డిదారులు వెదకడం, మన ఇళ్లలోకి చొరబడడం విదేశీ బడాకంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య. భారత్‌లో 700 బిలియన్ డాలర్ల మేరకు వ్యాపారానికి అవకాశమున్న చిల్లర వర్తక రంగాన్ని చూస్తూ చూస్తూ అవి వదులుకొంటాయా?

09/22/2018 - 00:32

చమురు ధరలపై చర్చ ముదిరి పాకాన పడింది. ప్రతివాళ్ళ నోటా చమురు మాటే. చమురు లేకపోతే బతుకులేదన్న చందంగా చర్చలు సాగుతున్నాయి. కారణం ప్రపంచ దేశాలలో భారత్ చమురు వాడకంలో మూడవ పెద్ద దేశం. ఒకప్పుడు బస్సులో, రైలులో ప్రయాణం చేయడమే కష్టంగా వుండేది.

09/21/2018 - 00:44

నేను చదువుకునే రోజుల్లో కాళోజీ నారాయణరావు ఆదివారం నాడు పిల్లలందర్నీ కొన్ని ప్రశ్నలు అడిగేవాడు.

09/16/2018 - 00:13

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1724లో తెలంగాణలో ప్రారంభమైన ఆసఫ్‌జాహీల పాలన 1948 సెప్టెంబర్ 17న ముగిసింది. రాచరిక వ్యవస్థకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగిడిన రోజు అది.

09/15/2018 - 00:12

కళలబోషించు...వార్తలందించు..
జనవాణి భద్రపరచు...జగతినాకాశవాణి..

09/12/2018 - 00:05

విప్లవకవి వరవరరావు, పౌరహక్కుల ఉద్యమకారులు గౌతమ్ నవలఖా, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్‌సాల్వేస్‌ల ‘గృహ నిర్బంధం’ అనంతరం దేశంలో మావోయిస్టుల అనుకూలురు, హింసకు వ్యతిరేకులు చర్చల్లో మునిగి తేలుతున్నారు. దండకారణ్యంలో సాయుధ పోరా టం చేస్తున్న మావోయిస్టులకు నైతిక బలాన్ని అందించడమేగాక వారి ‘్థంక్ ట్యాంక్’గా వీరు వ్యవహరిస్తున్న వైనమిప్పుడు బట్టబయలైంది.

09/09/2018 - 00:07

అపర రుద్రుడై పాకిస్తాన్ సైనికులను చీల్చి చెండాడి తరిమికొట్టిన వీర సైనికుడు హవల్దార్ అబ్దుల్ హమీద్ గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అబ్దుల్ హమీద్ జూలై 1, 1933న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్ జిల్లాలోని ధూపపూర్ గ్రామంలో సాకినా బేగం, మహమ్మద్ ఉస్మాన్ దంపతులకు జన్మించాడు. అబ్దుల్ తండ్రి వృత్తిరీత్యా టైలరు.

Pages