S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/20/2017 - 21:34

శిశువుకు మాటలు రాగానే ఎందుకు? అనే ప్రశ్న మొదలవుతుంది. ప్రశ్నించడం ఒకరు నేర్పేది కాదు. అది సహజసిద్ధమైంది. ఆకాశాన్ని చూస్తాడు. ఈ చుక్కలు ఎట్లా వెలుగుతున్నాయని ప్రశ్నించుకుంటాడు. ఆకాశం నీలిరంగుగా ఎలా ఉంది? ఎందుకు ఉంది? అన్న ఊహల్లోకి పోతారు. శరీరంపై ఈ పుట్టుమచ్చలు ఎలా వచ్చాయని ప్రశ్నించుకుంటారు. కాళ్లు లేని పాము చెట్టు ఎలా ఎక్కుతుందని తండ్రిని అడుగుతాడు.

12/20/2017 - 01:13

మానవాళి ముందున్న ప్రధాన సమస్యలలో వాయుకాలుష్యం ఒకటి. మనుషులకే కాదు జీవరాశి మనుగడకు ఇది హాని కలిగిస్తోంది. పార్టికిల్ పొల్యూషన్ లేదా పార్టిక్యులేట్ మేటర్ (పి.ఎం) అనేది గాలిలో తేలియాడే కణరూపద్రవ్యం. ఇది సూక్ష్మ ఘన, ద్రవ కణాల మిశ్రమం. ఇది వాయు కాలుష్యానికి సూచిక. ఇది సహజంగా లేదా మానవకారకంగా ఏర్పడుతుంది. ఈ మిశ్రమం వివిధ పరిమాణాలలో ఉంటుంది.

12/15/2017 - 01:20

తెలుగునేలకు సోకిన ఇంగ్లీషు తెగులు
మాతృభాషను మంచాన పడేసింది.
లెస్సగా వెలిగిన తెలుగు వెలుగుల
దీపం కొడిగట్టింది.. కొండెక్కుతోంది
తెలుగు భాషావైభవం నిండుకుంటోంది..
అక్షరవైభవం కోసం తెలుగుతల్లి పరితపిస్తోంది..
మనకెందుకీ పరభాషా వ్యామోహం
దొరసాని మురిపిస్తోంది.. అమ్మను దూరం చేస్తోంది
తెలుగుతల్లి ఎదురు చూస్తోంది

12/15/2017 - 01:18

అక్షరాలకు మంగళస్నానం చేయించి
పదాలకు పట్టుపరికిణీలు తొడిగి
భావాలకు కస్తూరి తిలకాలు దిద్ది
భావుకత్వ సామ్రాజ్యంలో,
హంసతూలికా తల్పాలపై
అరమోడ్పు కన్నులతో ఒకప్పుడు
అలవోకగా శయనించిన
అనంత సౌందర్యరాశి మన తెలుగు
అలనాటి రాజరాజు కంటికొసల
పసిడిపూల కలలమాల మన తెలుగు
పువ్వులలో, పసిపాపల నవ్వులలో
అమ్మ ప్రేమనయనమ్ముల మేల్‌దివ్వెలలో

12/13/2017 - 22:22

త రగతి గదిలో ఒకప్పుడు ఆరు సంవత్సరాలొచ్చిన పిల్లల నుంచి పాతికేళ్ల వయస్సున్నవారు కనబడేవారు. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మూడేండ్ల నుంచే తరగతి గది లోపల అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఉపాధ్యాయునికి చిన్నపిల్లల మానసిక స్థితి ఏమిటో తెలియవలసిన, వారిని అర్థం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

12/12/2017 - 23:39

ప్రస్తుతం ఆధార్ అనుసంధానం ప్రక్రియపై విస్తృత ప్రచారం జరుగుతోంది. బ్యాంకు ఖాతాలు, పాన్, మొబైల్, వివిధ పొదుపు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై చిటపటలు, నిరసనలు వ్యక్తం అవుతున్నా ప్రజలు అయిష్టంగానైనా అనుసంధానానికి సిద్ధపడుతున్నారు. కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ ఊపందుకుంది.

12/09/2017 - 00:51

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ప్రజలు తమ అభిమతం మేరకు ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవులకు కాలపరిమితి ఉంటుంది. ఆ పదవీకాలం ముగిసేలోపు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తూంటారు. ప్రతి అయిదేళ్లకూ జరిగే ఈ ‘సార్వత్రిక ఎన్నికలు’ పార్లమెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి నిర్వహించడం దేశానికి మంచిది.

12/06/2017 - 21:49

ఆకలి ఉంటేనే దేశంలో ఆహారం ప్రాధాన్యత తెలుస్తుంది. ఒక ప్రసిద్ధ నవలాకారుడు ప్రేమ్‌చంద్ ‘‘వాపస్’’ అన్న నవలలో స్వర్గం నుంచి వాపస్ వస్తున్నానని రాశాడు.
‘‘స్వర్గంలో అప్సరసలున్నారు.. కామం లేదు’’
కావలసినన్ని వంటల రాసులున్నాయి. కానీ ఆకలి లేదు’’..
అట్లాంటి స్వర్గంలో ఉండేదానికన్నా ఆకలితో అలమటించే ప్రపంచంలో ఉంటేనే కదా ధాన్యపు రాసులకు విలువ దొరుకుతుంది!

12/06/2017 - 00:57

మనదేశంలో ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా, విద్య, ఆర్థిక అంశాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సంప్రదాయంగా మారింది. కులవ్యవస్థను కూల్చివేసి ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా అవకాశాలు, రాయితీలు కల్పించడానికి రాజకీయ పార్టీలు, నాయకులు అంగీకరించరు. అందువల్ల సామాజికంగా దయనీయమైన పరిస్థితుల్లో జీవించేవారు తమ ఉనికిని చాటుకుంటూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు.

11/29/2017 - 23:25

ఒకరు చేసిన పనిని ఒక జట్టు అనుసరిస్తుంది. సమాజంలో ఒకరు చేసిన పనిని ఇతరులు అనుకరిస్తారు. నమస్కారం పెట్టటం అన్నది ఒక సంస్కృతి. నమస్కారం చేసుకుంటూ పెద్దలు పోతుంటే పిల్లలు దాన్ని అనుకరిస్తారు.

Pages